twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్ వీడియో: వామ్మో ఈ రేంజ్ రొమాన్సా.. హైపర్ ఆది నుంచి ఇది ఊహించి ఉండరు.!

    By Manoj
    |

    తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న సెలెబ్రిటీల్లోనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది. కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ యంగ్ కమెడియన్ కమ్ రైటర్... తక్కువ కాలంలోనే ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు. తనదైన పంచులు, ప్రాసలతో జనాలను కడుపుబ్బా నవ్విస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు కామెడీ స్కిట్లు మాత్రమే చేసిన ఆది.. తాజాగా ఓ యాంకర్‌తో రొమాన్స్ చేశాడు. అది కూడా అందరూ నోరెళ్లబెట్టి చూసేలా ఆమెను నలిపేశాడు. ఆ సంగతులేంటో మీరూ చూడండి.

    ఆది కోసం చాలా మంది వెయిటింగ్.. అందుకే సక్సెస్

    ఆది కోసం చాలా మంది వెయిటింగ్.. అందుకే సక్సెస్

    జబర్ధస్త్ షో ఎంత పాపులర్ అయిందో.. అందులోని టీమ్ లీడర్ అయిన ఆదికి కూడా అంతకంటే ఎక్కువ క్రేజ్ వచ్చింది. పది నిమిషాల పాటు వచ్చే అతడి స్కిట్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదరు చూస్తూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అంతలా తన కామెడీ టైమింగ్‌తో ప్రభావం చూపిస్తున్నాడీ యంగ్ టాలెంటెడ్ కమెడియన్. అందుకే ఆది స్కిట్లకు వ్యూస్ కూడా ఎక్కువే.

    అక్కడ కూడా అడుగు పెట్టేశాడు.. సత్తా చాటాడు

    అక్కడ కూడా అడుగు పెట్టేశాడు.. సత్తా చాటాడు


    బుల్లితెరపై వచ్చే షోలలోనే కాదు.. సినిమాల్లోనూ హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే అతడు ఎన్నో చిత్రాల్లో నటించాడు. మరికొన్నింటికి సంతకాలు కూడా చేసేశాడు. కేవలం నటుడిగానే కాదు.. డైలాగ్ రైటర్ గానూ ఆది తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అల్లరి నరేష్ నటించిన ‘మేడ మీద అబ్బాయి' అనే సినిమాకే హైపర్ టాలెంటెడ్ కమెడియన్ సంభాషణలు అందించాడు.

    జబర్ధస్త్ మాత్రమే కాదు.. ఆ షోను సక్సెస్ చేశాడు

    జబర్ధస్త్ మాత్రమే కాదు.. ఆ షోను సక్సెస్ చేశాడు

    హైపర్ ఆది.. జబర్ధస్త్ షోలో టీమ్ లీడర్‌గా చేయడంతో పాటు కొన్ని స్పెషల్ ఈవెంట్లకు స్క్రిప్టు రాస్తాడన్న విషయం చాలా మందికి తెలియదు. అలాగే, ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ'కి కూడా స్క్రిప్ట్ రాస్తాడు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం సుడిగాలి సుధీర్ రివీల్ చేశాడు. ఇప్పుడా షోలో ఆది.. టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

    ఆ యాంకర్‌తో లవ్ ట్రాక్.. అందరి ముందు చెప్పాడు

    ఆ యాంకర్‌తో లవ్ ట్రాక్.. అందరి ముందు చెప్పాడు

    జబర్ధస్త్ షోలో అనసూయ వెంట పడుతూ ఉంటాడు హైపర్ ఆది. ఆయన ఇలా చేసేది స్కిట్‌లో భాగమే అని అందరికీ తెలుసు. ఇక, ‘ఢీ'లో మాత్రం తన కో యాంకర్ వర్షిణితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్‌లో ఆమెతో కలిసి ‘సామజవరగమన' పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. ఆ సమయంలో తామిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని చెప్పాడు.

    వామ్మో ఈ రేంజ్ రొమాన్సా.. చూస్తే షాక్ అవుతారు


    ఇక, ఇదే షోకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ఇందులో హైపర్ ఆది.. వర్షిణితో అదిరిపోయే రొమాన్స్ చేశాడు. ఓ రొమాంటిక్ సాంగ్‌కు ఈ జంట లీనమైపోయి మరీ నటించింది. దీంతో ఆదిలోని ఈ యాంగిల్ చూడని సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌తో పాటు జడ్జ్‌లు శేఖర్, ప్రియమణి, పూర్ణ నోరెళ్లబెట్టేశారు. దీంతో ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

    Recommended Video

    Hyper Aadi Skit Not Shown In Popular Comedy Show Latest Episode || Filmibeat Telugu
    పంచులతో కొట్టేవాడు.. ఇలా అయిపోయాడేంటి.?

    పంచులతో కొట్టేవాడు.. ఇలా అయిపోయాడేంటి.?


    హైపర్ ఆది అంటే పంచులు, ప్రాసలు మాత్రమే చాలా మందికి గుర్తు వస్తాయి. వీటి వల్లే అతడు బాగా పాపులర్ కూడా అయ్యాడు. కానీ, ఎప్పుడైతే ‘ఢీ' షోలోకి ఎంట్రీ ఇచ్చాడో.. అప్పటి నుంచి అతడి పద్దతి పూర్తిగా మారిపోయింది. వర్షిణితో కలిసి డ్యాన్స్‌లు చేయడం.. ఇలా రొమాన్స్ పండించడం వంటి వాటితో హైపర్ ఆది హాట్ టాపిక్ అవుతున్నాడు.

    English summary
    Jabardasth with tagline Katharnak Comedy Show is Telugu-language television channel comedy television series, broadcasts on the ETV Network channel which is shot at Annapoorna Studios, Telangana, India. The show is produced by Mallemala Entertainments and Directed by Nitin and Bharath.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X