Don't Miss!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్‌బాస్ 5 కొత్త హోస్ట్.. అప్పుడే ప్రచారాలు మొదలు పెట్టేశారు.. నాగార్జున బోర్ కొట్టేశాడా?
బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి కావడానికి ఇంకా ఎక్కువ రోజులేమి లేదు. ఇప్పటికే ఫైనల్ విన్నర్ ఎవరనే విషయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మరో వారం గడిస్తే షో ఫైనల్ ట్విస్ట్ ఏమిటనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఇక షో ఫైనల్స్ కు ఇంకా సరిగ్గా చేరుకొనే లేదు ఇప్పుడే సీజన్ 5 గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏకంగా బిగ్ బాస్ 5 హోస్ట్ కూడా ఫిక్స్ అయినట్లు రూమర్స్ క్రియేట్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
హోస్ట్ విషయంలో.. నమ్మకంగా లేని బిగ్ బాస్
బిగ్ బాస్ సీజన్ 1 ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే హోస్ట్ విషయంలో ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ అని పక్కా సమాచారం అందినప్పటికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు కూడా కొంతమంది అభిమానులు నమ్మలేదు. ఇక సీజన్ 2కు నాని వస్తాడని ఎవరు ఊహించలేదు. అలాగే నాగార్జున ఆ తరువాత కంటిన్యూ అవుతాడని కూడా బిగ్ బాస్ నమ్మకంతో క్లారిటీ ఇవ్వలేదు.
సల్మాన్ లా సపోర్ట్ ఇచ్చే వారే లేరా?
బిగ్ బాస్ నిర్వాహకులకు ఒక విధంగా హోస్ట్ విషయం పెద్ద బారంగానే మారింది. హిందీలో మాదిరిగా సల్మాన్ ఖాన్ లాగా సపోర్ట్ ఇచ్చే ఒక్క స్టార్ కూడా దొరకడం లేదా అనే కామెంట్స్ అయితే చాలానే వస్తున్నాయి. మన దగ్గర స్టార్ట్ హీరోలు ఎంతమంది ఉన్నా కూడా హోస్ట్ గా చేయడానికి మాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు.
బిగ్ బాస్ 5పై ముందే చర్చలు..
ఇక వచ్చే ఎడాది సమ్మర్ అనంతరం మరో సీజన్ ను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ సీజన్ పూర్తయిన రెండు నెలల తరువాతనే నిర్వాహకులు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 5పై చర్చలు జరిపడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ అయితే వస్తోంది. వీలైనంత వరకు హోస్ట్ విషయంలో ఒక స్టార్ తో ముందే ఒప్పందం కుదుర్చుకోవాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
నాగార్జున బోర్ కొట్టేశాడా..?
ఇక బిగ్ బాస్ 5కోసం నాగార్జున కంటిన్యూ అవ్వడనే రూమర్స్ కూడా చాలానే వస్తున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్, నాని హోస్ట్ గా బాద్యతలు తీసుకున్నప్పుడు మొదట్లో ఉన్న జోష్ ను చివర్లో చూపించలేదు. అదొక భారం అంటూ టెన్షన్ గా ఫీల్ అయ్యారు. ముందుగానే మరోసారి చేయలేమని చేతులెత్తేశారు. కానీ నాగ్ మాత్రం చాలా ఆసక్తిగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే తరువాత సీజన్ కు మరో స్టార్ ను ఫిక్స్ చేయనున్నట్లు టాక్ వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video
సమంత హోస్ట్ గా..
ఇక ఈ సీజన్ లో మేజర్ హైలెట్ ఎపిసోడ్స్ లలో సమంత ఎంట్రీ ఒకటి. ఆమె దసరా సందర్భంగా ప్రత్యేకంగా హోస్ట్ గా బాధ్యత తీసుకోవడం ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. పైగా టాప్ రేటింగ్స్ కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం సామ్ జామ్ షోతో కూడా ఓటీటీ వరల్డ్ లో మంచి క్రేజ్ అందుకుంటున్న సమంతకు వచ్చే ఏడాది బిగ్ బాస్ సీజన్ ను హోస్ట్ గా ఫిక్స్ చేయాలని స్టార్ మా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.