Bigg Boss Telugu 7: అడ్డంగా దొరికిపోయిన మోనిత.. అతడికి అలాంటి సైగలు.. బూతులు తిడుతున్న నెటిజన్లు
బిగ్ బాస్.. సరికొత్త నేపథ్యంతో ప్రసారమవుతున్నా.. ప్రేక్షకుల హృదయాలను దోచుకుని దేశంలోనే నెంబర్ వన్‌గా మారిన షో. ఇండియాలోని చాలా భాషల్లోకి ఎప్పుడో వచ్చినా.. తెలుగులోకి మాత్రం ఏడేళ్ల క్రితమే ఇది పరిచయం అయింది. ఆ తర్వాత ప్రతి సీజన్ కూడా ఒకదానికి మించి ఒకటి విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్ కూడా జనరంజకంగా సాగుతోంది. ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో షాకింగ్ సీన్స్ కనిపించాయి. ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి!
ఏడో సీజన్‌లో ఎనిమిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేయడం కోసం 'బీబీ మారథాన్' అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. పలు రౌండ్లలో జరిగే ఈ టాస్కులో ఇంట్లోని కంటెస్టెంట్లలో నలుగురు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. అందులో గెలిచిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారు అవగా.. చివరి స్థానంలో నిలిచిన వాళ్లు మాత్రం ఎలిమినేట్ అవుతారు.

'బీబీ మారథాన్' టాస్కులో భాగంగా మొదటి రౌండ్‌లో నీటిలో మునిగే, తేలే వస్తువులు ఏంటి అనేది సరిగా కనిపెట్టే గేమ్‌ను ఇచ్చారు. ఇందులో ప్రియాంక జైన్, శోభా శెట్టి, అమర్‌దీప్ చౌదరి, టేస్టీ తేజలు పాల్గొన్నారు. దీనికి గౌతమ్ కృష్ణ సంచాలకుడిగా వ్యవహరించారు. ఈ టాస్కులో ఎక్కువ సరైన సమాధానాలు చెప్పి ప్రియాంక టాప్‌లో నిలిచింది. తద్వారా కంటెండర్ అయింది.
ఈ రౌండ్‌లో ప్రియాంక తర్వాత శోభా శెట్టికి ఎక్కువ మార్కులు లభించగా.. చివరి స్థానం విషయంలో మాత్రం అమర్‌దీప్ చౌదరికి, టేస్టీ తేజకు టై అయింది. దీంతో వీళ్లిద్దరికీ టై బ్రేకర్ రౌండ్‌ను నిర్వహిస్తామని బిగ్ బాస్ వెల్లడించాడు. ఇక, ఈ టాస్కులో గెలవడం కోసం అమర్‌దీప్ తనకు సాయం చేయాలని ప్రియాంక, శోభా శెట్టిని వేడుకున్నాడు. కానీ, తేజ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు.
టాస్కులో తనకు సహాయం చేయడం కోసం సైగలు చేయాలని అమర్‌దీప్ చౌదరి చెప్పడంతో శోభా శెట్టి హెల్ప్ చేసింది. అయినప్పటికీ అతడు సరిగా గెస్ చేయలేక ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత శోభా శెట్టి వచ్చి 'నేను నీకు కరెక్టుగానే సైగలు చేశాను. నువ్వే అర్థం చేసుకోలేకపోయావు. అందుకే నువ్వు ఇప్పుడు ఓడిపోయావు' అంటూ తన కన్నింగ్ గేమ్ గురించి బయటపెట్టింది.

ఆ తర్వాత శోభా శెట్టి మాట్లాడుతూ.. 'నువ్వు నా మాట వినకపోయే సరికి తేజకు సైగలు చేశాను. దీంతో అతడు కరెక్టుగా ఆన్సర్ చెప్పాడు. అందుకే ఈ టాస్కులో నీ మీద గెలిచాడు' అని మరో బాంబ్ పేల్చింది. దీంతో శోభా శెట్టి ఆడిన ఆటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది ఆమెను బండ బూతులు తిడుతూ సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు.
వాస్తవానికి తేజ, అమర్‌దీప్ మధ్య టాస్క్ జరిగిన తర్వాత అర్జున్ వచ్చి 'తేజకు శివాజి అన్న సైగలు చేశాడు. అందుకే వాడు కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. ఒకసారి కన్ఫార్మ్ చేసుకో' అని గౌతమ్‌కు చెప్పాడు. అప్ప్ుడు అతడు అందరినీ అడిగినా ఎవరూ మాట్లాడలేదు. అయితే, శోభా వల్లే తేజ గెలిచాడని తర్వాత తెలిసింది. దీనిపై నాగార్జున మాట్లాడాలని చాలా మంది కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











