Bigg boss 4 final guest: లిస్టులో ముగ్గురు స్టార్ హీరోలు, ఇద్దరు స్టార్ దర్శకులు
బిగ్ బాస్ షో రేటింగ్స్ విషయంలో మళ్ళీ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. కనీసం డైలీ సీరియల్స్ రేంజ్ లో కూడా క్లిక్కవడం లేదనే టాక్ వస్తోంది. ఇలానే కొనసాగితే మీలో ఎవరు కోటీశ్వరుడు మాదిరిగానే బిగ్ బాస్ కూడా సైలెంట్ గా మాయమయ్యే అవకాశం ఉందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇక బిగ్ బాస్ షోలోకి గతంలో మాదిరిగానే స్టార్స్ ను స్పెషల్ గెస్టులుగా పిలవాలని అనుకుంటున్నారు.

ఆ తరువాత మళ్ళీ క్లిక్కవ్వలేదు
సమంత, సుమ రాకతో గతంలో ఎపిసోడ్స్ కు ఏ విధంగా రేటింగ్స్ పెరిగాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సమంత అయితే నాగార్జున రేంజ్ లో క్లిక్కయ్యింది. ఇక సుమ గెస్ట్ ఎంట్రీ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంది. అయితే ఆ తరువాత మళ్ళీ నాగార్జున కూడా షోకి బజ్ క్రియేట్ చేయలేకపోయారు. మొన్న వచ్చిన సుదీప్ వల్ల కూడా జనాలు పెద్దగా ఎట్రాక్ట్ అవ్వలేదు.

ఇలా కోసాగితే చాలా కష్టం..
ఇక ఫైనల్ హోస్ట్ వరకు ఇలానే కొనసాగితే షో మనుగడను కోల్పోవడం కాయమనే టాక్ వస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే రానున్న రోజుల్లో గెస్టులను ఎవరిని దించుతారో తెలియదు గాని ఫైనల్ ఎపిసోడ్ కు మాత్రం ఎవరు ఊహించని సెలబ్రెటిని రప్పించాలని అనుకుంటున్నారు. గత సీజన్ లో మెగాస్టార్ ద్వారా టైటిల్ విన్నర్ ను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

లిస్టులో అగ్ర హీరోల పేర్లు
ఇక ఈ సారి అగ్ర హీరోలతో పాటు స్టార్ దర్శకులు కూడా ఆ లిస్టులో ఉన్నట్లు టాక్ అయితే గట్టిగానే వస్తోంది. మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల పేర్లు ఇప్పటికే పలుమార్లు చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం. ఇక మొదటి సీజన్ తో తెలుగు బిగ్ బాస్ కి ప్రాణం పోసిన జూనియర్ ఎన్టీఆర్ ను కూడా సంప్రదించినట్లు సమాచారం.
Recommended Video

రాజమౌళి కూడా రాబోతున్నారా?
ఇక దర్శకుల విషయానికి వస్తే నాగార్జున సలహా మేరకు కొంతమంది అగ్ర దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. కుదిరితే హీరో దర్శకుల కాంబినేషన్ లోనే బిగ్ బాస్ విన్నర్ ను ఎనౌన్స్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఆ లిస్టులో పూరి జగన్నాథ్ తో పాటు దర్శకధీరుడు రాజమౌళి కూడా పేరు కూడా ఉందట. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











