Bigg Boss Telugu 7: భోలె కనిపిస్తే.. టీవీనే పగులగొట్టేస్తుందట, మళ్లీ మోనిత రూపం బయటకొచ్చిందిగా!
ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్స్ ఎపిసోడ్ మాంచి వాడివేడిగా సాగింది. ఈ వారం కూడా భోలే, శోభా శెట్టి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నామినేషన్ల పర్వం చాలా సేపు సాగింది. భోలే, పల్లవి ప్రశాంత్‌లు చాలా సేపు నామినేషన్లను సాగదీశారు. సోమవారం ఎపిసోడ్‌లో అయితే శివాజీ, శోభాశెట్టి, అశ్వినీ శ్రీ, గౌతమ్, సందీప్, ప్రియాంక, భోలే నామినేషన్లను మాత్రమే చూపించగా.. మిగతా వారి నామినేషన్లు మరుసటి రోజు ప్రసారం కానుంది.
మంటల్లో ఫోటో వేసి వారిని ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. ఇంట్లో ఉండటానికి అనర్హులుగా అనుకున్న వారి ఫోటోను మంటల్లో వేయాలి. ప్రతి ఒక్కరికీ ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నామినేషన్ల పర్వం శివాజీతో మొదలైంది. శివాజీ శోభా శెట్టిని, ప్రియాంకలను నామినేట్ చేశాడు. గత వారం నామినేషన్స్ లో భోలే షావలి శోభా శెట్టి గురించి మాట్లాడింది 100కు రెండు వందల శాతం తప్పే అని, అయితే తన తప్పును గుర్తించి ఆ తర్వాత సారీ కూడా చెప్పాడని శివాజీ చెప్పడం ప్రారంభించాడు. సారీ చెప్పినా శోభా శెట్టి క్షమించకపోవడం గురించి మాట్లాడుతూ.. మన తోటి మనిషే కదా.. క్షమిస్తే ఏమిపోద్ది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

దానికి బదులిచ్చిన శోభా శెట్టి.. మీకు దేవుడు క్షమించే మనసు ఇచ్చాడు. నాకు క్షమించే మనస్సు ఇవ్వలేదు అంటూ ఘాటుగానే బదులిచ్చింది. నిన్ను మార్చే హక్కు కానీ, నిన్ను మారమని ప్రెజర్ చేసే రైట్ కానీ నాకు లేవు అంటూ శివాజీ శోభా శెట్టి ఫోటోను మంటల్లో వేశారు. కామన్ సెన్స్ కూడా ఉండదు నామినేషన్స్ వేస్తారు అంటూ శోభా శెట్టి మండిపడింది. మీరు చెప్పారని నేను మార్చుకోను అంటూ శోభా శెట్టి శివాజీకి గట్టిగా చెప్పింది. మీ నామినేషన్ కాబట్టి మీ పాయింట్ చెప్పాలని, ఆయన కోసం నామినేట్ చేసినట్లు ఉందంటూ శోభా శెట్టి ఫైర్ అయింది. ఇది నా క్యారెక్టర్.. నేను ఇలాగే ఉంటా అని చెప్పింది. ఆ తర్వాత ప్రియాంకను నామినేట్ చేశాడు శివాజీ. భోలే షావలిని తూ.. అని అన్నందుకు ప్రియాంకను నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు.
ఆ తర్వాత భోలే షావలి వంతు వచ్చింది. భోలే వస్తూ వస్తూనే శోభాశెట్టికి జీవిత పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. 'నోరు జారినప్పుడు ఎన్ని జరిగాయో తెలుసా.. మీ మొండితనం మీ భవిష్యత్తుకు కూడా బాగోదు. నీకు బతిమాలి మరీ సారీ చెప్పినా. ఇంత పంతాలు వద్దు. సమాజానికి ఏం నేర్పుతాం. ఇంత మొండితనం అవసరం లేదు. ఇది మూడు నెలల ఆట మాత్రమే. జీవితంలో చాలా ఎదురవుతాయి' అని భోలే పెద్ద పాఠమే బోధించాడు. దానికి స్పందించిన శోభా శెట్టి.. మీరు మాకు జీవితం గురించి పాఠాలు చెప్పక్కర్లేదు అని ఘాటుగా ఆన్సర్ ఇచ్చింది. ఇంట్లో మంచి మనసుతో ఉంటావు.

నామినేషన్స్ లో ఎందుకిలా మాట్లాడుతున్నావు అనని భోలే అనగా.. నేను మీకు కాదు, మీ ఏజ్‌కు రెస్పెక్ట్ ఇస్తున్నా అంటూ పైర్ అయింది. నేను దిగజారి మాట్లాడేంత బజారు వాడిని కాదు, బయటకెళ్లి టీవీ చూస్తున్నప్పుడు నిన్ను చూసి, తనను మార్చమని దేవుడిని ప్రార్థిస్తా అంటూ చెప్పాడు. వెంటనే స్పందించిన శోభా శెట్టి.. టీవీ పగలగొడతా కానీ, నిన్ను మాత్రం చూడను అంటూ మండిపడింది. 'పోయి పోయి నీ మాట విని మారితే నేను ఎందుకు శోభా శెట్టి అవుతా'అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత భోలే షావలి గౌతమ్ ను నామినేట్ చేసి వెళ్లిపోయాడు.


Click it and Unblock the Notifications











