Bigg Boss Telugu 7: ఈ వారం ఎలిమినేషన్ కిక్కిచ్చేస్తోందబ్బా.. కన్ఫార్మ్‌గా ముద్దుబిడ్డ ఔట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. మరో రెండు వారాల్లో షో ముగుస్తుండడంతో ఎవరు విన్ అవుతారని.. ఎవరెవరు టాప్ 5లో నిలుస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే బిగ్ బాస్ ముందు నుంచి పక్షపాతం చూపించడం.. కొందరిని కాపాడడం చేస్తున్నారు. దీంతో వాళ్లనే టాప్ 5లో ఉంచేస్తారేమోనని.. విన్నర్ గా కూడా వాళ్లనే నిలబెడతారని అనుకున్నారు. కానీ ఈ వారం ఓటింగ్ చూస్తుంటే మాత్రం అదంతా కుదిరే పని అయ్యేలా లేదని అర్థం అవుతోంది. ఎందుకు అలా అవుతుందో, ఈవారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది మనం ఇప్పుడు తెలుసుసుకుందాం.

బిగ్ బాస్ షో నిర్వాహకులు ముందు నుంచి స్టార్ మా బ్యాచ్ అంటే సీరియల్ నటులకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వాళ్లు ఏం చేసినా సరే ప్రతీ వారం ఎవరో ఒకర్ని బలి చేసుకుంటూ కావాల్సిన వాళ్లని కాపాడుకుంటున్నారు. గతంలో ఓసారి శోభాశెట్టి ఎలిమినేట్ కావాల్సి ఉండగా... ఎలిమినేషన్ ను ఎత్తేశారు బిగ్ బాస్. దత్తపుత్రికను కాపాడుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేశారు. అలాగే 13వ వారం కూడా అంబటి అర్జున్ కు ఫినాలే అస్త్ర ఇచ్చి అతడినీ కాపాడుకున్నారు. ప్రస్తుతం ఇంట్లో నలుగురు సీరియల్ నటులు ఉన్నారు.

Shobha Shetty Or Priyanka Jain Eliminate 14th Week in Bigg Boss Telugu 7

శోభాశెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్, అంబటి అర్జున్... లు ఇంట్లో ఉండగా.. టాప్ 5లో వీరిని నిలబెడతారని అంతా అనుకున్నారు. కానీ ఇది జరిగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఇంట్లో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్లు టాప్ లో ఉన్నారు. మొన్నటి వరకు యావర్ కు కాస్త ఓటింగ్ తగ్గింది. దీంతో అతడిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ సీరియల్ బ్యాచ్ వాళ్లను కాపాడుకుంటారని అనుకున్నారు. కానీ ఏ సీజన్ లో లేనట్లుగా.. ఈ సీజన్ 13 రోజుల ముందుగానే విన్నర్ ఓటింగ్ ను ప్రారంభించారు. ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి బుల్లితెర అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు.

తమకు నచ్చిన వారిని గెలిపించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్ లకు తెగ ఓట్లు వేస్తున్నారు. ప్రస్తుతం యావర్ మూడో స్థానంలో ఉన్నాడు. అంబటి అర్జున్ వద్ద ఫినాలే అస్త్ర ఉండడంతో ఆయన ఎలాగూ సేవ్ అయ్యాడు. మిగిలిన ముగ్గురు... అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టిలు చివరి స్థానాల్లో ఉన్నారు. దీంతో ఈ ముగ్గురు లోంచే ఒకర్ని ఈ వారం నామినేట్ చేయాల్సి ఉంది. వీరిని కాదని యావర్ ను ఎలిమినేట్ చేసే అవకాశం ఏమాత్రం లేదు.

Shobha Shetty Or Priyanka Jain Eliminate 14th Week in Bigg Boss Telugu 7

ప్రతీవారం సేవ్ చేసుకుంటూ వస్తున్న ముద్దుబిడ్డలు, దత్త పుత్రికలు... శోభా శెట్టి, ప్రియాంక జైన్ లు ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరిలోంచే ఓ టైటిల్ ఫేవరెట్ ను బిగ్ బాస్ వదులుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకవేళ వీరిని కాపాడుకోవాలంటే టాప్ 5కి బదులుగా టాప్ 7 ఉంచాలి. లేదంటే మాత్రం ఎవరో ఒకర్ని ఎలిమినేట్ చేయాలి. శోభాతో పోలిస్తే ప్రియాంక ఇంట్లో పనులతో పాటు గేమ్ కూడా బాగానే ఆడుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే శోభాశెట్టి ఎలిమినేట్ కాబోతుందని తెలుస్తోంది. ఇంతకాలం నుంచి ఆమె ఎలిమినేట్ అయితే చూడాలనుకున్న వాళ్లందరికీ ఈ ఆదివారం కిక్కే కిక్కు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X