Bigg Boss Telugu 7: షోలో ఊహించని సీన్.. ప్రియాంకకు షాకిచ్చిన శివ్‌కుమార్.. అది విడిపోయేంత తప్పా?

బుల్లితెర చరిత్రలోనే సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసి.. ఆశించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోన్న ఏకైక షో బిగ్ బాస్. చాలా కాలం నుంచే హిందీ సహా పలు భాషల్లో ప్రసారం అవుతున్నప్పటికీ.. దేనికీ తెలుగులో కంటే ఎక్కువ రేటింగ్ రావడం లేదు. అంతలా ఈ షో హవాను దేశ వ్యాప్తంగా చూపిస్తోంది. అందుకే ఆరు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు నడుస్తోన్న ఏడోది కూడా అదే రీతిలో ముందుకు సాగుతోంది. ఇక, తాజాగా హౌస్‌లోకి వచ్చిన శివ్‌కుమార్ ప్రియురాలు ప్రియాంక జైన్‌కు షాకిచ్చాడు. ఆ సంగతులేంటో చూద్దామా!

ఫ్యామిలీ వీక్.. ఫస్ట్ డే వాళ్లంతా:బిగ్ బాస్ ప్రతి సీజన్‌లోనూ కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. గతంలో అన్ని సీజన్లలోనూ ఇదే తరహాలో వాళ్లను తీసుకొచ్చారు. ఇక, ఏడో సీజన్‌కు సంబంధించి ఇప్పుడు అది జరుగుతోంది. ఇందులో మొదటి రోజు శివాజి కొడుకు కెన్నీ, అర్జున్ భార్య, అశ్వినీ మదర్‌లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తెగ సందడి చేసేశారు.

Shivakumar Gives Suggestions to Priyanka Jain in Bigg Boss Telugu 7 Family Week Episode

ప్రియాంక కోసం శివ్‌కుమార్:ఫ్యామిలీ వీక్‌లో భాగంగా బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రియాంక జైన్ కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి ఆమె ప్రియుడు శివ్‌కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుండగా వచ్చిన అతడు.. ఆమెకు రెడ్ రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అనంతరం హగ్గులు, ముద్దుల వర్షం కురిపించేశాడు. ఆ సమయంలో అటు ప్రియాంక, ఇటు శివ్‌కుమార్ ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు.

అందరితో మాట్లాడిన హీరో:ప్రియాంక జైన్ కోసం వచ్చిన శివ్‌కుమార్‌కు ఇంటి సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అతడు ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి తనదైన శైలిలో వివరించాడు. ఈ క్రమంలోనే భోలే షావలి కాళ్లకు నమస్కరించాడు. అందరినీ పొగిడిన తర్వాత అశ్విని చాలా అందంగా ఉంటుందని, రతికా పేరు రెడ్ రోజ్ అని చెప్పాడు. దీంతో ప్రియాంక ముఖం మాడిపోయింది.

Shivakumar Gives Suggestions to Priyanka Jain in Bigg Boss Telugu 7 Family Week Episode

24 గంటలూ వస్తుంది కదా:అందరినీ పలకరించిన తర్వాత శివ్‌కుమార్‌ను ప్రియాంక బెడ్‌రూంలోకి తీసుకెళ్లి చర్చలు మొదలెట్టింది. అప్పుడు అతడు 'మీ అమ్మ నిన్ను బాగా మిస్ అవుతుంది. నేను రోజూ మాట్లాడుతున్నా. మా అమ్మ కూడా మిస్ అవుతుంది. ఒక్కటి గుర్తు పెట్టుకో ఎపిసోడ్ మాత్రమే కాదు లైవ్ 24/7 కూడా ఉంది. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడు ఎప్పుడైనా' అని చెప్పాడు.

నువ్వు ఒక్కదానివే ఆడాలి:ఆ తర్వాత శివ్‌కుమార్ 'నీకు లెటర్‌లో కూడా రాశాను యూ ఆర్ మై ఒన్ మ్యాన్ ఆర్మీ అని. నువ్వు ఒక్కదానివే ఆడు. అర్థమైందా' అని అమర్‌, శోభాతో కలిసి ఆడోద్దని పరోక్షంగా చెప్పాడు. దీనికి ప్రియాంక 'నేను ఒక్కదాన్నే ఆడుతున్నా కదా' అనగా.. 'ఇక్కడ నీకు అలాగే ఉంది. కానీ బయట అలా అనుకోవట్లేదు నీకు ఏదైనా నచ్చకపోతే అక్కడ మాట్లాడు. కానీ ఆ గొడవను సాగదీయకు. అలా సాగదీసి గొడవ పడటం నాకు నచ్చట్లేదు. నా మాటలు బాగా అర్థం చేసుకో' అంటూ శివ్ సూచించాడు.

Shivakumar Gives Suggestions to Priyanka Jain in Bigg Boss Telugu 7 Family Week Episode

నమ్మకం లేదా అనడంతో:అనంతరం శివ్‌కుమార్ 'బయట ఫ్రెండ్‌షిప్ బయటే ఇక్కడ వద్దు. ఎవరూ అవసరం లేదు నీకు. అది చాలా డేంజర్ నీకు. ఇక్కడ బిగ్‌బాస్ కప్పుకు కూడా' అంటూ వేళ్లతో వాళ్లను దూరం పెట్టు అన్నట్లుగా సైగలు చేశాడు. దీంతో ప్రియాంక 'నమ్మకం లేదా' అని ప్రశ్నించింది. దీనికి శివ్‌కుమార్ కాసేపు ఆలోచించి ఉంది అన్నాడు. దీంతో ఆమె శివ్ దృష్టిలో బ్రేకప్ చెప్పేంత తప్పు చేస్తుందా అని పలువురు అనుకుంటున్నారు.

Shivakumar Gives Suggestions to Priyanka Jain in Bigg Boss Telugu 7 Family Week Episode

ఇప్పుడే పెళ్లి చేసుకుందాం:చివర్లో ప్రియాంక.. శివ్‌కుమార్ కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ చాలా మిస్ అవుతున్నా అనేసింది. అంతేకాదు, 'పెళ్లి ఎప్పుడు' అనగా.. అతడు 'వచ్చాక చేసుకుందాం' అన్నాడు. దీనికి ప్రియాంక 'కాదు.. ఇప్పుడే చేసుకుందాం' అంది. దీంతో శివ్‌కుమార్ హత్తుకున్నాడు. అనంతరం అందరికీ టాటా చెప్పేసి అతడు వెళ్లిపోయాడు. మొత్తానికి ప్రియాంకకు సుతిమెత్తగా క్లాస్ పీకాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X