Shobha Shetty: అలా చాలాసార్లు మోసపోయా.. ఇప్పటికి నా కళ నెరవేరింది.. శోభాశెట్టి ఎమోషనల్!

కార్తీక దీపం సీరియల్ లో మోనితగా కనిపించి అందరినీ అలరించిన శోభాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ఆమెలోని నెగిటివిటీని మాత్రమే చూసిన తెగులు బుల్లితెర ప్రేక్షకులు ఆమె బిగ్ బాస్ కు వచ్చాక ఆమెలోని మంచితనాన్ని, స్నేహాన్ని, ప్రేమను కూడా చూశారు.

అయితే మొదటి వారమే హౌస్ లో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన ఆట తీరుతో అనేక మందిని అలరించింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక ప్రియుడితో ఎక్కువగా కనిపిస్తూ రచ్చ చేస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చాలా ఎమోషనల్ అయింది. ఓ విషయంలో తాను చాలాసార్లు మోసపోయినట్లు వివరించింది. కన్నీరు కూడా పెట్టుకుంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Shobha Shetty Gets Emotional For her Dream Comes True Check Details

బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే.. తాను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు చెప్పిన శోబాశెట్టికి.. ఫ్యామిలీ వీక్ లో భాగంగా సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమె ప్రియుడు యశ్వంత్ రెడ్డిని కూడా చూపించారు. అలా తొలిసారి తెరకు తన కాబోయే భర్తను పరిచయం చేసిన శోభా.. ఇటీవలే సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల మధ్యనే ఈ కార్యక్రమాన్ని చేసుకుంది. చాలా సింపుల్ గా జరిగిన ఈ వేడుకలో శోభాశెట్టితో పాటు ఆమె ప్రియుడు యశ్వంత్ రెడ్డి కూడా చాలా అందంగా ముస్తాబు అయ్యారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ వీడియోను కూడా చేసిందీ క్యూట్ బ్యూటీ.

అయితే తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ మరో వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్ లోడ్ చేసింది. అయితే అందులో తన కళ నెరవేరినట్లు చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందుగానే శోభా తన ప్రియుడు కలిసి.. తమకోసం ఓ అందమైన ఇల్లును కొనుగోలు చేశారు. ముఖ్యంగా 15వ అంతస్తులో తాను ఓ ఇల్లు కొనుక్కుంది. గతంలోనే ఇందుకు సంబంధించి వీడియో చేసిన ఈమె.. తాజాగా ఆ ఇంటి తాళాలను అందుకుంది. తనకు హైట్ లో ఉండడం అంటే ఇష్టం అని.. అందుకే అలా తన స్థోమతకు తగ్గట్లుగా 15వ ఫ్లోర్ లో కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చింది.

Shobha Shetty Gets Emotional For her Dream Comes True Check Details

అలాగే గతంలో ఇలా ఇల్లు కొనేందుకు చాలా సార్లు ప్రయత్నించినట్లు.. డబ్బులు కట్టాకా.. వాళ్లు బిల్డింగ్ నిర్మాణం చేపట్టకుండా పారిపోయినట్లు కూడా వివరించింది. అలా చాలా సార్లు తాను అనేక మంది చేతిలో మోసపోయానని.. చివరకి చాలా కష్టపడి ఈ ఇల్లు కొనుక్కోగలిగానంటూ స్పష్టం చేసింది. ఇవన్నీ చెబుతున్న క్రమంలోనే ఆమె కన్నీటి పర్యంతం అయింది. ఇంటిని తనకు.. తనకు కాబోయే వాడికి నచ్చినట్లుగా మలుచుకుంటున్నామని తెగ సంబరపడిపోతూ చెప్పింది.

తనను తన కాబోయే భర్త యశ్వంత్ రెడ్డిని ఇలాగే సపోర్ట్ చేస్తే తమ జీవితం చాలా బాగుంటుందని కూడా శోభాశెట్టి వివరించింది. వైట్ అండ్ గ్రే కలర్ లో తమ ఇంటిని మార్చుకోబోతున్నట్లు చెప్పారు. అలాగే వాళ్లు ఎలా ఇంటిని బాగు చేసుకుంటున్నారో వీడియో కూడా షేర్ చేస్తామని... అది అందరికీ ఉపయోగపడేలా ప్లాన్ చేసుకుంటున్నామని అనుకున్నారు. అలాగే తనకు బిగ్ బాస్ లో అంత ఎక్కువగా డబ్బులు ఏం రాలేవని.. వాటి వల్లే ఇల్లు కొనుక్కోవట్లేదని మరోసారి చెప్పుకొచ్చింది. ఇద్దరం కలిసే ఈ ఇల్లును కొనుక్కోగల్గామని మరోసారి వివరించింది. చివరల్లో ప్రియుడిని హత్తుకుని ఆనంద పడిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X