Bigg Boss Telugu 7: శోభా పీక పిసకాలన్న శివాజీ.. నాగార్జున దెబ్బకి రివర్స్.. ఇప్పుడేమన్నాడంటే?

బిగ్ బాస్ తెలుగు 7 మరో వారంలో ముగియనుంది. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు కూడా బయటకు వచ్చింది. ఇక 14వ వారం వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. అందులో కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంట్లో ఏ వారంలో ఏ తప్పు చేశారో చెప్పుకువచ్చే గేమ్ ఆడారు. ఇక ఇందులో శివాజీ, శోభా.. తమ తప్పులను చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రియాలిటీ షో చివరి ఘట్టానికి చేరుకుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షోకి మరో వారంలో ఎండ్ కార్డ్ పడనుంది. అయితే 14వ వారంలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ వారం బిగ్ బాస్ ముద్దు బిడ్డ శోభాశెట్టి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. ఇక చివరి వారం అయినటు వంటి 15వ వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే బిగ్ బాస్ ఇంట్లో ఉంటారు.

 Shivaji reverses game on Shobha Shettys comments in Bigg Boss Telugu 7

ప్రస్తుతం బిగ్‌ బాస్ హౌస్‌లో ఉన్న ఏడుగురిలో శోభాశెట్టి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. మిడ్ వీక్ లో మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. అది ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇక తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల అయి ఆకట్టుకుంటుంది. ఈ ప్రోమోలో హోస్ట్‌గా నాగార్జున 14 వారాల్లో మీరు పశ్చాత్తాప పడిన సందర్భం ఏదైనా ఉందా అంటూ కంటెస్టెంట్స్ ను అడిగాడు. దీనికి హౌస్‌లోని కంటెస్టెంట్స్ అంతా తమ అభిప్రాయాలను ప్రేక్షకులకు వివరించారు.

మొదటగా వీల్ దగ్గరకు వచ్చి అంబటి అర్జున్ తిప్పారు. ఇక అతనికి 13వ వారం దగ్గర ముల్లు ఆగడంతో ఆ వారంలో చేసిన తప్పును వివరించాడు. కేవలం బలం ఉంటే సరిపోదు.. బలంతో పాటు జనాల ప్రేమ ఉండాలని ఆ వారంలో తెలిసిందని వివరించాడు. ఆ తర్వాత శోభాశెట్టి వచ్చి వీల్ ను తిప్పగా 9వ వారం వద్ద ఆగింది. దీంతో ఆమె మాట్లాడుతూ యావర్‌ను పిచ్చోడా ‍అని అన్నాను... తాను ఆ మాట అనకుండా ఉండాల్సిందని ఎమోషనల్ అయింది.

 Shivaji reverses game on Shobha Shettys comments in Bigg Boss Telugu 7

ఆ తర్వాత యావర్ వచ్చి తిప్పగా... తనకు 11 వారం దగ్గర ముల్లు ఆగింది. అయితే ఆ వారంలో గేమ్ లో ఫౌల్‌ జరిగింది.. కానీ నేను అది కావాలని చేయలేదు అంటూ వివరించాడు. ఇక ఆ తర్వాత శివాజీ రాగా... 14 వారం దగ్గర ఆగింది. ఇక 14వ వారంలో శివాజీ.. శోభాశెట్టిపై చేసిన కామెంట్స్ గురించి మాట్లాడాడు. తాను వాడిన పదాలు నా వ్యక్తిగత అనుకున్నాను అంటూ వివరించాడు.... కానీ ‍అది ఇతరులకు టచ్‌ అవుతుందనేది మీరు చెప్పాక తెలిసిందని చెప్పుకువచ్చాడు.

తాను అన్నది పొరపాటు అయిండొచ్చని... నేను అన్న మాటల్లో ఆ పదం అనుకోకుండా దొర్లిందని నాగార్జునకు ప్రేక్షకులకు చెప్పాడు శివాజీ. ఇక తన కోసం తాను స్టాండ్ తీసుకున్నప్పుడు ఏది జరగలేదు అంటూ వెల్లడించాడు. అయితే నాగార్జున శివాజీని ఉద్దేశించి బతుకు.. బతికించు అన్న పదం వాడావు.. అది నీ ఫీలాసఫీ అని నాకు అర్ధమైందంటూ చెప్పుకువచ్చాడు. దీంతో ఈరోజు ప్రోమో ముగిసింది. మిగిలిన కంటెస్టెంట్స్‌ కూడా ఎక్కడ తప్పు చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X