Bigg Boss Telugu 7: శోభా శెట్టికి కాబోయే భర్త అతడేనట.. పెళ్లికి కూడా రావాలంటూ పిలుపు!

బిగ్ బాస్ సీజన్ 7 చాలా అద్భుతంగా సాగుతోంది. అద్భుతమైన టాస్కులు, అంతకు మించిన ఎమోషన్లతో ఈ రియాల్టీ షో అదిరిపోతోంది. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్లతో హౌస్ అంతా ఫుల్ హీటెక్కిపోగా.. బిగ్ బాస్ తాజాగా ఓ టాస్కు ఇచ్చాడు. దీంతో ఇళ్లంతా ఫుల్ చల్లబడిపోయింది. ఇల్లే కాదండోయ్ బాబు.. కంటెస్టెంట్లు కూడా ఫుల్ ఖుషీ అయిపోయారు. ముఖ్యంగా కడుపుబ్బా నవ్వుకొని తెగ ఎనర్జీ తెచ్చుకున్నారు. ఈక్రమంలోనే శోభా శెట్టికి సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తనకు కాబోయే భర్త గురించి కొన్ని కామెంట్లు చేసింది. ఆపై తన పెళ్లికి బిగ్ బాస్ సహా అందరూ రావాలంటూ కామెంట్లు కూడా చేసింది.

తాజాగా విడుదలైన ప్రోమోలో.. బిగ్ బాస్ హౌస్ మేట్లకు ఓ అదిరిపోయే ఫన్నీ టాస్కు ఇచ్చారు. ముఖ్యంగా మగవారందరికీ ఓ బాధ్యతను అప్పగించారు. అదేంటి అంటే.. ఇంట్లోని మగవారంతా కలిసి ఆడవాళ్ల కోసం స్పెషల్ గా బ్రేక్ ఫాస్ట్ తయారు చేసి ప్రేమతో సర్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈరోజంతా వారిని మహారాణుల్లా చూస్కోవాల్సి ఉంటుంది. ఈ విషయం వినగానే అమ్మాయిలు అంతా ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. వెంటనే టేస్టీ తేజ లేచి.. ఏంటీ మహారాణుల్లా చూస్కోవాలా. రోజూ అలాగే కదా చూసుకుంటున్నాం అంటూ చెప్పుకొస్తాడు.

 Shobha Shetty And Tasty Teja Shocking Comments About Thier Marriage in Bigg Boss House

ఇక ఆ తర్వాత టేస్టీ తేజ.. చాలా కష్టపడి శోభా శెట్టిని ఎత్తుకుంటాడు. అబ్బో దీని దుంపతెగ అంటూనే ఎత్తుకొని ఆమెను బాత్రూంకు తీసుకెళ్తాడు. ఇదవ్వగానే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్.. ప్రియాంక జైన్ కు టిఫిన్ తనిపిస్తాడు. కిచెన్ దగ్గర కూర్చున్న శోభా శెట్టి.. నేను ఈ వాటర్ మిలన్ అస్సలే తినను అనగా.. వేరేది తీస్కో అని అంబటి అర్జున్ కు చెబుతుంది. వెంటనే అర్జున్ ఆర్డర్లు ఎవడు ఏయమన్నాడురా.. అనగా అంతా ఘొల్లుమని నవ్వారు. ఇక వెంటనే బాబూ ప్లేట్ తీసుకురామ్మా అంటూ శోభా శెట్టి.. తేజను పిలవగానే బాబు పరిగెత్తుకు వచ్చాడు.

 Shobha Shetty And Tasty Teja Shocking Comments About Thier Marriage in Bigg Boss House

తనచేత్తో శోభాశెట్టి పళ్లు తోమిన టేస్టీ తేజ
ఆ తర్వాత అశ్వినికి తేజ మేకప్ వేయడం, ప్రియాంకకు అమర్ దీప్ కాళ్లు పట్టడం మనం చూడొచ్చు. ఆ తర్వాత శోభా శెట్టి, టేస్టీ తేజ బాత్రూంలో ఉండగా చూపించారు. ఇప్పుడు హెల్త్ బాలేదనుకో ఓ హస్బెండ్ గా ఏం చేయాలి అని శోభా శెట్టి అడగ్గానే.. హస్బెండ్ గానా ఓకే ఆ మాట అన్నావు చాలు అంటూ స్వయంగా తన చేతులతోనే శోభా శెట్టికి పళ్లు తోముతాడు. మా పెళ్లికి మీరు కూడా రావాలి బిగ్ బాస్ అంటూ అందరినీ పెళ్లికి ఆహ్వానిస్తాడు. అలాగే బజర్ కొట్టకండి బిగ్ బాస్.. ఆ తర్వాత స్నానం కూడా ఉంటుందంటూ తేజ చేసిన కామెంట్లు నవ్వులు పూయించాయి. ఓవైపు శోభా శెట్టి మోచేయితో తేజను కొట్టగా.. అక్కడే ఉన్న రతికా రోజ్ పడీ పడీ నవ్వుతుంది.

 Shobha Shetty And Tasty Teja Shocking Comments About Thier Marriage in Bigg Boss House

ఈ ఫన్నీ టాస్కులో నిజంగానే తేజ.. శోభా శెట్టిపై చాలా ప్రేమను కురిపించాడు. అందరూ చేసిన దానికంటే వీరు చేసిందే చాలా ఎక్కువగా, హైలెట్ గా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య బాండింగ్ మొదటి నుంచి బాగుండడం వల్లే ఇంత ఫన్ వచ్చిందని అనిపిస్తోంది. ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూస్తే మరింత నవ్వుకునే అవకాశం ఉంటుంది. సో ఈరోజుటి ఎపిసోడ్ ను అస్సలే మిస్సవకండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X