Bigg Boss Telugu 7: చిల్లరగా బిహేవ్ చేసిన శోభా శెట్టి... బిగ్ బాస్ రెండు సార్లు చివాట్లు పెట్టినా...!

బిగ్ బాస్ తెలుగు 7 ప్రారంభం అయి 40 రోజులు అవుతుంది. ఇక తాజా ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇక పల్లవి ప్రశాంత్ కు మళ్లీ కెప్టెన్సీ ఇచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో శోభా శెట్టి చిల్లరగా బిహేవ్ చేస్తూ... ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ ను ఇరిటేట్ చేసింది. అసలు శోభా శెట్టి ఏం చేసింది... బిగ్ బాస్ ఏం అన్నాడు.. అసలు ఏం జరిగిందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇక నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో శోభా శెట్టి... చిల్లరగా బిహేవ్ చేసిందని తెలుస్తోంది. మొదట మేకప్ కిట్ కోసం.. శోభాశెట్టి మేకప్ సామాన్లు దొంగలించింది. దీంతో బిగ్ బాస్ ఆదేశాల మేరకు అర్జున్, అశ్వినిలు ఆమెకు పనిష్మెంట్ ఇచ్చారు. ఇక టేస్టీ తేజ వేసుకున్న ఓ టీ షర్ట్ ను ఆమెను వేసుకోవాలని అన్నారు. అది గత మూడు రోజులుగా ఉతకకుండా అలాగే ఉంచిన టీ షర్ట్. మొత్తానికి ఆ కంపు కొట్టే టీ షర్ట్ వేసుకుంది శోభా.

Shobha Shetty Worst Behavior in Bigg Boss Telugu Season 7 Episode 40

ఇక గత రెండు రోజులుగా సాగుతున్న గేమ్స్ విషయానికి వస్తే... పోటుగాళ్లు 3 గేమ్స్ లో గెలిచారు. ఆటగాళ్లు 1 గేమ్ లో గెలిచారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఆటగాళ్లు పై చేయి సాధించారు అని తెలుస్తోంది. అయితే ఈ ఆటల్లోనే శోభా శెట్టి చిల్లరగా బిహేవ్ చేస్తూ... పిచ్చిగా ప్రవర్తించింది. ఆటగాళ్లు, పోటుగాళ్లు వీరిలో ఎవరు స్మార్ట్ అన్న విషయాన్ని తేల్చడానికి హు ఈజ్ స్మార్ట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఇందులో పాపులర్ సినిమా డైలాగ్‌లు, సాంగ్స్, సీన్స్ ప్లే చేస్తూ... క్వశ్చన్స్ అడిగాడు. ఇందులోనే శోభా శెట్టి, గౌతమ్ పోటీ పడగా... ఇందులో శోభా చిల్లరగా బిహేవ్ చేసింది. కాయిన్స్ జాకెట్‌లో దాచుకోవడం ఆ తరువాత లాక్కోవడానికి ట్రై చేస్తే నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడని కన్నింగ్ గేమ్ ఆడే శోభాశెట్టి.. ఈ టాస్క్‌లోనూ దిగజారిపోయి ఆడిందని అర్ధం అవుతుంది. ఈ గేమ్ లో జై బాలయ్యా అనే సాంగ్స్ ప్లే చేయగా... ఇందులో బాలయ్య ఎన్నికలర్స్ షర్ట్ మార్చారు అని కలర్స్ గురించి అడిగాడు బిగ్ బాస్.

Shobha Shetty Worst Behavior in Bigg Boss Telugu Season 7 Episode 40

అయితే శోభా శెట్టి మాత్రం కలర్ బోర్ట్ ఒక్కటి తీసుకోకుండా... రెండు చేతుల్లో పట్టుకుని... తిరిగింది. గౌతమ్ ఓ బోర్డ్ ఇవ్వమని అడిగినా... నేను ఇవ్వను అంటూ చెప్పుకువచ్చింది. ఇలాంటి చిల్లర గేమ్‌లు ఆడాలంటే.. శోభాతోనే ఆడించుకోండి బిగ్ బాస్ అని గౌతమ్ అంటే.. అప్పుడు కూడా డాన్స్ చేస్తూ మరీ పిచ్చిగా బిహేవ్ చేసింది. ఛీ .. ఛీ షిట్టీ గేమ్.. షిట్టీ గేమ్ అని గౌతమ్ అంటుంటే.... థాంక్యూ నువ్వే చెప్పాలి షిట్టీ గేమ్ గురించి అంటూ శోభా రెచ్చిపోయింది.

Shobha Shetty Worst Behavior in Bigg Boss Telugu Season 7 Episode 40

ఇక బిగ్ బాస్ కూడా ఆమెకు చివాట్లు పెట్టాడు. రెండు బోర్డులు అలా పట్టుకోవడం సరికాదన్నారు. ఇక ఆ రౌండ్ ను క్యాన్సి ల్ చేశాడు. ఆ తరువాత మిర్చి సాంగ్ ప్లే చేశారు. ఇందులో మొత్తం ఎన్ని మిర్చీలు ఉన్నాయ్ అని అడగ్గా... మళ్లీ రెండు బోర్డ్ లు పట్టుకుంది శోభా. మళ్లీ రెండు పట్టుకున్నావ్ అని గౌతమ్ అని అడిగితే.. లాక్కో అంటూ సమాధానం చెప్పింది శోభా. మళ్లీ బిగ్ బాస్ ఆమెకు చివాట్లు పెట్టాడు. బిగ్ బాస్ చెప్పేది మీకు వినిపించడం లేదా? లేక అర్ధం కావడం లేదా? అని తోలు మందం శోభాని గట్టిగా హెచ్చరించాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో శోభా శెట్టి చిల్లరగా బిహేవ్ చేస్తూ.. రెచ్చిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X