ఎట్టకేలకు గుడ్‌న్యూస్ చెప్పిన శోభా శెట్టి... నిరీక్షణకు తెర అంటూ ఎమోషనల్

శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీక దీపం సీరియల్‌లో మోనిక పాత్రతో అలరించిన ఆమె.. బుల్లితెర ప్రేక్షకుల చేత తిట్లు, చీవాట్లు తిన్నారు. దీనిని బట్టి మోనిత పాత్రను ఆమె ఎలా పండించారో అర్ధం చేసుకోవచ్చు. కన్నడ అమ్మాయే అయినా తెలుగు ప్రజలు శోభను అక్కున చేర్చుకున్నారు. నాటి నుంచి హైదరాబాద్‌లోనే స్థిరపడిపోయిన శోభ ఇక్కడే అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా ఆమె గుడ్ న్యూస్ చెప్పారు.

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శోభా శెట్టి.. తొలుత కన్నడ బుల్లితెరపై అడుగుపెట్టారు. అగ్నిసాక్షి అనే కన్నడ సీరియల్‌లో అను అనే పాత్ర పోషించారు. ఈ ఫేమ్‌తో ఆమెకు శాండిల్‌వుడ్ నుంచి పిలుపొచ్చింది. దివంగత పునీత్ రాజ్ కుమార్, రష్మిక మందన్న జంటగా నటించిన అంజనీ పుత్రలో శోభా శెట్టికి మంచి పాత్ర దక్కింది. అనంతరం కావేరి సీరియల్‌లో నటించి మెప్పించారు

Shobha Shetty Enters a New Chapter Launches Designer Studio with Yashwant After Months of Hard Work

తెలుగు టెలివిజన్ రంగం నుంచి కూడా అవకాశాలు రావడంతో తొలుత స్టార్ మాలో ప్రసారమైన అష్టాచెమ్మా సీరియల్‌లో నటించింది. అనంతరం కార్తీక దీపంలో డాక్టర్ మోనిత పాత్ర శోభాశెట్టికి బ్రేక్ ఇచ్చింది. అనంతరం తెలుగులోని పలు ఛానెల్స్‌లో లాహిరి లాహిరి లాహిరిలో, అత్తారింటికి దారేది, హిట్లర్ గారి పెళ్లాం తదితర సీరియల్స్‌లో నటించారు శోభా శెట్టి. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 7లో అవకాశం దక్కించుకుని తన ఆటతీరుతో ఫైర్ బ్రాండ్‌ అనిపించుకున్నారు. శివాజీ లాంటి మాస్టర్ మైండ్‌ షోలో ఉన్నప్పటికీ అందరూ తన గురించి మాట్లాడే చేశారు.

ఆ తర్వాత కన్నడ బిగ్‌బాస్‌లోనూ శోభా శెట్టికి కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది.. తద్వారా రెండు భాషలలో బిగ్‌బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబుకు తమ్ముడిగా నటించిన యశ్వంత్‌తో ప్రేమలో పడిన శోభ.. అతనితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అయితే నిశ్చితార్ధం జరిగి రెండేళ్లకు పైగానే గడుస్తున్నప్పటికీ వీరిద్దరూ ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడంతో ఎక్కడికి వెళ్లినా పెళ్లి ఎప్పుడు? అంటూ అభిమానుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు శోభ. ప్రస్తుతానికి యూట్యూబ్‌లో వీడియోలు, వ్లాగ్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. దాంతో శోభా శెట్టి నట జీవితానికి గుడ్ బై చెప్పేశారంటూ గాసిప్స్ వైరల్ అవ్వగా.. వాటిని శోభ ఖండించారు.

బుల్లితెర నటీనటులు కూడా స్టార్స్ మాదిరిగానే ముందుచూపుతో ఆలోచిస్తూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. బోటెక్‌లు, బట్టల షాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా శోభా శెట్టి కూడా ఓ డిజైనర్ స్టూడియోను పెట్టాలని అనుకుంటున్నట్లు గతంలోనే చెప్పింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది. తాజాగా తను కలలు కన్న విధంగా శోభాశెట్టి డిజైనర్ స్టూడియోస్‌లో తన ప్రియుడు యశ్వంత్‌తో కలిసి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

అప్పుడే 8 నెలలు గడిచిపోయాయి. ఇది రాత్రికి రాత్రి జరగలేదు, నా దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం కూడా లేదు. కేవలం కఠోర శ్రమ మాత్రమే. నా జీవితంలోని ప్రతి దశలోనూ నాకు అండగా నిలిచిన యశ్వంత్.. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శోభాశెట్టి డిజైనర్ స్టూడియోస్ టీమ్‌కి కృతజ్ఞతలు. మీరు మా వద్ద షాపింగ్ చేసినా, మా ప్రయాణంలో భాగమైనా లేక మా పనిని లైక్ చేసి, షేర్ చేసినా మీ మద్దతే నాకు ముఖ్యం. ఈ కలను నిజం చేయడంలో మీరంతా ఎంతో సహకరించారు. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని శోభాశెట్టి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. శోభాశెట్టి- యశ్వంత్‌లకు బుల్లితెర ప్రముఖులు నిరూపమ్ పరిటాల, ప్రియాంక జైన్ తదిరులు విషెస్ తెలియజేస్తున్నారు.

Read more about: shobha shetty karthika deepam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X