Yasaswi Kondepudi: సరిగమప సింగర్ యశస్వి మోసన్ని బయటపెట్టిన మహిళ.. ఏం జరిగిందంటే?
ఇటీవల కాలంలో సింగర్స్ కు కూడా కొన్ని రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక సరిగమప సింగింగ్ షో ద్వారా ఒక రోజులోనే మంచి గుర్తింపు అందుకున్న సింగర్స్ లలో యశస్వి కొండెపూడి కూడా ఉన్నాడు. అతను కేవలం ఒకే ఒక్క పాటతో జనాలను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. జాను చిత్రంలోని 'లైఫ్ ఆఫ్ రామ్' పాట పాడడంతో అతను ఓవర్ నైట్ లోనే స్టార్ సింగర్ గా మారిపోయాడు. అయితే ఇప్పుడు అతనిపై కొన్ని విమర్శలు వస్తూ ఉండడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఆ షో ద్వారా గుర్తింపు
సరిగమప సింగర్ యశస్వి ఇదివరకే చాలా రియాలిటీ షోలతో తన టాలెంట్ను నిరూపించుకునేందుకు ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి సంగీత కళాకారులు కావడంతో అతను మూడేళ్ల వయసు నుంచి మంచి సింగర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే మొదటిసారి అతనికి మాత్రం అనుకున్నంత స్థాయిలో గుర్తింపు వచ్చింది సరిగమప షో ద్వారానే.

ఒక్క రాత్రిలోనే స్టార్ సింగర్ గా..
శర్వానంద్ సమంత నటించిన జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ పాట ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా.. యశస్వి ఆ పాటను పాడిన తరువాత ఎక్కువ స్థాయిలో ఆ పాటకు కూడా గుర్తింపు రావడం విశేషం ఇక అతను ఆ పాట ద్వారా ఒక రాత్రిలోనే జనాల్లో మంచి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోకుండా అతను ఇతర రియాలిటీ షోలలో కూడా అదే పాటను పాడుతూ మంచి గుర్తింపు అందుకున్నాడు.

యశస్వి మోసం..
ఇంతకాలంపాటు సంగీతానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలిచిన యశస్వి ఇప్పుడు మాత్రం ఒక కాంట్రవర్సీ విషయంలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఒక ఎన్జీవో సంస్థను నడుపుతూ చాలా మంది అనాధ పిల్లలు బాగోగులను చూసుకుంటున్నట్లు యశస్వి చెబుతున్నాడు అని అయితే అందులో ఎలాంటి నిజం లేదు అంటూ కాకినాడకు చెందిన ఎన్జీవో మహిళ ఊహించని విధంగా మీడియా ముందుకు వచ్చే ఆ విషయంలో స్పందించారు.

అందులో నిజం లేదు
ఎన్జీవో సంస్థ నడుపుతున్నట్లు యశస్వి పైకి నాటకాలు ఆడుతున్నాడు అని అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని విమర్శలు వస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే సుమారు 60 మందికి పైగా అనాధ పిల్లలకు ఒక ఆర్గనైజ్ హోమ్ ద్వారా షెల్టర్ కల్పిస్తున్నట్లుగా సింగర్ యశస్వి రియాలిటీ షోలో ఓట్ల కోసం, సానుభూతి కోసం వినియోగించుకున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. ఇక అతను చెప్పినట్లు సహాయం అందిస్తున్నట్లు చెప్పిన విషయంలో నిజం లేదని కాకినాడ నవసేన ఫౌండేషన్ నిర్వాహకురాలు తెలిపారు.

మోసం చేశాడు అంటూ..
కాకినాడ నవసేన ఫౌండేషన్ తనది అంటూ చెప్పుకుంటున్న సింగర్ యశస్వి చెప్పిన మాటల్లో ఎలాంటి నిజం లేదు అని తెలిపారు ఆ సంస్థ ప్రతినిధి ఫరా కౌసర్. యశస్వి మమ్మల్ని మోసం చేశారు అని గత ఐదేళ్లుగా తన సొంత డబ్బుతోనే 50 మందికి పైగా పిల్లలను పోషిస్తున్నట్లుగా చదివిస్తున్నట్లుగా తెలిపాడని ఇందులో యశస్వికి ఏ విధమైన సంబంధం లేదు అని అలాగే ఇతర సెలబ్రిటీలు కూడా మా సంస్థతకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు అన్నారు. ఇక ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసిన యశస్వి పై చర్యలు తీసుకోవాలి అని ఫరా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.


Click it and Unblock the Notifications











