అఖిల్‌కు కోలుకోలేని షాకిచ్చిన మెహబూబ్: సోహెల్‌తో పాటు ఆ కంటెస్టెంట్‌కు మద్దతు.!

అన్ని భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల నుంచి ఊహించని దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగానే ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుని, నాలుగోది కూడా మొదలైంది. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న సీజన్ రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఈ సీజన్‌లో సోహెల్, మెహబూబ్, అఖిల్ సార్థక్ గ్రూప్ హైలైట్ అయిన విషయం తెలిసిందే. వీరిలో ఒక కంటెస్టెంట్ గత వారం ఎలిమినేట్ అయ్యాడు. బయటకు వెళ్లిన తర్వాత అతడు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించి అఖిల్‌కు షాకిచ్చాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

బిగ్ బాస్ అంటేనే గ్రూపుల గోల

బిగ్ బాస్ అంటేనే గ్రూపుల గోల

తెలుగులో ప్రసారం అవుతోన్న షోలు అన్నింటిలో బిగ్ బాస్ ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. అంతలా ఈ షో ప్రభావం చూపిస్తోంది. ఈ షో హైలైట్ అవడానికి అందులో జరిగే గొడవలు కూడా ఒక కారణమే. ఇప్పటి వరకు ప్రసారం అయిన ప్రతి సీజన్‌లోనూ కొట్లాటలు జరిగాయి. కొందరు కొందరు గ్రూపులుగా ఏర్పడడం వల్లే బిగ్ బాస్‌లో ఈ పరిస్థితులు కనిపించాయి.

ఈ సీజన్‌లో మూడు గ్రూపులు

ఈ సీజన్‌లో మూడు గ్రూపులు

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో సైతం కొన్ని గ్రూపులు కనిపిస్తున్నాయి. షో సగం రోజులు పూర్తయ్యే సరికి అభిజీత్, హారిక, లాస్య, నోయల్‌లు ఒక టీమ్‌గా... అఖిల్ సార్థక్, సోహెల్, మెహబూబ్, మోనాల్ గజ్జర్ మరో జట్టుగా... ఆరియానా, అవినాష్, అమ్మ రాజశేఖర్‌లు ఇంకో గ్రూపుగా ఏర్పడ్డారు. దీంతో ఆయా జట్ల మధ్య తరచూ ఏదో ఒక వాగ్వాదం జరిగేది.

వీళ్లు ముగ్గురు మాత్రం క్లోజ్‌గా

వీళ్లు ముగ్గురు మాత్రం క్లోజ్‌గా

మిగిలిన వాళ్లతో పోలిస్తే బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ సార్థక్, సోహెల్, మెహబూబ్ ఎంతో క్లోజ్‌గా ఉంటూ కనిపించారు. గేమ్‌లోనైనా, టాస్కుల్లోనైనా, ఇంటి పనుల్లోనైనా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వచ్చారు. నామినేషన్ ప్రక్రియలోనూ స్వార్థంగా వ్యవహరించారు. ఫలితంగా మిగిలిన వారి కంటే ఈ ముగ్గురు కంటెస్టెంట్లే బాగా హైలైట్ అవుతూ వచ్చారు.

గ్రూపు నుంచి ఒకరు అవుట్

గ్రూపు నుంచి ఒకరు అవుట్

గత వారం జరిగిన ఎలిమినేషన్‌లో ఈ గ్రూపు సభ్యుడైన మెహబూబ్ దిల్‌సే షో నుంచి బయటకు వచ్చేశాడు. ఈ సీజన్ మొత్తానికి అత్యంత విషాదకరమైన ఎలిమినేషన్‌గా ఇది నిలిచింది. దీనికి కారణం అతడు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగానే ఇంటి సభ్యులందరూ భావోద్వేగానికి గురయ్యారు. వీరితో పాటు స్టేజ్ పైనున్న హోస్ట్ నాగార్జున కూడా బాధ పడినట్లు కనిపించాడు.

అఖిల్‌కు షాకిచ్చిన మెహబూబ్

అఖిల్‌కు షాకిచ్చిన మెహబూబ్

ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో మెహబూబ్ హౌస్‌మేట్స్ అందరిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ సమయంలో సోహెల్‌ను ఎక్కువగా ప్రశంసించిన అతడు.. ఆ తర్వాత అఖిల్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. వీళ్లిద్దరి తర్వాత అభిజీత్‌పైన అభిమానాన్ని చూపించాడు. ఇక, బయటకు వెళ్లిన తర్వాత మెహబూబ్ ప్లేట్ ఫిరాయించి అఖిల్‌కు భారీ షాక్ ఇచ్చాడు.

Recommended Video

Gatham Team On Their Technical Team Brilliance | Interview Part 3
సోహెల్‌తో పాటు అతడికి మద్దతు

సోహెల్‌తో పాటు అతడికి మద్దతు

ఈ వారం నామినేషన్‌లో ఉన్న సోహెల్‌కు ఓట్ చేయమని మెహబూబ్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. అదే సమయంలో ఊహించని విధంగా అభిజీత్‌కూ సపోర్ట్ చేస్తున్నాడు. హౌస్‌లో ఉన్నప్పుడు తరచూ గొడవ పడిన వ్యక్తికి ఇప్పుడు మద్దతు తెలపడంతో అంతా షాక్ అవుతున్నారు. అదే సమయంలో అఖిల్, సోహెల్ ఫ్యాన్స్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X