Shobha Shetty: కార్తీకదీపం 2లోకి మోనిత ఎంట్రీ.. నిజమేంటో చెప్పి సర్‌ప్రైజ్ చేసిన శోభాశెట్టి!

కార్తీక దీపం సీరియల్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కథతో తెరకెక్కిన ఈ సీరియల్ టీఆర్పీలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ఈ సీరియల్ వచ్చే సమయానికి అనేక మంది అంతా టీవీల ముందు వాలిపోయే వారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబుల పాత్రలు అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. అలాగే విలన్ గా కనిపించిన మోనితకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు.

ఇలా విపరీతమైన క్రేజ్ సంపాధించుకున్న మోనిత (శోభాశెట్టి) బిగ్ బాస్ కు కూడా వెళ్లింది. అయితే అక్కడ అద్భుతమైన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సీరియల్ కు సీక్వెల్ రాబోతుంది. ముఖ్యంగా కార్తీకదీపం 2 వస్తుండగా.. నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ లు కనిపించబోతున్నట్లు ఇటీవలే చూసిన ప్రోమో చూస్తేనే అర్థం అయింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కార్తీకదీపం 2 సీరియల్ లో కనిపించబోతుందా లేదా అనేదానిపై క్లారిటీ ఇచ్చింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Shobha Shetty Clarrity About Her Monitha Character in Karthika Deepam 2

శోభాశెట్టికి అసలు గుర్తింపు వచ్చిందే కార్తీక దీపం సీరియల్ వల్ల. ఇందులో నిరుపమ్ ను ప్రేమించి, ఆయనను పొందేందుకు ఆమె చేసిన ప్లాన్ లతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు రాబోతున్న కార్తీకదీపం 2 సీరియల్ లో కూడా ఈ ముద్దుగుమ్మ కనిపించబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మళ్లీ మోనితగా ఈమెనే కనిపిస్తుందని కూడా టాక్ నడిచింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఈమె కార్తీక దీపం 2 సీరియల్ లో కనిపించబోతుందా లేదా అనే దానిపై చెప్పుకొచ్చింది. అయితే తనకు ఎంతో గుర్తింపు తీసుకు వచ్చిన ఈ సీరియల్ లో నటించాలని తనకు ఉందని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మకు ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ రాలేదని కూడా క్లారిటీ ఇచ్చింది. తనకు ఫోన్ వస్తే.. ముఖ్యంగా గతంలో ఉన్నట్లుగానే నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ లకు సమానంగా తన పాత్ర ఉంటే కచ్చితంగా ఓకే చెబుతానని వివరించింది.

కానీ ఇంకా కాల్ రాలేదని.. వస్తే మాత్రం కచ్చితంగా ఈ సీరియల్ చేయడానికి తాను రెడీ అని శోభాశెట్టి వివరించింది. అయితే ఇటీవలే సీరియల్స్ చేయనని చెప్పిన ఈమె యాంకర్ గా మారి కాఫీ విత్ శోభాశెట్టి అనే షో చేస్తుంది. అలాగే తన యూట్యూబ్ పై ఫోకస్ పెంచేసిన ఈమె వీడియోలు చేసుకుంటూ హాయిగా ఉంటుంది. అలాగే మేకప్ కోచింగ్ సెంటర్ తో పాటు సారీస్ కూడా అమ్మేందుకు ప్లాన్ చేస్తోంది. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ ఏం చేయనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X