Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ముద్దు బిడ్డ శోభా శెట్టి ఎలిమినేట్... 14వారాలకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకోగా... ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 7 రసవత్తరంగా సాగుతోంది. ఇక ఈ ఏడో సీజన్‌కు కూడా నాగర్జునే హోస్టుగా ఉండగా... ఈ షో 14వ వారాలు ఆసక్తిగా సాగింది. ఇక ఈ షో నుంచి 14వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తి కలిగించగా.. అందరూ అనుకున్నట్లుగానే శోభా శెట్టి ఎలిమినేట్ అయింది. అయితే ఈ బ్యూటీ 14 వారాలకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 చివ‌రి ద‌శ‌కు చేరుకుందనే విషయం తెలిసిందే. మ‌రికొద్ది రోజుల్లో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. ఇప్ప‌టికే అంబ‌టి అర్జున్ ఫైన‌ల్‌కు చేరుకున్నారు. ప్ర‌స్తుతం 14వ వారం పూర్తికావొస్తుండగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేష‌న్స్‌లో అర్జున్ త‌ప్ప మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. నామినేషన్స్ లో అమర్ దీప్‌, శివాజీ, ప్రశాంత్, శోభాశెట్టి, యావర్, ప్రియాంక లు ఉన్నారు.

 Shobha Shetty Will Be Eliminated 14th Week and Her Remuneration in Bigg Boss Telugu 7 Full Details Here

వీరిలో ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తుండగా.. బిగ్ బాస్ వర్గాల సమాచారం మేరకు ఈ వారం బిగ్ బాస్ ముద్దు బిడ్డ శోభా శెట్టి ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది. ఈ బ్యూటీ ఎప్పుడో ఎలిమినేట్ కానుండగా.. బిగ్ బాస్ పలు వారాలుగా ఆమెను సేవ్ చేస్తూ వస్తున్నాడు. ఎట్టకేలకు ఈ బ్యూటీని బిగ్ బాస్ ఈ వారం ఇంటి నుంచి బయటకు పంపించాల్సి వచ్చింది. దానికి కారణం ఈ బ్యూటీకి ఓటింగ్ రాకపోవడమే అని తెలుస్తోంది.

 Shobha Shetty Will Be Eliminated 14th Week and Her Remuneration in Bigg Boss Telugu 7 Full Details Here

బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం ఈ వారం ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ టాప్ లో ఉండగా... ఆ తర్వాతి స్థానాల్లో యావర్, అర్జున్, ప్రియాంక ఉన్నారు. ఇక అట్టడుగు స్థానంలో శోభాశెట్టి ఉండటంతో.. ఆమె ఈ వారం ఎలిమినేట్ అయింది. ఇక ఆదివారం ఎపిసోడ్ లో శోభాశెట్టి ఎలిమినేట్ కానుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో యావర్ లేదా.. అర్జున్ అంబటి ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

 Shobha Shetty Will Be Eliminated 14th Week and Her Remuneration in Bigg Boss Telugu 7 Full Details Here

ఇక ఈ వారం శోభాశెట్టి ఎలిమినేట్ అయిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి శోభాశెట్టి చాలా స్ట్రాంగ్ ప్లేయ‌ర్‌.. అయినప్పటికీ.. ఉన్న వారిలో ఓటింగ్ తక్కువ రావడంతో వైదొలగాల్సి వచ్చింది. ఈ బ్యూటీ అన్ని టాస్కుల్లోనూ త‌న బెస్ట్ ఇస్తూ వ‌స్తుందనే విషయం తెలిసిందే.. హౌస్‌లో మాస్కు లేకుండా గేమ్ ఆడుతూ.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె ప్ర‌వ‌ర్త‌న ఆడియన్స్‌కు చిరాకు, విసుగు తెప్పించాయి.

ఇక శోభా శెట్టి 14వారాలకు రూ.31 లక్షల 50వేలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ భామ భారీగానే మూటగట్టుకుందని తెలుస్తోంది. వారానికి ఈ భామ రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X