Bigg Boss Telugu: ఫస్ట్ టైమ్ శోభాశెట్టి ప్రియుడు ప్రేక్షకుల ముందుకు.. ప్రేయసి తండ్రి ముందే అలాంటి పని!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఫస్ట్ వీక్ లో ఇంట్లోకి అడుగు పెట్టిన శోభాశెట్టి.. ఫస్ట్ లేడీ కంటెండర్ గా గెలిచింది. అలాగే ఈ సీజన్ లో ఫస్ట్ లేడీ కెప్టెన్ గా కూడా గెలిచి అద్భుతంగా ఆట ఆడుతోంది. అయితే టేస్టే తేజతో కలిసి ఫుల్ కామెడీ చేసిన ఈమె ఎక్కువగా.. అమర్ దీప్, ప్రియాంక జైన్ లతోనే కలిసి ఉంది. వీరంతా ఓ గ్రూపుగా చేరి గేమ్ ఆడారు. ముఖ్యంగా సందీప్ మాస్టర్, అమర్ దీప్, ప్రియాంక జైన్, టేస్టీ తేజలతోనే కనిపించేది. తేజతో అయితే మరింత క్లోజ్ గా ఉంటూ ఫుల్ కామెడీ పండించింది.
టేస్టీ తేజ, శోభా శెట్టిల కాంబినేషన్ నిజంగా అదిరిపోయిందనే చెప్పాలి. ఆ విషయం అర్థం చేసుకున్న బిగ్ బాస్ కూడా శోభా పేరును ఆయన చేతిపై పచ్చబొట్టుగా వేయించుకోవాలని అన్నారు. కానీ అందుకు టేస్టీ తేజ అస్సలే ఒప్పుకోలేదు. శోభా పెళ్లి చేసుకుంటానని చెప్తే మాత్రమే.. టాటూ వేయించుకుంటానని అన్నాడు. ఇంట్లోని ఆడ వాళ్లను మహారాణుల్లా చూసుకోవాలని బిగ్ బాస్ సూచించగా.. టేస్టే తేజ శోభను ఎత్తుకొని తిప్పాడు. ఆమెకు పళ్లు కూడా తోమాడు. తినిపించాడు. ఇలా చాలా విషయాల్లో ఆమెకు హెల్ప్ చేశాడు.

కొన్ని కొన్ని సార్లు అయితే శోభా శెట్టి.. టేస్టీ తేజపై బాగా ఆధార పడింది. ఆయన ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు తెలుసుకొని ఫుల్ ఎమోషనల్ అయింది. నీవు లేకుండా నేను ఈ ఇంట్లో ఉండలేనంటూ చెప్పి కన్నీరు పెట్టింది. అంతకు ముందు కూడా.. నేను నీతో ఇలా క్లోజ్ గా కలిసి ఉంటే నా బాయ్ ఫ్రెండ్ ఎలా తీసుకుంటాడోనని టెన్షన్ పడింది. మనిద్దరి బంధం చూసి ఏమనుకుంటాడోనని కంగారు పడిపోయింది. తేజకు ఇదే విషయం చెప్పగా.. అతడు కూడా ఏమీ అనుకోడే, మన స్నేహం వాళ్లకు కూడా తెలుసు అంటూ నచ్చజెప్పాడు.
ఇలా శోభా శెట్టికి నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు తెలిసింది. అయితే ఫ్యామిలీ వీక్ లో భాగంగా శోభా శెట్టి తల్లి వచ్చింది. కానీ ఈరోజు ఎపిసోడ్ లో మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు స్నేహితులు వస్తుండగా.. శోభాశెట్టి ప్రియుడు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈరోజుటి రెండో ప్రోమో చూస్తే ఆ విషయం అర్థం అయిపోయింది. శోభా శెట్టి తండ్రితో పాటు ఆమె ప్రియుడు కూడా బిగ్ బాస్ స్టేజీపైకి వచ్చాడు. అతడిని చూడగానే శోభాశెట్టి ఫుల్ బ్లష్ అయిపోయింది.
మూడున్నరేళ్లుగా ఎన్ని సీక్రెట్ లు దాచావు అంటూ అడగ్గా... శోభా లవర్ ఫుల్ సిగ్గుపడిపోయాడు. నాన్న ఎలా ఉన్నావని అడుగుతూనే.. కన్నీరు పెట్టుకుంది శోభా. ఏడవకు అమ్మా అని తండ్రి చెబుతుండగా... నాగార్జున కూడా ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. ఫాదర్ ను చూసా ఇంకెవరిని చూసి ఎమోషనల్ అవుతున్నావని అన్నాడు. అందుకో శోభా నవ్వింది. బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడు అని అనగా.. అంతేనా ఏం చెప్పవా అని శోభా అడిగింది. అందుకు అతడు ఐ లవ్ యూ అని శోభా శెట్టి తండ్రి ముందే చెప్పాడు. దీనికి ఆమె కూడా ఐ లవ్ యూ టూ అంటూ తెలిపింది. వీరిద్దరి రిలేషన్ ను చూసి అంతా ఫుల్లుగా నవ్వుతూ గోల గోల చేశారు. ఈరోజుటి ఎపిసోడ్ తో ఫస్ట్ టైమ్ శోభా శెట్టి లవర్ ను అంతా చూసేయచ్చు.


Click it and Unblock the Notifications











