Shobha Shetty: గృహ ప్రవేశం రోజే శోభాశెట్టికి తీవ్ర నిరాశ.. పూజలకు దూరం, బాధలో యశ్వంత్!

కార్తీక దీపం సీరియల్ లో మోనితగా చేసిన శోభాశెట్టి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కూడా పాల్గొని రచ్చ చోసంది. బయటకు వచ్చిన తర్వాత నుంచి ఫుల్ గా తన కాంట్రన్సేషన్ తన యూట్యూబ్ ఛానెల్ పైనే పెట్టింది. ఇటీవలే తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ఈమె తాజాగా గృహ ప్రవేశం కూడా చేసుకుంది. అయితే చాలా ఘనంగా చేసుకున్న ఈ వేడుకకు ఆమె దూరం అయింది. ఆమె లేకుండానే ఈ గృహ ప్రవేశ వేడుక జరగగా.. ఆమె ప్రియుడు యశ్వంత్ చాలా ఫీల్ అయ్యాడు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో పాల్గొన్న శోభాశెట్టి.. అక్కడ ఉండగానే ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఏకంగా శోభా ప్రియుడు స్టేజీ మీదకు వచ్చి అందరికీ షాకిచ్చాడు. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ లో నిరుపమ్ తమ్ముడిగా నటించిన ఇతడే.. మోనిత రియల్ లైఫ్ లవర్ అని తెలుసుకుని షాక్ అయ్యారు. అలా మొదటి సారి షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నుంచి కూడా వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూ వస్తోంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుగుతోంది. ఎక్కడకు వచ్చిన అతడిని వెంట పెట్టుకునే వస్తుంది.

Shobha Shetty Feels Very Bad About Her House Warming Ceremony Check Details

అయితే స్టార్ మా పరివారం విత్ స్టార్ వార్స్ షోలో భాగంగా ఓసారి నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. రెండు నెలల క్రితమే మరోసారి కుటుంబ సభ్యుల నడుమ నిశ్చితార్థం చేసుకుంది. ముఖ్యంగా తన ప్రియుడిని తొలిసారి తన సొంతూరికి తీసుకెళ్లింది. బెంగళూరులోని నివాసానికి శోభాశెట్టి, యశ్వంత్ రెడ్డిలు కలిసి వెళ్లి.. ముఖ్యంగా తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. అక్కడే ఎంగేజ్ మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా తాను తన ఇంటి గురించి వీడియోలు చేసింది. హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిన ఈ జంట గృహ ప్రవేశం తాజాగా జరిగింది.

అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా శోభాశెట్టి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. అయితే చాలా ఘనంగా జరిగిన గృహ ప్రవేశ వేడుకల్లో తాను చాలా బాధ పడుతూ కనిపించింది. తను మాత్రమే కాదు తన ప్రియుడు యశ్వంత్ కూడా చాలా నిరాశకు లోనయ్యాడు. ముఖ్యంగా ముందు పూజలో పాల్గొన్న ఈమె మధ్యలోంచి కనిపించకుండా పోయింది. అందుకు గల కారణాలు ఏంటో కూడా చెప్పుకొచ్చంది. తనకు గృహ ప్రవేశం పూజ జరుగుతున్న మధ్యలో పీరియడ్స్ వచ్చాయి.

ప్రతీ నెలా ప్రతీ అమ్మాయికి వచ్చే కామన్ పీరియడ్స్ వల్ల.. తాను ఆ పూజలో పాల్గొనకుండా ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా గృహప్రవేశం జరిగే ఇంట్లో కూడా ఉండకూడదని చెప్పగా బయటకు వెళ్లి దూరంగా నిల్చుని చూసింది. దీంతో అంతా అప్ సెట్ అయ్యారు. ముఖ్యంగా శోభాశెట్టి లేకుండానే ఆమె ఇంటి పూజ జరగ్గా..ఆమె తల్లిదండ్రులతో పాటు ప్రియుడు, అత్తలు కూడా చాలా బాధ పడ్డారు. పూర్తి విషయాలు తెలియాలంటే శోభాశెట్టి యూట్యూబ్ ఛానెల్ పో ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X