Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ బజ్‌లో శోభాశెట్టికి బిగ్ షాక్.. అమర్‌దీప్ సీక్రెట్ వీడియో చూసి ఫైర్.. అతడే
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకుంటూ దుమ్మ రేపుతున్న ఈ షోకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే షో ప్రారంభం అయిన మొదటి వారంలోనే ఇంట్లో అడుగు పెట్టిన సీరియల్ నటి శోభాశెట్టి తాజాగా 14వ వారంలో భాగంగా ఎలిమినేట్ అయిపోయింది. అయితే బయటకు వచ్చిన వెంటనే గీతా రాయల్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ బజ్ షోలో పాల్గొంది. అక్కడే షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా అమర్ దీప్ కు తనపై ఉన్న అసలు ఫీలింగ్ ఏంటో తెలుసుకుని ఎమోషనల్ అయింది.
మొదటి వారం నుంచి అమర్ దీప్, ప్రియాంక జైన్ లతో కలిసి ఆట ఆడుతున్నారు. ఈ ముగ్గురికి బిగ్ బాస్ టీం నిర్వాహకుల ఫుల్ సపోర్ట్ ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. వీరు ముగ్గురు ఎన్ని ఫౌల్ గేమ్స్ ఆడినా, కలిసే ఎవరెవరిని నామినేట్ చేయాలో డిసైడ్ చేసుకున్నా బిగ్ బాస్ ఏమీ అనలేరు. కనీసం వీకెండ్స్ లో నాగార్జున కూడా దానిపై గట్టిగా ఫైర్ అవ్వలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ కు ముందు.. శోభాశెట్టి ఓటింగ్ లిస్ట్ లో చివర్లో ఉంది. దీంతో బిగ్ బాస్ ఆ వారం ఎలిమినేషన్ ను కూడా తీసేసింది. అంత ప్రేమ కనబర్చిన బిగ్ బాస 14వ వారం ఎలిమినేట్ చేయక తప్పలేదు.

ముఖ్యంగా ముగ్గురు ముద్దుబిడ్డలు లీస్ట్ ఓటింగ్ లో ఉండడంతో ఒకర్ని వదులుకున్నారు. వీరు ముగ్గురూ మొదటి నుంచి స్నేహితులుగా ఉండడం.. వీళ్లకు వీళ్లే సాయం చేసుకోవడం మనం చూశాం. కానీ అమర్ దీప్ మాత్రం మోనితకు తేలుకోలేని షాకిచ్చాడు. ప్రియాంక జైన్ తో కలిసి కూర్చొని మరీ శోభా బ్యాచ్ బిచ్చింగ్ చేస్తుందంటూ చెప్పాడు. అంతే కాకుండా ఆమెకు స్వార్థం బాగా పెరిగిపోయిందని.. విపరీతమైన స్వార్థ పరురాలు అంటూ చెప్పుకొచ్చిన వీడియోను గలాటా గీతూ ప్లే చేసి శోభాశెట్టికి చూపించింది. అయితే ఈ వీడియో చూసిన శోభా ఫుల్ ఎమోషనల్ అయిపోయింది.
అసలు అమర్ తన గురించే ఇలా మాట్లాడతాడని కలలో కూడా ఊహించలేని శోభాశెట్టి వెల్లడించింది. నా అనుకున్న వాళ్లే నా గురించి ఇలా మాట్లాడారా అంటూ పేర్కొంది. అయితే ఈ సీజన్ విన్నర్ గా ఎవరు నిలవాలని మీరు కోరుకుంటున్నారు అనగా... అమర్ దీప్ యే అని చెప్పింది. మరి ఎప్పుడూ అమ్మాయి గెలవలేదు అంటూ చెప్పే మీరే మీ క్లోజ్ ఫ్రెండ్ ప్రియాంకకు ఎందుకు సపోర్ట్ చేయలేదని అనగా... అమర్, ప్రియాంకలలో అమర్ మోర్ డిజర్వ్ అని నాకనిపిస్తోంది... అతడే విన్ కావాలని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాని చెప్పింది.

అయితే తననే తిడుతూ అమర్ చేసిన వ్యాఖ్యలు విన్నాకా కూడా శోభాశెట్టి.. అమర్ దీప్ యే గెలవాలని అనడం గమనార్హం. అలాగే అంబటి అర్జున్ కూడా టాప్ 5లోకి రావాలని ఉందని చెప్పింది. మొదటి వారంలోనే ఆయన వస్తే కచ్చితంగా విన్ అయ్యేవాడని తెలిపింది. శివాజి సూపర్ స్ట్రాటెజీతో వచ్చారని... ఆ స్ట్రాటెజీతో ఎవరు గేమ్ ఆడినా కచ్చితంగా గెలుస్తారని శోభాశెట్టి వెల్లడించింది. ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











