కార్తీకదీపం అభిమానులకు బ్యాడ్ న్యూస్.. కర్చీఫ్‌లు రెడీ చేసుకోండి.. వంటలక్క పనైపోయినట్లే?

ఇటీవల కాలంలో అన్ని సీరియల్స్ లను డామినేట్ చేస్తూ టాప్ రేటింగ్ అందుకుంటున్న కార్తీకదీపం గురించి అందరికి తెలిసిందే. టాప్ రియాలిటీ షోలు పోటీగా ఉన్నప్పటికీ వంటలక్క దెబ్బకు డౌన్ అయ్యాయి. ప్రతి వారం అత్యదిక రేటింగ్స్ అందుకుంటూ వస్తున్న ఈ సీరియల్ గురించి ఇటీవల కొన్ని షాకింగ్ రూమర్స్ అభిమానులను షాక్ కు గురి చేసేలా ఉన్నాయి. సీరియల్ దాదాపు తుది దశకు చేరుకున్నట్లే అంటూ.. మధ్యలో ఎవరు ఊహించని విధంగా ఎమోషన్ టచ్ ఉంటుందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

గత మూడేళ్ళుగా..

గత మూడేళ్ళుగా..

కార్తీక దీపం గురించి తెలియని తెలుగు ఆడియేన్ ఉండరు. ప్రతి ఇంట్లో ఈ సీరియల్ ఒక బాగమైపోయింది. ఇక నేటితరం యంగ్ జనరేషన్ కూడా మీమ్స్ తో ఎదో ఒక విధంగా వంటలక్క అభిమానులైపోయారు. స్టార్ మాలో ఈ సిరియల్ సరికొత్త రేటింగ్స్ తో రికార్డులను క్రియేట్ చేస్తూ వస్తోంది. గత మూడేళ్ళుగా ఈ సిరియల్ టాప్ రేటింగ్స్ అందుకుంటోంది.

వెయ్యి ఎపిసోడ్స్ కు చేరువలో..

వెయ్యి ఎపిసోడ్స్ కు చేరువలో..

2017లో మొదలైన కార్తీక దీపం 997 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. మరో మూడు ఎపిసోడ్స్ పూర్తయితే 1000మార్క్ ను అందుకున్న సీరియల్ గా రికార్డు క్రియేట్ చేయనుంది. ఎదో యావరేజ్ గా రెండేళ్లు నడుస్తుందని అనుకున్న ఈ సీరియల్ సక్సెస్ ఫుల్ గా వెయ్యి ఎపిసోడ్స్ కు చేరుకుంది.

 అవే మేజర్ ప్లస్ పాయింట్స్

అవే మేజర్ ప్లస్ పాయింట్స్

అసలు ఈ సీరియల్ ఈ రేంజ్ లో హిట్టవుతుందని ఎవరు ఊహించలేదు. సిరియల్ కాన్సెప్ట్ పై మీమ్స్ ఎన్ని వచ్చినా కూడా ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అయిపోయేలా డిజైన్ చేస్తూ వస్తున్నారు. కార్తీక్ బాబు, వంటలక్క, మౌనిత పాత్రలకు జనాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. డైలాగ్స్ తో పాటు నటీనటులు యాక్టింగ్ సీరియల్ కు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

ట్విస్ట్.. శుభం కార్డ్?

ట్విస్ట్.. శుభం కార్డ్?


అయితే త్వరలోనే కార్తీక దీపం సీరియల్ కు శుభం కార్డ్ పడనున్నట్లు టాక్ వస్తోంది. ఈ రూమర్ తో తెలుగు జనాలు కాస్త షాక్ కు గురవుతున్నారు. నిజమేనా అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే మధ్యలో ఒక ట్విస్ట్ ఉండబోతున్నట్లు టాక్ వస్తోంది.

 ఈ షాక్ తట్టుకోగలరా?

ఈ షాక్ తట్టుకోగలరా?

సిరియల్ లో వంటలక్క పాత్రకు జనాలు ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సిరియల్ లో ఆ పాత్ర పనైపోయినట్లే అనే కామెంట్స్ వస్తున్నాయి. వంటలక్క చనిపోతుందని ఆ తరువాత డాక్టర్ బాబు మారిపోయి పిల్లలిద్దరితో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాడట. నిజంగా వంటలక్క చనిపోతే లేడి ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేరని చెప్పవచ్చు.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
మధ్యలో మరో ట్విస్ట్

మధ్యలో మరో ట్విస్ట్

ఇక వంటలక్క మరణం అనంతరం మౌనిత సూసైడ్ నాటకం కూడా ఉంటుందని కామెంట వస్తున్నాయి. ఈ దెబ్బతో సీరియల్ ను మరో 300 వందల రోజులు సాగదీయవచ్చని టాక్ కూడా వస్తోంది. అంటే డాక్టర్ బాబును పెళ్లి చేసుకోవాలని మౌనిత వేసే ప్లాన్స్ మామూలుగా ఉండవట. ఏదేమైనా వంటలక్క లేకపోతే కార్తీక దీపంను ఊహించుకోవడం కష్టమే అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X