‘మా రిలేషన్‌ని చెడగొట్టాలని కుట్ర... నా బాయ్‌ఫ్రెండ్‌‌ని ఆమె అలా ట్రాప్’

స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగునాట పాపులర్ అయ్యారు కన్నడ కస్తూరి శోభా శెట్టి. ఈ ధారావాహికలో డాక్టర్ మోనితగా ఆమె పండించిన క్రూరత్వాన్ని తెలుగు ప్రేక్షకులు మరిచిపోరు. నిజానికి ఈ సీరియల్ ఇంతటి ఘన విజయం సాధించడంలో శోభాశెట్టి పాత్ర కూడా కీలకం. కార్తీక దీపం తర్వాత పలు సీరియల్స్ చేసినప్పటికీ అవి అంతగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ తెలుగు బుల్లితెరపైనే తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కార్తీక దీపం ఫేమ్ యశ్వంత్‌తో ప్రేమలో పడిన శోభ.. అతనితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అయితే ఓ అమ్మాయి కారణంగా తాను చాలా ఇబ్బందులు పడినట్లు శోభాశెట్టి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వివరాల్లోకి వెళితే..

కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబుకు తమ్ముడిగా నటించిన యశ్వంత్‌తో శోభ సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించింది. అయితే బిగ్‌బాస్ తెలుగు 7లో శోభ కంటెస్టెంట్‌గా వెళ్లినప్పుడు తన ప్రియుడి గురించి ఫస్ట్ టైం ఓపెన్ అయ్యింది. అతని పేరు యశ్వంత్ అని.. తాను ముద్దుగా పాపు అని పిలుచుకుంటానని పేర్కొంది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యశ్వంత్ - శోభాశెట్టిలు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయితే నిశ్చితార్ధం జరిగి రెండేళ్లకు పైగానే గడుస్తున్నప్పటికీ వీరిద్దరూ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. అయితే శోభ, యశ్వంత్‌లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇదిలాఉండగా.. జబర్దస్త్ కమెడియన్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్ షోకు కొద్దిరోజుల క్రితం గెస్ట్‌గా హాజరైన శోభా శెట్టి మాట్లాడుతూ.. యశ్వంత్‌తో రిలేషన్, పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Shobha Shetty Reveals Her Love Story with Yashwanth That Started on the Karthika Deepam Set

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నన్ను యశ్వంత్ ధైర్యంగా నడిపించాడు. స్వతంత్రంగా అమ్మాయి ఎలా ఉండాలి అనేది నాకు నేర్పించాడు. యశ్వంత్‌కు నాకు మధ్య ప్రేమాయణం మొదలై దాదాపు 5 ఏళ్లు అవుతుంది. ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. 2025లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అప్పటికీ నాకు హెల్త్ బాగుండకపోవడంతో వాయిదా వేసుకున్నాను. పెళ్లి అనే టాపిక్ రాగానే మా అమ్మకి ఒక కల. మా ఫ్యామిలీలో నాదే చివరి పెళ్లి. అన్న కూతురు, అక్క కూతురు చాలా చిన్నపిల్లలు. వాళ్లు పెళ్లి ఏజ్‌కి రావాలంటే 10, 15 ఏళ్లు పడుతుంది. నా పెళ్లిని చాలా గ్రాండ్‌గా, చాలా పద్దతిగా చేయాలని మా అమ్మ కల. అమ్మకి హెల్త్ బాలేదు.. ఆమెకు అంతా సెట్ అయ్యాక పెళ్లి చేసుకుంటాం. యశ్వంత్ నా ప్రేమని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు. నేను కొంచెం సెటిల్ అవ్వాలి అనేవాడు. దాంతో పోరా అవసరం లేదు అనుకుంటున్న సమయంలో వాడే వచ్చి కనెక్ట్ అయ్యాడు అని శోభాశెట్టి తెలిపారు.

పేరెంట్స్ మనల్ని ఎంతో కష్టపడి పెంచి ఉంటారు.. నా కూతురు, నా కొడుకు అని. ప్రేమించాం కదా అని అందరికీ అందరూ సెట్ అవ్వరు. ప్రేమించుకున్నారు.. కలిసుంటున్నారా? లేకపోతే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతున్నారా? అనేది మీరిద్దరూ డిసైడ్ అవ్వాలి. ప్రతి అమ్మాయి.. అబ్బాయి నుంచి కోరుకునేది ఒకటే. వాడు మంచోడు అయ్యుండాలి, తనను ప్రేమించాలి, తనకు సపోర్ట్‌గా ఉండాలి అని మాత్రమే. ఎవరో కొంతమంది మాత్రమే వాడికి కారు ఉండాలి, వాడికి వెల్ సెటెడ్‌గా ఉండాలని అనుకుంటారు. ఒక మనిషి నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడంటే నీ మీద జెన్యూన్ ప్రేమ ఉంటేనే ప్రేమిస్తాడు. అలాంటి ఫీలింగ్స్‌తో ఆడుకోవద్దు. సెట్ అవ్వకపోతే అక్కడితో ఆపేస్తే బెటర్. జీవితంలో ఇద్దరూ బాగుండాలంటే ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉండాలి. ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది.. చూసుకోవాలి అన్నట్లుగా ఉండకూడదు అని శోభా శెట్టి పేర్కొన్నారు.

యశ్వంత్‌ని కలిసే వరకు నా జీవితంలో ఎలాంటి ప్రేమ, క్రష్ లాంటివి లేవు.. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. కార్తీక దీపం సమయంలో యశ్వంత్ నా లైఫ్‌లోకి వచ్చాడు. సీరియల్‌లో కలిసి పనిచేస్తున్నా.. తొలుత అతనిపై ఫీలింగ్ రాలేదు. యశ్వంత్‌ని సెట్‌లో అందరూ రెస్పెక్ట్ చేస్తారు. ఓ రోజు సెట్‌లో చూసుకున్నాం.. దీని గురించి మెసేజ్‌లు నడుస్తూ ఇద్దరం కనెక్ట్ అయిపోయాం. కార్తీక దీపం సీరియల్‌తో అమ్మాయిల్లో యశ్వంత్‌కు ఫాలోయింగ్ వచ్చింది. ఒక అమ్మాయి.. యశ్వంత్‌కి చాలా పెద్ద ఫ్యాన్ అంట. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా మెసేజ్‌లు పెట్టేది. అక్కా నాకు యశ్వంత్ అన్న అంటే చాలా పెద్ద క్రష్. నేను చాలా మెసేజ్‌లు చేస్తున్నాను, తను రెస్పాండ్ కావడం లేదు అని పెట్టేది. అసలు ఆ అమ్మాయికి ఎంత ధైర్యం.. నాకే మెసేజ్‌లు చేసి యశ్వంత్ అంటే నాకు క్రష్ అని చెబుతుందని శోభా నవ్వుతూ గుర్తుచేసుకుంది.

నేను ఒక విలేజీకి వెళ్తే ఓ పెద్దావిడ వచ్చి నా రెండు చేతులు పట్టుకుని నీకు దండం పెడతా.. వంటలక్కని అలా చేయమాకు. వాళ్లిద్దరినీ కలుపు, నీకు దండం పెడతా, నీ కాళ్లు మొక్కుతా అని అడిగింది. దాంతో నేను షాకై అది సీరియల్.. వాళ్లిద్దరినీ కలిపేస్తే సీరియల్ అయిపోతుంది కదా. రేపటి నుంచి కార్తీక దీపం రాదు అప్పుడు ఏం చేస్తారు అని అడిగా. అదంతా నాకు తెలియదు.. వాళ్లిద్దరినీ కలుపు అని అని అడిగింది. మోనిత అనే క్యారెక్టర్ నాకు నెవ్వర్ బిఫోర్. వేరే సీరియల్స్ వాళ్లు కూడా అడుగుతున్నారు.. మోనిత లాంటి క్యారెక్టర్ కాకపోయినా, దాని దగ్గర దాకా ఉన్నా చాలు అని అడుగుతానని శోభా శెట్టి తెలిపారు.

More from Filmibeat

Read more about: shobha shetty karthika deepam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X