Jabardasth: రష్మి గౌతమ్ కు కూడా అదే షాక్.. అయినా కూడా జబర్దస్త్ షోను విడువకుండా..
జబర్దస్త్ ద్వారా కమెడియన్స్ తో పాటు యాంకర్స్ కూడా భారీ స్థాయిలో మంచి గుర్తింపు అందుకున్నవారే. జబర్దస్త్ లో కేవలం గ్లామర్ షోతో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వారు కూడా టైమింగ్ పంచ్ లతో ఆకట్టుకుంటూ వచ్చారు. అనసూయ భరద్వాజ్ రష్మి గౌతమ్ జబర్దస్త్ లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అనే చెప్పాలి. అయితే రీసెంట్ గా అనసూయ భరద్వాజ్ బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అలాగే మరొకవైపు రష్మీ గౌతమ్ కూడా బయటకు రావచ్చని టాక్ వచ్చింది. అయితే ఆమె మాత్రం నిర్వాహకులు ఒక షాక్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నెంబర్ వన్ షోగా
జబర్దస్త్ ద్వారా ఎవరు ఎలాంటి గుర్తింపు అందుకున్నా కూడా కొంతమంది సమిష్టి కృషితోనే ఆ షో టాప్ రేటింగ్స్ అందుకుంది అని చెప్పాలి. కేవలం కమెడియన్స్ మాత్రమే కాకుండా అందులో పాల్గొన్న నాగబాబు రోజా అలాగే యాంకర్ అనసూయ రష్మి గౌతమ్ ఇలా అందరి సపోర్ట్ తోనే జబర్దస్త్ నెంబర్ వన్ షోగా నిలదొక్కుకుంటూ వచ్చింది.

ఆ కారణంగా బయటకు?
అయితే ఇటీవల కాలంలో మాత్రం వివిధ కారణాల వలన జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాగబాబు అయితే చాలా ఓపెన్ గానే తెలియజేశారు అక్కడ కొంతమందికి అన్యాయం జరుగుతుంది అని మేనేజ్మెంట్ సరిగ్గా పట్టించుకోవడం లేదు అని కూడా వాదించి బయటకు వచ్చేసినట్లుగా తెలియజేశారు.

అలా దూరమైన రోజా
రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా రోజా మొన్నటి వరకు జబర్దస్త్ షో ను ఏ మాత్రం విడలేదు. కానీ ఆమె కూడా ఉన్నత స్థాయిలో రాజకీయాల్లో కొనసాగేందుకు జబర్దస్త్ నుంచి దూరం కావాల్సి వచ్చింది. ఇక వారి స్థానంలో మనో, ఇంద్రజ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా సుడిగాలి సుదీర్ టీమ్ తో పాటు మరి కొంతమంది సీనియర్ కమెడియన్లు కూడా మెల్లగా జబర్దస్త్ మంచి వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

అనసూయ కూడా
ఒక విధంగా సీనియర్లు వెళ్లిపోతున్నప్పటినుంచి కూడా జబర్దస్త్ రేటింగ్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఉన్నవారు అనుకున్నంత స్థాయిలో అయితే ఆకట్టుకోవడం లేదు. అయితే రీసెంట్గా జబర్దస్త్ నిర్వాహకులు ఒక నిర్ణయం తీసుకోవడం వలన ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అందులో అనసూయ భరద్వాజ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ చేయడం తో జబర్దస్త్ ను విడిపోతున్నట్లు టాక్ వచ్చింది.

రష్మి వెనక్కి తగ్గకుండా..
అయితే ఎవరూ వెళ్లిపోయిన కూడా రష్మీ గౌతమ్ మాత్రం వెళ్లిపోవడానికి ఇష్టపడడం లేదు. ఒక విధంగా ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటుంది. దాదాపు లక్షల పైగానే ఒక ఎపిసోడ్ కు ఆమెకు అందుతున్నట్లు సమాచారం. అయితే రీసెంట్ గా కొందరికి పారితోషితోషకాలు తగ్గించడం వల్లనే బయటకు వచ్చేశారు. ఇక రష్మీ గౌతమ్ కు కూడా కొంత పారితోషికం తగ్గించారట. అయినప్పటికీ కూడా ఆమె మరి కొన్నాళ్లపాటు జబర్దస్త్ లోనే కొనసాగాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











