Bigg Boss Telugu 7: యావర్‌కు శోభాశెట్టి తల్లి స్పెషల్ గిఫ్టు.. కాళ్లు పట్టుకొని మరీ ఏడ్చేసిన కంటెస్టెంట్!

Shobha Shetty Mother in BB House: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోకు ఈ వారం విపరీతమైన టీఆర్పీ వస్తోంది. ఎప్పుడూ నామినేషన్లు, టాస్కులు, ఎలిమినేషన్లు, ఫన్ మాత్రమే ఉండే షోలో.. ఫ్యామిలీ వీక్ కావడంతో ఫుల్ ఎమోషన్స్ తో నిండిపోయింది. ముఖ్యంగా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ.. కంటెస్టెంట్లు గెలిచేందుకు ఫుల్ బూస్టింగ్ ఇస్తున్నారు. అయితే సోమవారం నుంచి ఈ ఫ్యామిలీ మెంబర్స్ రావడం కొనసాగుతుండగా.. ఇప్పటికే శివాజ కొడుకు, అర్జున్ అంబటి భార్య, అశ్విని శ్రీ తల్లి, భోలె భార్య, గౌతమ్ కృష్ణ తల్లి, ప్రియాంక కాబోయే భర్త వచ్చారు. అయితే ఈరోజు తాజాగా విడుదల అయిన ప్రోమోలో అమర్ దీప్ భార్య తేజస్విని వచ్చినట్లు చూపించారు.

ఇక తాజాగా విడుదల అయిన రెండో ప్రోమోలో శోభాశెట్టి తల్లి ఇంట్లోకి అడుగు పెట్టారు. అయితే తల్లి రాకను చూసిన శోభా పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ అమ్మను కౌగిలించుకుంది. చాలా ఎమోషనల్ అవుతూనే కన్నీరు పెట్టుకుంది. కూతురు కోసం ఇంట్లో అడుగు పెట్టిన శోభా శెట్టి తల్లి.. తల్లిలేని ప్రిన్స్ యావర్ కు తానే తల్లినని చెప్పింది. అలాగే అతడి కోసం ఓ స్పెషల్ బహుమతిని కూడా తెచ్చింది. కొంగు చాటున దాచి పెట్టుకొని మరీ వచ్చిన ఆమె దాన్ని ప్రిన్స్ యావర్ కు చాలా ప్రేమతో ఇచ్చింది. ఆమె ప్రేమను చూసిన యావర్ కన్నీటి పర్యంతం అయ్యాడు.

Shobha Shetty Mother Entry Into Bigg Boss Telugu 7 House in Family Week

అలాగే శోభా శెట్టి తల్లి తెచ్చిన బహుమతి చూసి మరింత ఎమోషనల్ అయ్యాడు. ఎందుకు అంటే ఆమె తెచ్చింది యావర్ తల్లి ఫొటోను. ఆ ఫొటోను చూస్కుంటే గుక్కపెట్టి ఏడ్చిన యావర్.. శోభా తల్లి కాళ్లపై పడ్డాడు. వద్దు బాబు లే.. నేను కూడా నీ తల్లినే అంటూ శోభా మదర్ చెప్పిన మాటలు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాయి. ముఖ్యంగా నా కొడుకురా నువ్వు ఏడకూడదు అంటూ ఆమె చెప్పిన విధానం అయితే నిజంగా అందరినీ అలరిస్తోంది. తల్లిలేని ఎవరికైనా ఓ అమ్మ అలా చెప్పిన, దగ్గరకు తీసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది. అదే అనుభూతిని యావర్ అనుభవించాడు.

ఇక ఆ తర్వాత యావర్ తల్లి ఫొటోను ఇంట్లోని కంటెస్టెంట్లు అందరూ చూశారు. గౌతమ్ కృష్ణ అయితే దగ్గరుండి మరీ యావర్ కన్నీళ్లు తుడిచాడు. యావర్ తన తల్లి ఫొటో పట్టుకొని సంతోషంగా ఇల్లంతా కలియ తిరుగాడు. ఇదంతా ఇలా ఉండగా.. శోభా శెట్టి దగ్గర కూర్చొని మాట్లాడిన తల్లి.. నీ కోపం నాకు తెలుసు, నీకు తెలుసు, కానీ వీళ్లకు ఏం తెలుసు అంటూ కామెంట్లు చేసింది. ఆ తర్వాత అశ్విని.. మీకు తెలుగు రాదని శోభా చెప్పింది బాగా మాట్లాడుతున్నారు కదా అని అడగ్గా... రోజూ తెలుగు చూస్తాను కదా అంటూ శోభా తల్లి సమాధానం చెప్పింది.

అలాగే గౌతమ్ తో నాకు జరిగిన గొడవ చూశావా అని అడిగితే.. అయ్యో బాడీ బిల్డర్ బాడీ చూపించాడుగా అంటూ గౌతమ్ పంచులేయగా... కంటెస్టెంట్లు అందరూ నవ్వుకున్నారు. నీకు ఈ అవకాశం కల్పించిన బిగ్ బాస్ కు కోటి కోటి వందనాలు అంటూ దండం పెట్టి మరీ థాంక్స్ చెప్పింది శోభా తల్లి. అలాగే నీవు కచ్చితంగా ఇంటికి కప్పు తీసుకునే రావాలని సూచించింది. అది విన్న శోభా తల్లిని గట్టిగా హత్తుకుంది. కూతురి నుదిటిపై తల్లి ముద్దు పెట్టగా... శోభా ఆమె వద్ద ఆశీర్వాదం తీసుకుంది. ఇక ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు శోభా తల్లి వస్తుండగా.. ఆగు మమ్మీ ఇంకా డోర్ తీయలేరు అంటూ శోభా తల్లిని మరోసారి గట్టిగా హత్తుకోగా ప్రోమో పూర్తి అయింది. పూర్తి ఎపిసోడ్ చూస్తే తప్ప పూర్తిగా ఏం జరిగిందో తెలియదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X