పెళ్లికూతురిగా కార్తీక దీపం మోనిత .. ప్రియుడితో కలిసి, శోభాశెట్టి పెళ్లెప్పుడంటే?

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లో బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా సెలబ్రెటీలు సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. తమిళ బిగ్‌బాస్ ఫేమ్ పావని రెడ్డి ఇటీవలే తన ప్రియుడు అమీర్‌తో కలిసి ఏడాడుగులు వేశారు. సుదీర్ఘకాలంగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా మరో బిగ్‌బాస్ బ్యూటీ , కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి సైలెంట్‌గా షాకిచ్చారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

తెలుగు బుల్లితెరపై కన్నడ భామల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయంతో తెలుగు వారిని మెస్మరైజ్ చేస్తున్న కర్ణాటక అమ్మాయిలు ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు. ఇలాంటి వారిలో శోభాశెట్టి ఒకరు. అతి త్వరలో ఆమె తెలుగింటికే కోడలిగా రానున్నారు. తాజాగా ఈ బిగ్‌బాస్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి వీడియో వైరల్ అవుతోంది.

shobha shetty yashwanth engagement Karthika Deepam actress celebrates 1st year engagement anniversary

స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం ద్వారా శోభాశెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా దగరయ్యారు. తెలుగు బుల్లితెరపై ఎప్పుడో అడుగుపెట్టినా? పలు ఛానెల్స్‌లో కనిపించినా? కార్తీక దీపం ఎవర్‌గ్రీన్. డాక్టర్ బాబుని ప్రేమించే డాక్టర్ మోనితగా వంటలక్కని ఏడిపించి బుల్లితెర ప్రేక్షకులతో చీవాట్లు తిన్నారు. ఆమెను తప్పించి ఆ క్యారెక్టర్‌లో మరొకరిని ఊహించుకోలేరంటే అతిశయోక్తి కాదు. కార్తీక దీపం సీరియల్ అంత పెద్ద హిట్ కావడానికి మోనిత రోల్‌లో శోభాశెట్టిది మేజర్ రోల్.

కార్తీక దీపం సీరియల్‌కి శుభం కార్డ్ పడటంతో శోభాశెట్టి మరే సీరియల్‌లోనూ కనిపించలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆమె తిక్కకి ప్రేక్షకులకు మెంటలెక్కింది. నాగార్జున గారు ఆ శోభాని ఎలిమినేట్ చేసేయండి అంటూ కామెంట్స్ పెట్టారంటే శోభా శెట్టి టార్చర్ అర్ధం చేసుకోవచ్చు. ఇక గతేడాది కన్నడ బిగ్‌బాస్‌లోనూ శోభాశెట్టి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. సీజన్ మధ్యలో వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె లోపలికి అడుగుపెట్టి తెలుగు, కన్నడ బిగ్‌బాస్‌లలో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన ఘతన దక్కించుకున్నారు. అయితే అక్కడా అదే టార్చర్, రాద్ధాంతం చేయడంతో సొంత కన్నడిగులు కూడా భరించలేక మధ్యలోనే ఇంటికి పంపారు.

కాగా.. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే శోభాశెట్టి లవ్ స్టోరీ బయటపడింది. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబుకి తమ్ముడిగా నటించిన యశ్వంత్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సన్నిహితుల మధ్యలో ఈ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి జంటగానే చక్కర్లు కొట్టిన శోభాశెట్టి.. ఇటీవల యశ్వంత్‌ను బెంగళూరుకు తీసుకెళ్లింది. అతని బర్త్ డే సందర్భంగా కారు గిఫ్ట్‌గా ఇచ్చింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శోభాశెట్టి తన సీరియల్స్, ఇతర వివరాలు పంచుకుంటూ ఉంటారు. తాజాగా యశ్వంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా నిశ్చితార్దం ఫోటోలను మరోసారి షేర్ చేసింది. నీతో 5 ఏళ్ల పరిచయం.. మన ప్రేమకు ముగింపు లేదంటూ శోభాశెట్టి ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఎంగేజ్‌‌మెంట్‌కు ఏడాది సరే కానీ ఇంతకీ పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X