Sreemukhi: రామలక్ష్మణులు కల్పిత పాత్రలా? సరికొత్త వివాదంలో శ్రీముఖి.. నెటిజన్స్ ఫైర్!
తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో చాలా మంది మేల్ అండ్ ఫీమేల్ యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఆ యాంకర్ లలో మంచి ఫేమ్ ఉన్న యంగ్ యాంకర్ లు కూడా ఉన్నారు. అయితే ఒకప్పుడు పలు షోస్ కి గాని ఇతర ఎంటర్టైనింగ్ ప్రోగ్రాం లలో లేడీ యాంకర్ లు సింపుల్ గానే కనిపించేవారు కానీ మెల్లగా ఇందులో గ్లామర్ డోస్ కూడా యాడ్ అయ్యి కొందరు అలరించడం స్టార్ట్ చేశారు.
కాగా ఇలా వచ్చిన యువ యాంకర్ లలో కొందరు మాత్రం పలు కాంట్రవర్సీలలో కనిపిస్తూ ఉంటారు. అయితే వారిలో మెయిన్ గా తెలుగు వచ్చిన యాంకర్ లలో అనసూయ భరద్వాజ్ పేరు మొదట వినిపిస్తుంది. కానీ తన తర్వాత రష్మీ గౌతమ్ అలాగే శ్రీముఖి ఇలా చాలామంది మంది మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. కాగా వివాదాల్లో రష్మీ కూడా పలు సందర్భాల్లో కనిపించింది.

కానీ శ్రీముఖి మాత్రం చాలా రేర్ గా కనిపించేది. కానీ ఇన్నేళ్ళలో పెద్దగా ఘాటు కాంట్రవర్సీలు కనిపించింది లేదు కానీ ఇపుడు శ్రీముఖిపై గట్టి విమర్శలు లేవనెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో మెయిన్ గా హిందువులు శ్రీముఖిపై విరుచుకుపడుతున్నారు. ఇంకొందరు అయితే ఆమెపై కేసులు కూడా పెడతాం అంటున్నారు.
మరి ఇంతలా ఊహించని కాంట్రవర్సీ రేపే విధంగా ఆమె ఏం చేసింది అంటే మన పురాణాల్లో రామాయణం నొస్సం అందరికీ తెలిసిందే. మరి ఆ రామాయణంలో అన్నతమ్ములు అంటే రామ లక్ష్మణులుగా ఉండాలి అని అనిపించేలా చేసిన రాముడు, లక్ష్మణుడు లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇపుడు షాకింగ్ గా మారాయి.
ఆమె ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో యాంకర్ గా కనిపించగా అందులో నిర్మాత దిల్ రాజు అలాగే తన సోదరుడుతో కలిసి వస్తే వారిని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. కాగా మన రామాయణంలో ఉండే రాముడు, లక్ష్మణులు ఫిక్షనల్(ఊహ) అయితే నిజ జీవితంలో రామ లక్ష్మణులు అంటే మీరే అంటూ చేసిన వ్యాఖ్యలు హిందువులలో దుమారం రేపాయి.
హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే రామ లక్ష్మణులని ఫిక్షనల్ అంటావా అని ఇపుడు శ్రీముఖిని సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. మర్యాదగా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పి తీరాలి అని డిమాండ్ చేస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఈమె చేసిన వ్యాఖ్యలు పట్ల ఇపుడు మరింత నెగిటివిటీ కొనసాగుతుంది. అంతే కాకుండా ఇంకొందరు అయితే శ్రీముఖిపై కేసులు కూడా పెడతాం అని సోషల్ మీడియాలో చెబుతున్నారు.
మరి ఈ కాంట్రవర్సీపై ఆమె ఏమన్నా వివరణ ఇస్తుందో లేదో అనేది చూడాల్సిందే. కాగా ఇదే కాకుండా పలు యాప్స్ ని ప్రమోట్ చేయడంపై కూడా ఇన్స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల్లో తనపై నెగిటివ్ కామెంట్స్ లేకపోలేవు. మరి ఈ నేపథ్యంలో తనపై ఈ రకంగా వివాదాలు చెలరేగడం షాకింగ్ అని చెప్పాలి. ఇపుడు హిందువులు మాత్రం ఈమె క్షమాపణ చెప్పి తీరాలని ఆగ్రహంగానే మరి చూడాలి ఆమె ఏమన్నా స్పందిస్తుందో లేదో అనేది.


Click it and Unblock the Notifications











