Bigg Boss Telugu 7: డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్‌కు గోల్డెన్ ఛాన్స్... ఇది కదా రియల్ ఉల్టా పుల్టా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగా సాగుతోంది. మొదటి నుంచి ఈ సీజన్ మొత్తం సడెన్ షాకులు, ట్విస్టులు ఇస్తూ ప్రేక్షకులకు థ్రిల్ ను కలిగిస్తున్నారు. ఇక సక్సెస్ ఫుల్ గా 9 వారాలు పూర్తి చేసుకోబోతుంది బిగ్ బాస్ షో. అయితే నెక్ట్స్ వీక్ క్యాప్టెన్సీ కోసం ఈ వారం పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ ఇప్పుడు క్యాప్టెన్ గా ఎంపిక అయింది. దీంతో ఆమె ఈ వారం ఎలిమినేషన్ అవుతుందా.. లేదా సేఫ్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది. అసలు విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. దాదాపు 60 రోజులు పూర్తి చేసుకున్న ఈ షో... ప్రేక్షకులను అలరిస్తూ.. రసవత్తరంగా సాగుతోంది. ఇక మొదడి విడుతలో 14 మంది ఎంటర్ అయ్యారు. వైల్డ్ కార్డు ద్వారా 5 వ వారంలో మరో ఐదుగురు ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్నది మాత్రం.. శివాజీ, యావర్, ప్రశాంత్, శోభా శెట్టి, టేస్టీ తేజ, రతికా రోజ్, అర్జున్ అంబటి, భోలే షవాలి, అశ్వినీ శ్రీ, ప్రియాంక జైన్, అమర్ దీప్, గౌతమ్ ఉన్నారు.

ఇక ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి. ఇక ఈ వారం నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో అర్జున్, రతిక రోజ్, ప్రియాంక జైన్, అమర్ దీప్, యావర్, బోలే షవాలి, శోభా శెట్టి, టేస్టీ తేజ ఉన్నారు. అయితే ఈ వారం ఓటింగ్ చూసుకుంటే ముందు వరుసలో అమర్ దీప్, గౌతమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో అర్జున్ అంబటి, బోలే షవాలి, ప్రియాంకలు ఉన్నారు.
ఇక 9వ వారం ఎలిమినేషన్స్ కు దగ్గరగా డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం శోభా శెట్టి, టేస్టీ తేజ, రతికా రోజ్ ఉన్నారు. వీరిలో తక్కువ ఓట్లతో టేస్టీ తేజ, శోభా శెట్టి ఉన్నారు. మరి ఈ ఇద్దరిలో ఒకరి ఎలిమినేషన్ ఖాయం అని తెలుస్తోంది. ఓటింగ్ ప్రక్రియ ఈ శుక్రవారం అర్ధ రాత్రి ముగుస్తుంది. అయితే డేంజర్ జోన్ లో ఉన్న ఒకరు ఇప్పుడు నెక్ట్స్ వీక్ క్యాప్టెన్ గా ఎన్నిక అయ్యారు అని తెలుస్తోంది.

ఈ వారం ఆటలో భాగంగా నిర్వహించిన పోటీల్లో క్యాప్టెన్ అయ్యేందుకు కంటెండర్స్ గా యావర్, శోభా శెట్టి, తేజ, గౌతమ్, అర్జున్, రతికా ఉన్నారు. అయితే అన్ని టాస్కుల్లో ఆడిన శోభా శెట్టి.. నెక్ట్స్ వీక్ క్యాప్టెన్ గా ఎన్నిక అయింది. దీంతో ఆమె గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆమె డేంజర్ జోన్ లో ఉంది. మరి నెక్ట్స్ వీక్ క్యాప్టెన్ గా శోభా శెట్టి ఎన్నిక అవ్వడంతో... ఈ వారం ఆమె సేఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక శోభా శెట్టి సేఫ్ అయితే కనుగ.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది తేజ. కొద్ది రోజులుగా శోభా శెట్టిని కావాలానే బిగ్ బాస్ సేఫ్ చేస్తూ వస్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. శోభా శెట్టికి తక్కువ ఓట్లు వచ్చినా కానీ.. ఆమెను సేఫ్ చేస్తూ ఇంకొకరిని బలి చేస్తున్నట్లు నెట్టింట చర్చ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











