Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7 విజేతగా శోభాశెట్టి... మరీ ఈ రేంజులో కాన్ఫిడెన్స్ ఏంటమ్మా?
బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ శోభా శెట్టి... ఇదేంటి అనుకుంటున్నారా.. అసలు ఫినాలే ఇంకా మొదలు కాలేదు.. అప్పుడే విన్నర్ ఏంటి అనుకుంటున్నారా... అయినా శోభా శెట్టి ఎప్పుడో ఎలిమినేట్ కావాలి... అయినా బిగ్ బాస్ కాపాడుకుంటూ వస్తున్నాడు.. ఆమె విన్నర్ ఏంటి అనే కదా మీ డౌట్. అవును మీరు అనుకున్నది నిజమే... అయితే శోభా శెట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది. తను వీక్ కంటెస్టెంట్ కాదు.. విన్నర్ అవ్వాలి.. అంటూ ఓటింగ్ అప్పియల్ చేసుకుంది. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 షోలో ప్రస్తుతం 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, శోభా శెట్టి.. వీరిలో ఎవరో ఒకరు విజేత కానున్నారు. అయితే బిగ్ బాస్ అవునన్నా.. కాదన్నా... శోభా శెట్టి ఓటింగ్ విషయంలో లీస్ట్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమెను కాపాడుకోవడానికి బిగ్ బాస్ ఎంతో మంది కంటెస్టెంట్స్ బలి చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఓటింగులో ప్రతిసారి లీస్ట్ లో ఉండే ఈ బ్యూటీ... ఇక్కడి వరకు రావడమే ఆశ్చర్యం. అయితే బిగ్ బాస్ కాపాడుకుంటున్నాడని అందరికీ అర్థం అయిపోయింది. ఇక నిన్నటి బిగ్ బాస్ టాస్కుల్లో ఒకటి శోభా, మరొకటి యావర్ గెలిచాడు. ఇక వీరిలో ఎవరో ఒకరు మాత్రమే ఓట్ అప్పియల్ కు ఛాన్స్ ఇచ్చాడు. అది మిగిలిన వాళ్ల చేతిలోనే ఉంటుంది.. అంటూ బిగ్ బాస్ చెప్పుకువచ్చాడు. ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లు మాత్రమే ఓట్ అప్పీల్ చేసుకోవాలి అని చెప్పాడు.
ఇక శోభాకు వీక్ కాబట్టి ఆమెకు సపోర్ట్ చేస్తున్నా అంటూ అర్జున్ చెప్పుకువచ్చాడు. యావర్ నీకు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా.. నువ్వు ముందుంటావ్ అని అర్జున్ అన్నాడు. ఇక ప్రియాంక కూడా శోభాకే సపోర్ట్ చేసింది. ప్రియాంక కూడా నువ్వు వీక్ అంటూ చెప్పడంతో.. శోభాకు నేను వీక్ కాదు అంటూ ఫైర్ అియంది. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున సార్ కూడా చెప్పారు. నేను వీక్ కాదు అంటూ శోభా వాదించింది. ఇక అమర్ ఎప్పటిలానే శోభా నా ఫ్రెండ్ నేను సపోర్ట్ చేస్తున్నా.. అని చెప్పుకువచ్చాడు.

ఇక స్పై బ్యాచ్ ప్రశాంత్, శివాజీ.. యావర్ కు సపోర్ట్ చేశారు. ఇక ఓట్ అప్పియల్ లో శోభాకు ఛాన్స్ వచ్చేసింది. ఇక వెంటనే చేతులు జోడించి శోభా... ఓటు అప్పియల్ చేసుకుంది. మీకు నేను కార్తీక దీపం మోనితగానే తెలుసు. బిగ్ బాస్‌లో చూసేవాళ్లకి శోభా శెట్టిగా తెలుసని చెప్పుకువచ్చింది. ఇక్కడ మీరు నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు.. ఇప్పుడు మేము హ్యాపీగా ఉంటున్నామంటే.. కడుపు నిండా అన్నం తింటున్నామంటే మీరే కారణం.. అంటూ ఎమోషనల్ అయింది.
ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆడపిల్లనని చెప్పి నన్ను బయటికి గెంటేసినప్పుడు మా మమ్మీ నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిందని చెప్పుకువచ్చింది. సీజన్ 6 వరకు అందరూ అబ్బాయిలే గెలిచారు. మరి సీజన్ 7 అయినా అమ్మాయిని గెలిపించండి. ప్రైజ్ మనీ నాకు చాలా ముఖ్యం.. ఇక్కడి నుంచి నేను కొత్త జీవితం స్టార్ట్ చేస్తాను.. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా.. నాకు సపోర్ట్ చేయండి.. ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి.. నాకు ఓట్ చేయండి.. శోభాశెట్టి తెగ ఎమోషనల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications










