హీరోయిన్ ప్రేమలో యాంకర్ ప్రదీప్: సీక్రెట్ లీక్ చేసిన బ్యూటీ.. సంచలనంగా మారిన కొత్త జంట
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తూ ఓ రేంజ్‌లో హవాను చూపిస్తున్నారు. దీంతో మేల్ యాంకర్లుగా పెద్దగా అవకాశాలను అందుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ.. వరుస షోలతో తన సత్తాను నిరూపించుకుంటోన్నాడు ప్రదీప్ మాచిరాజు. అదిరిపోయే పంచులు, ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్‌తో మజాను పంచుతోన్న అతడు.. బుల్లితెరపై హవాను చూపిస్తోన్నాడు. ఈ పరిస్థితుల్లో తాజాగా ప్రదీప్ ఓ హీరోయిన్ మది దోచుకున్నాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే...

నంది అవార్డుతో ఫుల్ ఫేమస్
ప్రదీప్ మాచిరాజు రేడియో జాకీగా కెరీర్‌ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అలా వచ్చిన చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన హోస్టింగ్‌తో అదరగొట్టేశాడు. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ వచ్చాడు. ఇక, 'గడసరి అత్త సొగసరి కోడలు' షోతో ప్రదీప్ పాపులర్ అయ్యాడు. ఏకంగా దీనితో నంది అవార్డును దక్కించుకున్నాడు.

సినిమాల్లోనూ... ఫస్ట్ మూవీతో
సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తోన్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. కొన్నేళ్ల క్రితమే సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గతంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా మారాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది.

వరుసగా షోలతో హవా చూపి
యాంకర్‌గా ప్రదీప్ మాచిరాజు ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. ఇందులో చాలా వరకూ సూపర్ హిట్ అయినవే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని కార్యక్రమాలను ఒప్పుకుంటూ దూసుకుపోతూనే ఉన్నాడు. ప్రస్తుతం అతడు 'ఢీ 15', 'జీ సూపర్ ఫ్యామిలీ', 'లేడీస్ అండ్ జెంటిల్‌మన్' సహా పలు షోలు చేస్తోన్నాడు. వీటితో పాటు ఈవెంట్లు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోన్నాడు.

ప్రదీప్ పెళ్లి హాట్ టాపిక్‌గానే
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకడు. సుదీర్ఘ కాలంగా అతడి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అతడి పెళ్లి విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై ప్రదీప్ కూడా పలుమార్లు స్పందిస్తూ.. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని వివరణ ఇచ్చేశాడు.

హీరోయిన్ ప్రేమలో ప్రదీప్
దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న 'ఢీ' ప్రస్తుతం 15వ సీజన్‌ను జరుపుకుంటోంది. గతంలో కంటే ఇందులో సరికొత్త కాన్సెప్టులు, కంటెంట్‌ను చూపిస్తున్నారు. దీనికి యాంకర్‌గా ప్రదీప్ మాచిరాజే చేస్తున్నాడు. అలాగే, శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్‌లు జడ్జ్‌లుగా చేస్తున్నారు. ఇక, ఇందులో ప్రదీప్, శ్రద్దా మధ్య ట్రాక్ మొదలెట్టబోతున్నారు.
సీక్రెట్ లీక్ చేసిన హీరోయిన్
'ఢీ' 15వ సీజన్‌లో జడ్జ్‌గా ఉన్న శ్రద్దా దాస్ తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో ఆమెకు యాంకర్ ప్రదీప్ మాచిరాజు మీద క్రష్ ఉన్నట్లు చెప్పింది. 'నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా. నాకు ప్రదీప్ మీద చిన్న క్రష్ ఉంది' అని చెప్పింది. అంతేకాదు, ఇద్దరూ కలిసి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేసి అలరించారు.

పెద్దది కావాలంటూ.. పంచ్
శ్రద్దా దాస్ చెప్పిన వెంటనే ప్రదీప్ మాచిరాజు కూడా ఆమెకు ప్రపోజ్ చేయడంతో పాటు రొమాంటిక్ ఫోజులు పెట్టాడు. దీంతో శేఖర్ మాస్టర్ 'మీ చిన్న క్రష్ పెద్దవి అవ్వాలని కోరుకుంటున్నా. మీ జంట చూడ్డానికి చూడముచ్చటగా ఉంది' అని శ్రద్దా దాస్‌తో అన్నాడు. అప్పుడు అక్కడే ఉన్న హైపర్ ఆది 'మధ్యలో మీ ఇంట్రెస్ట్ ఏంటి. మీకు ఒంట్లో బాలేదా' అని పంచ్ వేశాడు.


Click it and Unblock the Notifications











