Bigg Boss 7 మహానటుడిలా యాక్టింగ్ చేయకు.. 80 కెమెరాల్లో ఒక్కటి కూడా.. శివాజీపై శోభాశెట్టి ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో శోభాశెట్టి, శివాజీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బాల్ త్రో టాస్క్ సందర్భంగా సంచాలకులుగా వ్యవహరించిన శోభాశెట్టి తీరుపై శివాజీ అసహనం వ్యక్తం చేశాడు. ఇలా అయితే గేమ్ ఆడను. నేను అవుట్.. మీరే ఆడుకోండి అంటూ శివాజీ బయటకు వెళ్లిపోయాడు. దాంతో శోభా, శివాజీ మధ్య గొడవకు ఆజ్యం పోసింది. మంచిగా మాట్లాడు అంటూ చేసిన కామెంట్స్‌తో శివాజీని శోభాశెట్టి టార్గెట్ చేస్తూ..

టాస్క్ సందర్భంగా ప్రతీసారి రూల్స్ మారిస్తే ఒప్పుకొనేది లేదంటూ శివాజీ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో శోభా శెట్టి ఘాటుగా స్పందించింది. దాంతో నేను ఆడనంటే వెళ్తుంటే శోభాశెట్టి రెచ్చగొట్టేలా చేసింది. దాంతో నేను ఇప్పుడు లైన్ క్రాస్ చేసి మాట్లాడలేదు. నీవు కూడా లైన్ క్రాస్ చేయకు అంటూ శివాజీ ఘాటుగా స్పందించాడు.

Shobha Shetty Shocking comments on Shivajis Acting Skills in Bigg Boss Telugu 7

అయితే నేను ఎలా ఉండాలో నాకు నీవు చెప్పకు అని శోభా అంటే.. మాట్లాడే పద్దతి మార్చుకో. భవిష్యత్‌లో నీకు మంచి జరుగుతుంది. ఇలా ఉంటే బాగుండదు అని శివాజీ సలహా ఇవ్వబోతే.. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు అంటూ శోభా ఘాటుగా స్పందించింది.

అయితే చేతులు జోడించి ఒకే సార్.. మీరు వెళ్లండి అంటూ శివాజీపై కామెంట్ చేసింది. దాంతో ఆ సెటైర్లే వద్దు. కెమెరాల ముందు యాక్టింగ్ చేయకు అంటూ శివాజీ మండిపడ్డాడు. దాంతో నీ మాదిరిగా నేను నటించడం లేదు. 80 కెమెరాల్లో కూడా కనిపించడం లేదు. ఒక్క కెమెరాలో కూడా రికార్డు కావడంల లేదు నీ అంత టాలెంట్ నాకు లేదంటూ దండాలు పెట్టింది.

Shobha Shetty Shocking comments on Shivajis Acting Skills in Bigg Boss Telugu 7

దాంతో శోభాపై మరోసారి శివాజీ ఘాటుగా స్పందించాడు. ఆడపిల్లవని అడ్వాంటేజ్ తీసుకోకు. మంచిది కాదు. నీవు గొప్ప మనిషి. పొరపాటున కామెంట్ చేశాను అంటూ శివాజీ అన్నాడు. అలా శోభా, శివాజీ ఒకరిపై మరొకరు అరుచుకొన్నారు. ఈ వ్యవహారంపై రోజంతా ఇంటిలో చర్చ జరిగింది.

బిగ్‌బాస్ తెలుగు 7 షో విషయానికి వస్తే.. 14వ వారం ముగింపుకు చేరుకొన్నది. ఇంటిలో గ్రూపుల మధ్య గొడవలు భారీగానే చోటు చేసుకొంటున్నాయి. సీరియల్ బ్యాచ్‌కు, శివాజీ బ్యాచ్‌ నువ్వా నేనా అనే విధంగా గేమ్ ఆడుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X