హీరోయిన్‌తో శేఖర్ మాస్టర్ రొమాన్స్: గదిలో ఆ పని చేస్తూ దొరికిన కొరియోగ్రాఫర్.. వీడియో లీక్ అవడంతో!
తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల కొత్త కొత్త షోలు పుట్టుకొస్తున్నాయి. కానీ, అందులో చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోన్నాయి. అందులో బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో పేరొందిన 'ఢీ' ఒకటి. ఈటీవీలో ప్రసారం అవుతోన్న ఈ షో సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కొత్త సీజన్‌ను జరుపుకుంటోంది. ఇక, ఇందులో రాబోయే ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు జరిగినట్లు చూపించారు. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

సౌతిండియాలో నెంబర్ వన్‌గా
డ్యాన్స్ ఆధారంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వచ్చాయి. అయితే, అందులో 'ఢీ' మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణను అందుకుంది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ డ్యాన్స్ షోగా దూసుకుపోతోంది. అందుకు తగ్గట్లే ఆదరణనూ పెంచుకుంటోంది.

పదిహేనో సీజన్‌తో వచ్చేసింది
'ఢీ' షో ఇప్పటికే పద్నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే పదిహేనో దానిని కూడా చాలా రోజుల క్రితమే ప్రారంభించారు. 'చాంపియన్స్ బ్యాటిల్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతూ వచ్చింది. అందుకే గత వాటి కంటే దీనికి మరింత స్పందన దక్కుతోంది.

ఈ సీజన్ ఎలా సాగుతుందంటే
'చాంపియన్స్ బ్యాటిల్' సీజన్‌ను ఏ అండ్ బీ అనే రెండు టీమ్‌ల మధ్య పోటీగా మొదలెట్టారు. ఈ సీజన్‌కు హైపర్ ఆది, జస్వంత్ పడాలతో పాటు ఓ అమ్మాయిని మెంటర్లుగా పెట్టారు. ఈ సీజన్‌కు జడ్జ్‌లుగా శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్‌లు ఉన్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు. వీళ్ల కామెడీతో పదిహేనో సీజన్‌కు టీఆర్పీ కూడా భారీగానే దక్కుతోంది.

ఉగాది స్పెషల్.. వాళ్లు ఎంటర్
'ఢీ 15.. చాంపియన్స్ బ్యాటిల్' షోలో భాగంగా వచ్చే బుధవారం ఉగాది స్పెషల్ ఎపిసోడ్‌ను నిర్వహించబోతున్నారు. ఇందులో పాత లేదా స్పెషల్ కంటెస్టెంట్లు వచ్చి ఒక టీమ్‌కు సహాయం చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ఓ కంటెంస్టెంట్ కోసం 'ఢీ 10' విన్నర్ రాజు వచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోను మల్లెమాల టీమ్ వాళ్లు తాజాగా విడుదల చేశారు.

అడ్డంగా దొరికిపోయిన పండు
'ఢీ 15.. చాంపియన్స్ బ్యాటిల్' షోలోకి పండు మాస్టర్ వైల్డ్ కార్డు ద్వారా ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతడు వచ్చినప్పటి నుంచి షోలో కామెడీ మరింత ఎక్కువైపోయింది. డ్యాన్సులతోనే కాదు.. పంచులతో పండు ప్రేక్షకులకు అదిరిపోయే మజాను అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు తాజాగా ఓ ఊహించని పని చేస్తూ దొరికిపోయి పరువు తీసుకున్నాడు.

వీడియో కూడా లీక్ చేశారుగా
ముందుగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఈ షోలో పండు మాస్టర్ తన గదిలో మందు తాగుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను స్క్రీన్‌పై చూపించాడు. ఆ సమయంలో అతడు ఎంత బ్రతిమాలినా వదిలిపెట్టలేదు. దీంతో వీడియో కూడా చూపించుకోండి అన్నాడు. దీంతో పండు మందు తాగుతున్న వీడియోను ప్రదీప్ చూపించాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
శ్రద్దాతో శేఖర్ మాస్టర్ డ్యాన్స్
ఇక, ఇదే ప్రోమోలో జడ్జ్‌లు శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్ అదిరిపోయే రొమాన్స్ పండిస్తూ 'ఉప్పెన' సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేశారు. వాళ్లు స్టేజ్‌పై రెచ్చిపోయి మరి రొమాన్స్ చేశారు. అది చూసి ఒకవైపు హైపర్ ఆది, మరోవైపు పండు నోరెళ్లబెట్టేశారు. మొత్తానికి వచ్చే బుధవారం ప్రసారం అయ్యే 'ఢీ' షో ప్రేక్షకులకు మరింత మజాను అందిస్తుందనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











