Bigg Boss 7 లో 'కార్తీక దీపం' మోనిత ఫిక్స్.. శోభా శెట్టికి రెమ్మునరేషన్ ఎంతంటే?
బుల్లితెరపై అనేక షోలు వచ్చినప్పటికీ అత్యధికంగా పాపులారిటీ సంపాందించుకున్న వాటిలో బిగ్ బాస్ ఒకటి. ఈ రియాలిటీ షో ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటుంది. అయితే ఈ సెలబ్రిటీ షో గా వచ్చిన దీంట్లో మొదటి సీజన్ లో అందరూ సినీ తారలతో సాగింది. కానీ, ఆ తర్వాత వచ్చిన సీజన్ నుంచి బుల్లితెర తారలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయర్స్, సీరియల్ యాక్టర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 7 (Bigg Boss Telugu 7) సీజన్ సందడి మొదలు కానుంది. దీంట్లో కంటెస్టెంట్ గా కార్తీక దీపం సీరియల్ ఫేమ్ శోభా శెట్టి కన్ఫర్మ్ అయిందట.
6 రెగ్యులర్ సీజన్స్:బుల్లితెరపై రకరకాల కాస్సెప్టులతో షోలు వస్తున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ (Bigg Boss) ఒకటి. ప్రస్తుతం సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. 2017లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటివరకు 6 రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది.

నెగెటివిటీ:ఎప్పటిలానే ఎన్నో అంచనాల నడుమ ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా 2022లో మొదలు పెట్టారు. కానీ, సరికొత్త ప్రయోగాలు, ప్రైజ్ మనీ కోతలు ఏం చేసినా సరే మిగతా సీజన్లతో పోల్చుకుంటే ఆరో సీజన్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఫేక్ ఎలిమినేషన్స్, ఫేవరిజం వంటి తదితర కారణాలతో తీవ్రమైన నెగెటివిటీని మూటగట్టుకుంది.
ముందుగానే:ఇలా పలు కారణాలతో బిగ్ బాస్ ఆరో సీజన్ డిజాస్టర్ కావడంతో ఏడో సీజన్ ను ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో బిగ్ బాస్ మేనేజ్ మెంట్ టీమ్ ఉందని తెలుస్తోంది. అందుకే సాధారణంగా సెప్టెంబర్ లో స్టార్ట్ చేసే ఈ షోను ఈసారి జూలై లేదా ఆగస్టులోనే ప్రారంభించాలని నిర్వహాకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

నాగార్జున హోస్ట్:మొత్తానికి మళ్లీ బిగ్ బాస్ సందడి నెలకొననుంది. ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రోమోను ఇదివరకే విడుదల చేశారు. ఇటీవల నాగార్జునే హోస్ట్ అన్నట్లుగా క్లారిటీ కూడా ఇస్తూ ప్రొమో వీడియో ఒకటి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్" అంటూ సీజన్ 7కి మీనింగ్ వచ్చేలా క్యూరియాసిటీ పెంచేశారు.

కంటెస్టెంట్స్:ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇప్పుటికే కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయిపోయారని టాక్. వారిలో క్రికెటర్, రియల్ లైఫ్ కపుల్స్, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, లేదా ఆయన కుమారుడు చంద్రహాస్, టాప్ సీరియల్ యాక్టర్స్ వంటి సెలబ్రిటీలు పాల్గొంటారని విపరీతంగా టాక్ వచ్చింది.

భారీగా:ఈ నేపథ్యంలోనే కార్తీక దీపం సీరియల్ లో మోనిత పాత్ర చేసిన శోభా శెట్టి బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్ గా ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బిగ్ బాస్ రివ్యూవర్ ఒకరు ఆమె కన్ఫర్మ్ అయినట్లుగా పోస్ట్ చేశారు. కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ తో ఆరో సీజన్ లో కీర్తి భట్ కు ఓట్లు ఎక్కువగా పడ్డాయి. ఇప్పుడు అదే టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు ఆ సీరియల్ లో లేడీ విలన్ గా మెప్పించిన శోభా శెట్టిని కంటెస్టెంట్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు ఆమెకు భారీగానే ముట్టజెప్పారని టాక్.


Click it and Unblock the Notifications











