బిత్తిరి సత్తిపై హిందువులు. కేసు ఏం జరిగిందంటే?

తెలుగు బుల్లితెర దగ్గర ఎంటర్టైన్మెంట్ అందించేందుకు చాలానే ఛానెల్స్ ప్రోగ్రాంలు ఉన్నాయని తెలిసిందే. అయితే వీటిలో డెడికేటెడ్ గా కామెడీకి కూడా పలు ఛానెల్స్ ఉన్నాయి కానీ వార్తల్లో కామెడీ మిక్స్ చేసి జనాలని రంజింపచేసే కొన్ని కొత్త ప్రయోగాలు కూడా తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర అయితే ఉన్నాయి. కాగా ఇలాంటి ప్రోగ్రామ్స్ కి సరైన వక్త కూడా తప్పనిసరిగా ఉండాలి.

మరి అలా న్యూస్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ని సెట్ చేసాడు బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్. అయితే స్క్రీన్ నామ బిత్తిరి సత్తిగానే తాను అందరికీ తెలుసు. ఇలా స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ వరకు కూడా తాను వెళ్లగా రీసెంట్ గా కాంట్రవర్సియల్ నటుడు రాజ్ తరుణ్ నటించిన చిత్రం "తిరగబడరా సామి" సినిమాలో కూడా కనిపించాడు.

shocker hindus filed a case on telugu tv comedian bitthiri satthi

ఆ సినిమాలో ఆటో జానీ అంటూ మంచి హాస్యాన్ని పండించిన తాను రీసెంట్ గా ఓ షాకింగ్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. కాగా బిత్తిరి సత్తిపై ఓ వీడియో వైరల్ గా మారింది. ఇందులో తాను భగవద్గీత తరహాలో కొన్ని శ్లోకాలు కామెడీ వెర్షన్ లో చెప్పాడు. దీనితో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతపై కామెడీ చేస్తున్నట్టుగా హిందువులు అతనిపై కేసు వేశారు.

రాష్ట్రీయ వానర సేన అంటూ సైబర్ క్రైమ్ పోలీసుల వారికి అతనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించి, న్యాయస్థానంలో కూడా ఎంతో పవిత్రంగా చూసే భగవద్గీతని అపహాస్యం చేసినందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనితో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయగా. దీనితో ఇది షాకింగ్ గా మారింది.

shocker hindus filed a case on telugu tv comedian bitthiri satthi

అయితే ఈ కాంట్రవర్సీపై సత్తి మరో వీడియో పెట్టి దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. నేను కావాలని ఆ వీడియో చేయలేదు అని నేను కూడా భగవద్గీతని ఎంతగానో ఆరాధిస్తాను అని చెప్పాడు. అయితే ఖచ్చితంగా ఆ వీడియో మూలాన నా సన్నిహితులు కానీ అభిమానుల్లో కానీ మనోభావాలు దెబ్బ తిన్నా కూడా తప్పకుండా వారి అందరికీ నా క్షమాపణలు కోరుకుంటున్నాను అని తెలిపాడు. కానీ అలా కాకుండా తనపై కావాలని టార్గెట్ చేసి కేసులు పెట్టాలి అని చూసే వారికి మాత్రం తాను వార్నింగ్ ఇచ్చాడు.

అలాంటి వాళ్ళతో అయితే ఎలా తేల్చుకోవాలో అలానే తేల్చుకుంటాను అన్నటుగా బిత్తరి సత్తి తనపై వైరల్ అవుతున్న కాంట్రవర్సీకి ఒక ముగింపు ఇచ్చాడు. మరి ఇది ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ప్రస్తుతం బిత్తిరి సత్తి అయితే పలు టీవీ షోస్ తో పాటుగా కొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ ప్రొఫిషినల్ గా బిజీగా ఉన్నాడు. మరి తన ఈ కొత్త కాంట్రవర్సీలో పోలీసులు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా లేక ఎలాగో క్షమాపణలు చెప్పాడు కాబట్టి హిందూ వానర సేన వారు వదిలేస్తారా అనేది చూడాలి.

More from Filmibeat

Read more about: raj tarun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X