Bigg Boss Telugu శోభను ఎవడైనా పెళ్లి చేసుకొంటాడా? అలా చేస్తే కుర్రాడు భయపడిపోడా? శివాజీ ఆగ్రహం
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో ఫన్ టాస్క్‌ల వ్యవహారం శోభాశెట్టి, శివాజీ మధ్య అగ్గి రాజేసింది. ఓ ఆటకు సంబంధించిన రూల్స్ విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. అయితే పద్దతిగా ఉండాలనే విషయంలో ఈ గొడవ కారణంగా పేరెంట్స్‌ను ఇద్దరు గొడవ పెట్టుకొన్నారు. ఈ గొడవలో వారిద్దరూ ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా కామెంట్స్ చేసుకొన్నారు. శోభా, శివాజీ మధ్య జరిగిన కామెంట్ల విషయానికి వస్తే..
శోభాశెట్టి కొన్ని రూల్స్ పెట్టింది. అయితే ఫౌల్ అయ్యారనే విషయంపై సంచాలకులుగా వ్యవహరిస్తున్న శోభా శెట్టి పలుమార్లు రూల్స్ మార్చడంపై శివాజీ మండిపడ్డారు. నాతో మాట్లాడేటప్పుడు పద్దతిగా మాట్లాడు అంటూ శివాజీ అనడంతో.. నీవు నాకు పద్దతి నేర్పకు. నాకు అలాంటి విషయాలు నేర్పాలంటే నాకు పేరెంట్స్ ఉన్నారు అని జవాబిచ్చింది. లైఫ్ అన్నీ నేర్పిస్తాయి శివాజీ చెప్పాడు.

శోభాశెట్టితో గొడవ తర్వాత నేను ఔట్ అంటూ బయటకు వెళ్తూ.. మీరే ఆడుకోండి అని అంటే.. నేను ఆటలో లేను అంటూ ఆమె కామెంట్ చేసింది. దాంతో నేను నిన్ను అనలేదు. అర్జున్‌కు చెప్పాను అంటూ శివాజీ బదులిచ్చాడు. నీ తీరు బాగాలేదు. ఐదు నిమిషాల్లో ఎన్నిసార్లు మాట మార్చావు అంటూ శివాజీ మండిపడ్డాడు.
అయితే నీవు బాగా అరిచావు. వెళ్లి రెస్ట్ తీసుకో అంటూ శివాజీపై శోభాశెట్టి సెటైర్ వేసింది. దాంతో నీవు అతిగా మాట్లాడకు.. నేను ఏమీ తప్పు మాట్లాడలేదు. నీవు ఓవరాక్షన్ చేయకు అంటూ శివాజీ అన్నాడు. చాలా డ్రామాలు ఆడుతున్నది అంటూ శోభాశెట్టి శివాజీపై మండిపడ్డారు.

గేమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమర్‌దీప్‌తో శివాజీ మాట్లాడుతూ.. అలా మాట్లాడుతారా? అలా బిహేవ్ చేస్తారా? ఆమె తీరు చూస్తే.. ఎవడైనా పెళ్లి చేసుకొంటాడా? ఇలా బిహేవ్ చేస్తే పెళ్లి చేసుకొనే ముందు కుర్రాడు భయపడరా? అది ఎంతరా అది.. చిన్న పిల్ల అంటూ శివాజీ కామెంట్ చేశాడు.
శివాజీ తనలో తాను మాట్లాడుకొంటూ శోభాశెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. మన లైఫ్‌లోకి వస్తే ఎలా ఉండాలనేది ఓ గుణపాఠం. ఇంటిలో మన ఆడపిల్లలైతే పీకే వాడిని అంటూ ప్రశాంత్ ముందు ఘాటుగా స్పందించాడు. శోభాశెట్టి, శివాజీ మధ్య జరిగిన గొడవ హాట్ హాట్‌గా కనిపించింది.


Click it and Unblock the Notifications











