Bigg Boss 7 Telugu: షోలో మొబైల్ ఫోన్ కలకలం.. ప్రైవేట్ ప్లేస్‌లో దాచిన లేడీ.. అక్కడ చేయి పెట్టాడని!
బుల్లితెరపైకి ఎన్నో రకాల రియాలిటీ షోలు వస్తున్నాయి. కానీ, అందులో చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే ప్రేక్షకులను మదిని దోచుకుంటున్నాయి. అందులో బిగ్ బాస్ ఒకటి. మిగిలిన భాషల కంటే ఇక్కడ ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ అవడంతో పాటు ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను మొదలు పెట్టారు. ఇందులో ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షోలో మొబైల్ ఫోన్ కలకలం రేపింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ సంగతులేంటో మీరే చూడండి మరి!
ఏడో సీజన్ ఐదో వారంలో మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కును తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న పది మందిని ఐదు జంటలుగా మారాలని సూచించాడు. అందుకు తగ్గట్లే అమర్‌దీప్ - సందీప్, ప్రియాంక - శోభ, ప్రిన్స్ - తేజ, శివాజి - ప్రశాంత్, గౌతమ్ - శుభశ్రీ జంటలుగా మారారు. వీళ్లకు రకరకాల టాస్కులు ఇచ్చి కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేయబోతున్నాడు.

మొదటి రౌండ్‌లో భాగంగా కంటెస్టెంట్లు అందరికీ స్మైలీ ఛాలెంజ్‌ను ఇచ్చాడు. ఇందులో ఎన్నో గొడవలు జరిగిన అనంతరం సంచాలకులు గౌతమ్ - శుభశ్రీ జంటకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చి.. అమర్ - సందీప్‌కు సెకెండ్, శివాజి - ప్రశాంత్‌కు థర్డ్ ప్లేస్ ఇచ్చారు. ఈ నిర్ణయం తర్వాత కూడా ఎన్నో గొడవలు జరిగాయి. అందరూ కలిసి యావర్‌ను టార్గెట్ చేసి నానా మాటలు అనేశారు.
ఇక, ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో భాగంగా రెండో రౌండ్‌లో 'దొరికితే దొంగ-దొరక్కపోతే దొర' అనే టాస్కును ఇచ్చాడు. ఇందులో భాగంగా తన స్నేహితుడు గతంలో కొన్ని వస్తువులు దొంగతనం చేశాడని, అతడు యాక్టివిటీ ఏరియాలోనే నిద్రిస్తున్నాడని, ఆ గదిలోకి వెళ్లి తన క్లూల ప్రకారం వస్తువులను తీసుకు రావాలని బిగ్ బాస్ సూచించాడు. ఇందుకోసం ఒక రౌండ్‌లో ఒకరు, రెండో రౌండ్‌లో మరొకరు వెళ్లాలని జంటలకు చెప్పాడు.

మొదటి రౌండ్‌లో భాగంగా అమర్‌దీప్, ప్రియాంక, ప్రశాంత్, గౌతమ్, టేస్టీ తేజలు బిగ్ బాస్ ఫ్రెండ్ నిద్రిస్తున్న గదిలోకి వెళ్లారు. అందులో బిగ్ బాస్ క్లూల ఆధారంగా కొన్ని వస్తువులను తీసుకున్నారు. అదే సమయంలో మరికొన్ని సామాన్లను కూడా దొంగలించేశారు. ముఖ్యంగా టేస్టీ తేజకు బిగ్ బాస్ చెప్పిన మొబైల్ ఫోన్ కూడా దొరికింది. ఇది అన్నింటికంటే హైలైట్ అయింది.
ఫస్ట్ రౌండ్ పూర్తైన తర్వాత అందరూ బయటకు వచ్చేశారు. ఆ సమయంలో టేస్టీ తేజ సంచిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను శోభా శెట్టి కొట్టేసింది. ఆ వెంటనే తన ప్రైవేట్ ప్లేస్‌లో దాన్ని దాచేసింది. తేజ పార్ట్‌నర్ అయిన ప్రిన్స్ యావర్ ఆ మొబైల్ ఫోన్ తమది అని, వెంటనే ఇచ్చేయాలని అడిగాడు. కానీ, శోభా నిరాకరించడంతో దాన్ని ఆమె నుంచి లాక్కోవడానికి ప్రయత్నాలు చేశాడు.

ప్రిన్స్ యావర్ ఫోన్ తీసుకుంటుండగా శోభా శెట్టి 'యావర్ అది నాకు దొరికింది. నేను ఇవ్వను. అయినా దాన్ని నా ప్రైవేట్ ప్లేస్‌లో పెట్టాను. నీ చేయి అక్కడ తీసేయ్' అంటూ ఓవర్ యాక్షన్ చేసింది. అప్పుడు సందీప్ చూసి యావర్ చేయి ఆమెను టచ్ అవడం లేదని చెప్పాడు. అనంతరం ఫోన్ ఇస్తానని ఊరించిన శోభా.. ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి మళ్లీ దాచేసుకుంది.

శోభా ఎంతకూ ఫోన్ ఇవ్వకపోవడంతో యావర్ మళ్లీ లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో బిగ్ బాస్ వాళ్లను హెచ్చరించి ఎక్కడి వాళ్లు అక్కడ నిల్చోవాలని చెప్పాడు. ఆ సమయంలోనే యావర్ తెలివిగా ఆమె నుంచి ఫోన్ కొట్టేశాడు. దీంతో ఇది మళ్లీ తేజ సంచిలోకి వెళ్లిపోయింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్‌లో తొలిసారి కనిపించిన మొబైల్ ఫోన్ పెద్ద గొడవకే కారణం అయిందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











