Bigg Boss 7 Telugu ఏం పీకుతున్నావ్.. తొంగున్నావా? నామినేషన్‌లో రతికపై శివాజీ ఫైర్
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో తొలివారాన్ని పూర్తి చేసుకొని రెండోవారంలోకి అడుగుపెట్టింది. రెండోవారంలో ఆదివారం రాత్రి జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య ఆగ్రహవేశాలు పెల్లుబికాయి. రెండో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన చర్చలో ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకొన్నారు. రెండోవారం నామినేషన్ల ప్రక్రియ ఎలా జరిగిందంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తూ రూల్స్ వివరించారు. బిగ్‌బాస్ ఎవరిపేరు పిలుస్తారో వారు కేటాయించిన స్థలంలో నిలుచోవాలి. ఆ తర్వాత ఆ కంటెస్టెంట్‌ను నామినేట్ చేయాలనుకొన్న వారు తమ కారణాలు చెప్పాలి. తమ ముందున్న బజర్‌ను ప్రెస్ చేసి ఫ్లష్ చేయాలి అని చెప్పారు.

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో తొలి హౌస్‌మేట్ ఆట సందీప్ నామినేషన్ ప్రక్రియను మొదలుపెడుతూ.. నేను ప్రిన్స్ యావర్‌ను నామినేట్ చేస్తున్నాను అని అన్నాడు. దాంతో నన్ను టార్గెట్ చేయకు అంటూ యావర్ బదులిచ్చాడు. అయితే నేను నామినేట్ చేయాలంటే పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేయాలి అని ఆట సందీప్ అన్నాడు. అయితే పిట్ వద్దకు వచ్చిన ప్రశాంత్.. నేను చేసిన తప్పేమిటి. వాళ్లు గది గిది అన్నారను చెప్పకు అని ప్రశ్నించడం కనిపించింది.
ఇక టేస్టీ తేజ, రతిక మధ్య మాటల యుద్దంగా భారీగానే జరిగింది. నీ భాష నాకు నచ్చలేదు. పీకుతున్నావు అని అనడం నన్ను బాధపెట్టింది అని రతిక అంటే.. నన్ను తిని తొంగున్నావు అంటే నీవు ఏం పీకుతున్నావు అని అనడం తప్పా? అంటూ టేస్టీ తేజ ఘాటైన జవాబు ఇచ్చాడు. దాంతో వారి మధ్య భారీగానే వాగ్వాదం జరిగిందనే విషయం ప్రోమోలో కనిపించింది.
ఇక శివాజీకి, అమర్ దీప్, ప్రియాంక జైన్‌కు మధ్య కూడా వాగ్వాదం భారీగానే జరిగింది. ప్రశాంత్ వేటాడేందుకు వచ్చాడు. వాడికి ఫోకస్ ఉంది. వాడు మగాడు అని అంటే.. మేము పేకాడేందుకు వచ్చామా అన్నయ? అంటూ శివాజీని అమర్ దీప్ ఘాటుగా ప్రశ్నించాడు. ఎవరైనా పాయింట్ చెబితే.. మీరో పాయింట్ చెప్పి దానిని దాబయించే ప్రయత్నం సరికాదు అంటూ ప్రియాంక అంటే.. అందుకు జవాబుగా.. నేను బిగ్‌బాస్ మాట తప్ప ఎవడి మాట వినను అని శివాజీ ఒక్క మాటలో తేల్చాడు. దాంతో అవి ఇక్కడ జరగదు అని ప్రియాంక అంటే.. చాల్లేవమ్మా అంటూ శివాజీ లైట్ తీసుకొన్నాడు.
ప్రోమోలో చివరగా ఇంటిలో తొలి హౌస్‌మేట్ ఆట సందీప్‌కు ఒక అవకాశం ఇస్తూ.. నీవు ఒక్కరిని నేరుగా నామినేట్ చేయవచ్చు అంటూ బిగ్‌బాస్ ఆప్షన్ ఇచ్చాడు. దాంతో ఆట సందీప్ ఒకరిని నామినేట్ చేశాడు. అయితే శివాజీ తనపై రంగు నీళ్లు పడుతుండగా.. డ్యాన్స్ చేస్తూ.. నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి వచ్చాను. నేను ఎంటర్‌టైనర్‌ను అని శివాజీ అనడం ప్రోమోలో కనిపించింది.


Click it and Unblock the Notifications











