Bigg Boss Telugu 7: ప్రశాంత్‌పై భారీ కుట్ర.. మధ్యలోనే ఎలిమినేట్ చేయాలని.. తిప్పికొట్టిన కంటెస్టెంట్
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ షో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ నెంబర్ వన్ షోగా దూసుకుపోతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను తీసుకు వస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులో ఎవరూ ఊహించని ఎన్నో సంఘటనలు జరుగుతన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పల్లవి ప్రశాంత్‌ను ఎలిమినేట్ చేసేందుకు జరిగిన కుట్ర బయట పడింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే!

ఫైనల్ అస్త్ర కోసం పాట్లు: బిగ్ బాస్ ప్రతి సీజన్‌లోనూ గ్రాండ్ ఫినాలే వీక్‌కు రెండు వారాల ముందే కంటెస్టెంట్లకు 'టికెట్ టు ఫినాలే' అనే టాస్కును ఇస్తూ ఉంటారు. ఇది గెలుచుకున్న ఒకరు నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెడతారు. ఇక, ఏడో సీజన్‌కు సంబంధించి ఈ టాస్క్‌ను 'ఫైనల్ అస్త్ర' అనే పేరుతో ప్రారంభించారు. ఇందులో కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు గెలిచేందుకు ఎన్నో పాట్లు పడ్డారు.
వాళ్లంతా ఔట్ అయ్యారు: బిగ్ బాస్ ఫైనల్ అస్త్ర టాస్కులో భాగంగా కొన్ని రౌండ్లలో గేమ్స్ ఆడించారు. తక్కువ పాయింట్లు వచ్చిన వాళ్లను ఎలిమినేట్ చేశారు. అలా ముందుగా దీని నుంచి శివాజి, శోభా శెట్టి ఎలిమినేటై తమ పాయింట్లను అమర్‌దీప్ చౌదరికి ఇచ్చారు. ఆ తర్వాత ప్రియాంక జైన్ పాయింట్లను గౌతమ్‌కు ఇచ్చేసింది. అనంతరం యావర్ ఎలిమినేట్ అయి పల్లవి ప్రశాంత్‌కు త్యాగం చేశాడు.
గౌతమ్ ఔట్.. అమర్‌కు: యమ రంజుగా సాగుతోన్న ఫైనల్ అస్త్ర పోటీలో గురువారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత అమర్‌దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణలు నాలుగు స్థానాల్లో నిలిచారు. ఐదో ఆ తర్వాత జరిగిన టాస్కులో గౌతమ్ కృష్ణ కూడా ఓటమి పాలయ్యాడు. దీంతో అతడు ఈ టాస్కు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అతడి పాయింట్లను అమర్‌దీప్ చౌదరికి ఇచ్చేశాడు.

ప్రశాంత్‌పై వాళ్లు కుట్ర: ఫైనల్ అస్త్ర పోటీ నుంచి గౌతమ్ కృష్ణ ఔట్ అవడంతో చివరికి అమర్‌దీప్ చౌదరి, అంబటి అర్జున్, పల్లవి ప్రశాంత్‌లు మిగిలారు. వీళ్ల ముగ్గురిలోనే ఒకరు 'టికెట్ టు ఫినాలే'ను గెలుచుకుని మొదటి ఫైనలిస్టుగా నిలిచే పరిస్థితి వచ్చింది. అప్పుడు శోభా శెట్టి క్రూరంగా ఆలోచించి పల్లవి ప్రశాంత్‌ను ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేసేలా ఓ కుట్రతో కూడిన ప్లాన్‌ను రెడీ చేసింది.
అమర్‌ను రెచ్చగొట్టేసి: తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శోభా శెట్టి 'అరెయ్ అమర్.. ఈ ఫైనల్ అస్త్ర కూడా ప్రశాంత్ గెలిస్తే మనం ఎందుకురా? ఇప్పటికే హౌస్‌మేట్ అయ్యాడు.. ఎవిక్షన్ పాస్ గెలిచాడు. ఇప్పుడు కూడా వాడే గెలిస్తే మనం ఉండి కూడా వేస్ట్. అందుకే నువ్వు వెళ్లి అర్జున్‌తో మాట్లాడు. ఒకవేళ చివర్లో ఏదైనా తేడీ జరిగితే తన పాయింట్లను నీకే ఇవ్వమని చెప్పు' అంటూ అమర్‌దీప్‌ను రెచ్చగొట్టేసింది.

అర్జున్‌ను బ్రతిమాలి: శోభా శెట్టి మాటలకు ప్రభావితం అయిన అమర్‌దీప్.. ఆ వెంటనే అర్జున్ దగ్గరకు వెళ్లి ప్లాన్ అమలు చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు 'అన్నా.. పల్లవి ప్రశాంత్ గాడు ఇప్పటికే ఎవిక్షన్ పాస్ గెలిచాడు. మళ్లీ వాడే ఇది కూడా గెలిస్తే వేస్ట్ అన్నా. అందుకే కొంచెం ఆలోచించు. చివర్లో ఏదైనా చాన్స్ ఉంటే నాకే నీ పాయింట్లు ఇవ్వు ప్లీజ్ అన్నా' అంటూ బ్రతిమాలడం మొదలెట్టాడు.
తిప్పికొట్టిన అర్జున్: పల్లవి ప్రశాంత్‌ను ఎలిమినేట్ చేసేలా శోభా శెట్టి, అమర్‌దీప్ వేసిన ప్లాన్‌ను అంబటి అర్జున్ తిప్పికొట్టాడు. తన దగ్గరకు వచ్చి బ్రతిమాలుతున్న సమయంలో 'ప్రశాంత్ గాడు గెలిస్తే ఏంటిరా? వాడు కూడా ఈ ఇంట్లో మెంబరే కదా. వాటికి కూడా అర్హత ఉంది కదా. అయినా అప్పుడు ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను' అని చెప్పాడు. అలా అమర్, శోభా కన్నింగ్ ప్లాన్ తిప్పి కొట్టాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌తో వీళ్లిద్దరూ మరోసారి పరువు పోగొట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











