Bigg Boss Telugu 7: శివాజితో శోభా ఊహించని ప్రవర్తన.. అమర్, ప్రియాంకకు షాక్.. ఆమె సపోర్ట్ ఎవరికంటే!
బుల్లితెరపైకి సాదాసీదాగానే వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల స్పందనను సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్ షోగా మారిపోయింది బిగ్ బాస్. ప్రతి సీజన్‌కూ ఆదరాభిమానాలు లభిస్తుండడంతో నిర్వహకులు మరింత ఉత్సాహంగా వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులో బాగా హైలైట్ అయిన వారిలో ఒకరైన శోభా శెట్టి తాజాగా ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె ఊహించని ప్రవర్తనతో అందరికీ షాక్ ఇచ్చేసింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
శోభా శెట్టి ఫుల్ హైలైట్‌గా
బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సహా మొత్తం 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే ఫుల్ హైలైట్ అయ్యారని చెప్పారు. వారిలో కార్తీక దీపం ఫేం శోభా శెట్టి ఒకరు. ఈమె నాగార్జున వచ్చే ఎపిసోడ్లలో మంచిగా ఉంటూ.. హౌస్‌లో మాత్రం మోనితలా మారిపోతూ సెన్సేషన్ అయింది.

గొడవలతోనే విమర్శలు
ఏడో సీజన్‌లో మొదట్లో గేమ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి ఆడిన శోభా శెట్టి.. ఆ తర్వాత మాత్రం బాగా ఫైర్ అవుతూ వచ్చింది. తనను ఎవరైనా నామినేట్ చేసినా.. వేరే టాస్కుల్లో ఎలిమినేట్ చేసినా.. టాస్కుల్లో ఓడిపోయినా యమా రెచ్చిపోయింది. ఇలా చాలా మందితో గొడవలు పెట్టుకుంది. దీంతో శోభా శెట్టిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెను ఎలిమినేట్ చేయాలని అంతా కోరుకున్నారు.
ఎట్టకేలకు ఎలిమినేట్
ఈ సీజన్‌లో ఎన్నో సార్లు నామినేషన్స్‌లో ఉన్నా శోభా శెట్టి ఎలిమినేట్ కాలేదు. దీంతో కావాలనే ఆమెను షోలో కొనసాగిస్తున్నారు అన్న టాక్ కూడా వచ్చింది. అదే సమయంలో ఆమెను ఫినాలేలోకి కూడా పంపుతారని అంతా అనుకున్నారు. ఈ పరిస్థితుల్లో 14వ వారంలోనే శోభా శెట్టి ఎలిమినేట్ అయింది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లోనే దీన్ని హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.

శివాజికి కాళ్లపై పడింది
ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఒక్కొక్కరినీ ఫినాలే కంటెస్టెంట్లుగా ప్రకటిస్తూ వచ్చారు. ఇలా ఎలిమినేషన్ రౌండ్‌లో శివాజి, శోభా శెట్టి మిగిలారు. వీళ్లిద్దరి మధ్య విచిత్రమైన గేమ్ పెట్టిన నాగార్జున.. చివరికి మోనితనే ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ఆ తర్వాత శోభా శెట్టి నేరుగా శివాజి దగ్గరకు వెళ్లి కాళ్లపై పడింది. తప్పు చేసి ఉంటే క్షమించు అన్నా అంటూ వేడుకుంది.

అతడు విన్నర్ అంటూ
ఎలిమినేట్ అయిన తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక జైన్‌తో కలిసి శోభా శెట్టి ఎమోషనల్ అయింది. ఆ సమయంలో వీళ్లిద్దరికే తన మద్దతు ఉంటుందన్నట్లుగా మాట్లాడింది. ముఖ్యంగా అమర్‌దీప్ ఈ సీజన్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. అలాగే, ప్రియాంక ఫైనల్ చేరడం పట్ల కూడా గర్వంగా ఉందని శోభా శెట్టి కామెంట్లు చేసింది.

సపోర్ట్ మాత్రం అతడికే
బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన శోభా శెట్టి తన స్నేహితులు అయిన అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక జైన్‌కు ఓటింగ్ వేయిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ట్విస్ట్ ఇస్తూ అంబటి అర్జున్‌కు ఆమె సపోర్ట్ చేస్తానని చెప్పింది. 'నువ్వు ఓటింగ్ లేదని అస్సలు బాధపడకు. బయటకు వెళ్లిన తర్వాత నేను చూసుకుంటా. నీకు ఓట్లు వేయిస్తాను' అని హామీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











