Bigg Boss 7 Telugu: అసభ్యంగా ప్రవర్తించాడు.. బాడీని టచ్ చేశాడు.. బిగ్ బాస్‌కు శోభా, రతిక కంప్లైంట్

ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి పరిచయమై.. ఎవరూ ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో స్పందనను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. పాశ్చాత్య నాగరికతకు అద్దం పట్టే అంశాలతో నడిచే ఈ కార్యక్రమానికి మన ప్రేక్షకులు పడిపోయారు. ఫలితంగా ఈ షో సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో నిర్వహకులు సీజన్లను క్రమం తప్పకుండా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో దాన్ని మొదలు పెట్టారు. ఇక, తాజాగా ఓ కంటెస్టెంట్ అసభ్యంగా ప్రవర్తించాడని లేడీస్ బిగ్ బాస్‌కు కంప్లైంట్ చేశారు. ఆ డీటేల్స్ మీరే చూడండి!

ఊహించని సీజన్‌తో మజా:తెలుగులో బిగ్ బాస్ షో క్రమం తప్పుకుండా ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని గతంలో ఎన్నడూ చూడని ఉల్టా పుల్టా కంటెంట్‌తో తీసుకు వచ్చారు. ఫలితంగా ఈ సీజన్ కొత్త కొత్త అంశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో దీనికి ప్రేక్షకుల మద్దతు కూడా బాగానే లభిస్తోంది. ఫలితంగా మంచి రేటింగ్ దక్కుతోంది.

Shobha Shetty and Rathika Allegations on Tasty Teja In Bigg Boss 7 Telugu Show

14 మందిలో అతడు ఫన్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుని హైలైట్ అయ్యారు. అందులో జబర్ధస్త్ మాజీ కమెడియన్, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ ఒకడు. అతడు ఆరంభం నుంచే తనదైన కామెడీని పంచుతూ, విచిత్రమైన డ్రెస్సింగ్‌తో క్రేజీగా అనిపించాడు. ఆరంభం నుంచీ ఫన్ అందిస్తున్నాడు.

వినోదాన్ని పంచినా కూడా:బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే టేస్టీ తేజ తనదైన రీతిలో కామెడీని పంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరినీ గౌరవంగానే పలకరిస్తూ, అప్పుడప్పుడూ పంచులు, సెటైర్లు వేస్తూ సందడి చేస్తున్నాడు. మధ్యలో కాస్త ఓవర్ యాక్షన్ చేయడంతో విమర్శలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ తన పంథాను కంటిన్యూ చేసుకుంటూ మజాను పంచుతూనే ఉన్నాడు.

శోభాతో తేజ ఎక్కువ క్లోజ్:బిగ్ బాస్ హౌస్‌లో టేస్టీ తేజ అందరితోనూ మంచిగానే ఉంటున్నాడు. కానీ, ఎక్కువగా శోభా శెట్టితో అతడు క్లోజ్‌ అయిపోయాడు. తరచూ ఆమెతోనే ఉంటూ, ఆమె చెప్పినట్లే చేస్తూ సరదాగా సాగిపోతోన్నాడు. ముఖ్యంగా శోభను తరచూ 'ఏమో, ఒసేయ్, రావే, పోవే' అంటూ ఆడుకుంటున్నాడు. అలాగే, మరికొందరు అమ్మాయిలకు సైతం తనదైన రీతిలో సెటైర్లు వేస్తున్నాడు.

ఓదార్చమని అడిగాడని:తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అందరి కంటే ముందు బజర్ కొట్టి కంటెండర్ అవుతానని టేస్టీ తేజ, శోభా శెట్టితో చాలెంజ్ చేశాడు. దీనికామె 'నువ్వు ఏ రౌండ్‌లో అయినా బజర్ కొడితే.. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను' అంది. ఆ తర్వాత అతడు ఓడిపోవడంతో ఆమె దగ్గరకు వచ్చి 'నన్ను ఓదార్చు. ఒక హగ్ ఇవ్వు' అని అడిగాడట. ఈ విషయాన్ని శోభా బయట పెట్టి షాకిచ్చింది.

అసభ్యంగా ప్రవర్తించాడు:అక్కడితో ఆగని శోభా శెట్టి 'బిగ్ బాస్ చూడండి. ఓదార్చమని హగ్ ఇవ్వమని అడుగుతున్నాడు. నన్ను ఫిజికల్ అబ్యూస్ (శారీరకంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు) చేస్తున్నాడు. నన్నే కాదు.. రతికను కూడా హగ్ ఇవ్వమని బలవంతం చేశాడు' అని కంప్లైంట్ చేసింది. దీంతో అక్కడే ఉన్న రతికా కూడా పూరీలు చేసే కర్ర తీసుకుని వచ్చి టేస్టీ తేజను కొట్టడానికి ప్రయత్నించింది.

వేడుకున్న టేస్టీ తేజ:ఒకవైపు శోభా శెట్టి, మరోవైపు రతికా రోజ్ తనపై ఆరోపణలు చేయడంతో టేస్టీ తేజ 'అయ్యో.. ఇన్ని కెమెరాలు ఉన్నాయి. నేనేమీ చేయలేదు బిగ్ బాస్. నేను అభాగ్యుడిని మాత్రమే. వీళ్లు నాపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా ఫన్నీగానే జరిగినా.. తేజ గతంలోనూ ఇలా చేయడంతో చాలా మంది నిజమే అని అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X