Bigg Boss : ఫినాలేకు ముందే చేతులెత్తేసిన స్టార్ కంటెస్టెంట్ .. బిగ్‌బాస్ నుంచి ఆమె ఔట్
ఇండియాలో నెంబర్ వన్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్ హిందీ సహా అన్ని భాషల్లో దుమ్మురేపుతోంది. తెలుగులో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 8వ సీజన్‌కు మరికొద్దిరోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటి వరకు 13 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తెలుగు 8 .. 14వ వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం టికెట్ టూ ఫినాలే టాస్క్‌లు జరుగుతున్నాయి. తెలుగుతో పాటు కన్నడలోనూ బిగ్‌బాస్ రసవత్తరంగా సాగుతోంది. శాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ కన్నడ 11 నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఒకరు మధ్యలోనే హౌస్‌ను వీడారు. ఈ వివరాల్లోకి వెళితే..
సెప్టెంబర్ 29 నుంచి కలర్స్ కన్నడ ఛానెల్‌లో బిగ్‌బాస్ కన్నడ 11 సీజన్ ప్రారంభమైంది. తొలుత 17 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు . తర్వాత 50వ రోజున వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హనుమంత, శోభాశెట్టి, రజత్ కిషన్‌లు హౌస్‌లో అడుగుపెట్టారు. కాగా.. హౌస్‌లోని మహిళా కంటెస్టెంట్ల ప్రైవసీ హక్కులకు విఘాతం కలిగిస్తున్నారంటూ కర్ణాటక మహిళా కమీషన్ మండిపడింది. కమీషన్ ఆదేశాల మేరకు కుంబలగోడు పోలీసులు బిగ్‌బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో కాంట్రవర్సియల్ టాస్క్‌లకు కారణమవుతున్న నరక, స్వర్గ కాన్సెప్ట్‌లకు తెరదించారు.

ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శోభాశెట్టి తెలుగు బిగ్‌బాస్‌లో ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో కన్నడ బిగ్‌బాస్‌లోనూ ఛాన్స్ కొట్టేశారు. కార్తీక దీపంలో డాక్టర్ మోనితగా ఫేమస్ అయిన శోభా శెట్టి.. బిగ్‌బాస్ తెలుగు 7లోనూ కంటెస్టెంట్‌గా ఛాన్స్ కొట్టేశారు. చీటికి మాటికి తగాదాలు, అరుపులు, కేకలు చూసి ఆడియన్స్‌కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఆమె నామినేషన్స్‌లోకి వచ్చినప్పుడల్లా ఎలిమినేట్ చేసేయండి మాస్టారు అంటూ కామెంట్స్ పెట్టారంటే శోభా శెట్టి సైకోయిజాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో టాప్ 5కి చేరకుండానే శోభా ఎలిమినేట్ అయ్యారు.
అయితే తెలుగులో బిగ్‌బాస్ విన్నర్ కావాలన్న కల నెరవేరకపోవడంతో తన మాతృభాష కన్నడంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే శోభ కన్నడ బిగ్‌బాస్‌లోనూ తన బుద్ధి చూపించడం మొదలుపెట్టారు. ఆమె వచ్చినప్పటి నుంచి ఇంట్లో కల్లోలం మొదలైంది. కంటెస్టెంట్స్‌తో గొడవలు పెట్టుకోవడంతో కన్నడిగులకు కూడా విసుగు పుట్టింది. కానీ ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటంతో నామినేషన్స్‌లో సులభంగా గట్టెక్కిపోతున్నారు.
తాజాగా ఎలిమినేషన్‌లోనూ శోభ సేవ్ అయ్యారు. అయితే తాను హౌస్‌లో ఉండలేకపోతున్నానని.. ఎలిమినేట్ చేసేయమని కంటతడి పెడుతూ హోస్ట్ సుదీప్‌ను కోరారు. దీంతో ఆమె కోరిక ప్రకారం శోభను ఎలిమినేట్ చేసేశారు. కేవలం రెండు వారాలు మాత్రమే హౌస్‌లో ఉన్న ఆమె అనారోగ్య కారణాలు, శరీరం సహకరించకపోవడం వల్లే బయటికి వచ్చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అయితే ఆమె అభిమానులు మాత్రం నువ్వు లేడీ టైగర్‌లా ఆడావంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











