Bigg Boss Telugu 7: కాబోయే భర్తపై శోభా షాకింగ్ కామెంట్స్.. షణ్ముఖ్‌ - దీప్తిలా.. పెళ్లి క్యాన్సిల్?

సాదాసీదాగానే తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో చాలా తక్కువ సమయంలోనే సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ఏకైక షో బిగ్ బాస్. మజాను పంచే టాస్కులు, అబ్బురపరిచే సన్నివేశాలతో సాగుతూ ఇప్పటికే ఎన్నో సీజన్లను కూడా ఇది పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఏడో సీజన్ కూడా ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ముఖ్యంగా ఇందులో కొందరు కంటెస్టెంట్లు యమ హైలైట్ అవుతున్నారు. అందులో ఒకరైన శోభా శెట్టి.. తన కాబోయే భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!

బిగ్ బాస్ ఏడో సీజన్‌ను గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్‌గా ఫోకస్ అయ్యారు. వారిలో కార్తీక దీపం ఫేం శోభా శెట్టి ఒకరు. ఈమె నాగార్జున వచ్చే ఎపిసోడ్లలో మంచిగా ఉంటూ.. హౌస్‌లో మాత్రం మోనితలా మారిపోతూ రచ్చ రచ్చ చేసేస్తోంది.

Shobha Shetty Feels Tension about Boyfriend in Bigg Boss Telugu 7 Show

మొదట్లో కాస్త మంచిగానే గేమ్ ఆడిన శోభా శెట్టి.. ఈ మధ్య కాలంలో మాత్రం బాగా ఫైర్ అవుతుంది. తనను ఎవరైనా నామినేట్ చేసినా.. కెప్టెన్సీ కంటెండర్‌గా ఉండడానికి అర్హత లేదు అన్నా.. టాస్కుల్లో ఓడిపోయినా యమా రెచ్చిపోతుంది. ఈ క్రమంలోనే చాలా మందితో గొడవలు పడుతోంది. దీంతో ఆమె పలుమార్లు డేంజర్ జోన్‌లోకి సైతం వెళ్లిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్‌లో శోభా శెట్టి వ్యవహరించే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గత వారాల్లో ఆమె భోలే షావలి, ప్రిన్స్ యావర్‌‌లపై నోటికి వచ్చిన విధంగా మాట్లాడి చెడ్డపేరును తెచ్చుకుంది. అలాగే, టేస్టీ తేజతో క్లోజ్‌గా ఉంటూ తరచూ వార్తల్లో నిలిచింది. వీటిపై ప్రశ్చాత్తపం మొదలైనట్లు తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శోభా శెట్టిలో కాస్త ఎమోషనల్‌గా మాట్లాడింది.

ప్రిన్స్ యావర్ పట్ల వ్యవహరించిన తీరకు ఓ ఎపిసోడ్‌లో బాధపడిన శోభా శెట్టి.. బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో మాత్రం తన కాబోయే భర్త గురించి మాట్లాడింది. టేస్టీ తేజ దగ్గర కూర్చుని 'నాకు నమ్మకం ఉంది. వాడు (కాబోయే భర్త) నన్ను అర్థం చేసుకుంటాడే. కానీ, వాడికి నచ్చని విధంగా ఏమైనా బిహేవ్ చేసి ఉంటే ఎలా అని భయమేస్తుంది' అని చెప్పింది.

శోభా శెట్టి ఆ తర్వాత 'నాకు ఒక్కొక్కరికి ఒక్కో మెంటాలిటీ ఉంటుంది కదా తేజ.. ఇప్పుడు నీ విషయంలో నేను నీతో ఉన్నాను. నచ్చి ఉండకపోవచ్చు. ఎవరికి తెలుసు చెప్పు' అని టెన్షన్ పడింది. దీంతో తేజ 'నేను ఓ కామెడీ పీస్ గాడిని. నన్ను అసలు లెక్క చేయడులే' అన్నాడు. అప్పుడు శోభా 'బై మిస్టేక్ ఏం జరిగినా కూడా నేను తట్టుకోలేను తేజ' అని ఏడ్చేసింది.

అనంతరం శోభా శెట్టి 'తేజా.. నీతో చెబుతున్నా. ఒకవేళ అలా వచ్చినా కూడా నేను తట్టుకోలేను. ఏమో గుర్తుకొస్తున్నాడు బాగా' అంటూ భయపడుతూ ఏడ్చింది. దీంతో టేస్టీ తేజ ఆమెను ఓదార్చాడు. ఇప్పుడు శోభా పరిస్థితిని గమనించిన వాళ్లంతా గతంలో షణ్ముఖ్ జస్వంత్‌కు దీప్తి సునైనా ఈ కారణంగానే బ్రేకప్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు చేస్తున్నారు.

అన్నట్లు శోభా శెట్టి ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు పరోక్షంగా వెల్లడించింది. అంతేకాదు, వచ్చే జనవరిలో అతడితోనే నిశ్చితార్థం చేసుకోబోతుంది. ఈ విషయం అయితే కెమెరాల సాక్షిగానే వెల్లడించింది. అలాంటిది షోలో ఏదైనా తేడా జరిగితే పెళ్లి క్యాన్సిల్ అవుతుందేమో అని ఆమె భయపడుతుంది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X