Bigg Boss Telugu 7 అతడిది మైండ్ గేమ్.. ప్రశాంత్ అలాంటి వ్యక్తి.. సీక్రెట్ బయటపెట్టిన శోభాశెట్టి

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో చివరి వారానికి చేరుకొన్నది. ఈ సీజన్ టైటిల్ రేసులో 6 గురు కంటెస్టెంట్లు మిగిలారు. అయితే 14వ వారాలపాటు ఇంటిలో తన ఆటను కొనసాగించిన కార్తీకదీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభాశెట్టి బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె బిగ్‌బాస్ బజ్ అనే కార్యక్రమంలో తన అనుభవాలను వెల్లడిస్తూ..

బిగ్‌బాస్ ఇంటిలో ప్రియాంక జైన్, అమర్ దీప్‌, టేస్టీ తేజాతో గ్రూప్ గేమ్ ఆడింది నిజమేనని ఓ వీడియో చూసిన తర్వాత ఒప్పుకొన్నది. అయితే గేమ్ స్ట్రాటజీలో భాగమని ఆమె చెప్పుకొచ్చారు. నామినేషన్‌లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, భోలే షవాలీని టార్గెట్ చేశావా? అంటే తెలియదు అని చెప్పింది.

Shobha Shetty Comments on Shivaji Mind Game and Pallavi Prashanth innocence in Bigg Boss Telugu 7

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో శివాజీది మైండ్ గేమ్. ఆయన ఆడే తీరు కరెక్ట్. ఈ షోలో ఎలా ఆడాలో అలానే ఆడుతున్నారు. అందర్ని మెప్పించే ప్లాన్, గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చింది. ఆయన ఆట తీరు బాగుంది అని శివాజీపై శోభాశెట్టి ప్రశంసలు గుప్పించింది.

అయితే పల్లవి ప్రశాంత్ చాలా మంచి వాడు. అలాగనే కొంత మేరకు మంచివాడు కాదు. అందరూ అనుకొన్నంత అమాయకుడు కాదు. కానీ గేమ్‌ను బాగా ఆడుతున్నాడు. అన్ని బిగ్‌బాస్ సీజన్ల షోలను చూసి తనకంటే ఓ గేమ్ ప్లాన్‌తో వచ్చాడు. ఏది ఏమైనా తన ప్లాన్ ప్రకారం ఆడుతున్నాడు అని శోభా శెట్టి అన్నారు.

బిగ్‌బాస్ ఇంటిలో అంబటి అర్జున్, అమర్ దీప్‌కు నా సపోర్ట్ ఉంటుంది. ప్రియాంక జైన్ అంటే నాకు ఇష్టం. ఆమె ఇంటిలో ఉండటం నాకు కొంత జెలసీగా ఉంది. కానీ ఒక అమ్మాయి టైటిల్ రేసులో ఉందని హ్యాపీగా ఉంది. కన్నడ అమ్మాయికి, మోనితగా శోభాశెట్టిని అక్కున చేర్చుకొన్న ప్రేక్షకులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X