twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ శ్రావ్యారెడ్డి 300 ఎగ్స్ ఛాలెంజ్‌పై విమర్శలు.. కేసు పెడతామంటూ వార్నింగ్!

    |

    తెలుగు యాంకర్, నటి, హాట్ మోడల్ శ్రావ్య రెడ్డి అభిమానులను ఎంటర్టెన్ చేయడమే లక్ష్యంగా వరుస యూట్యూబ్ వీడియోలను రిలీజ్ చేస్తోంది. శ్రావ్యారెడ్డి బాత్ టబ్ ఛాలెంజ్ పేరుతో ఇప్పటికే బీర్ ఛాలెంజ్, ఐస్ ఛాలెంట్ అంటూ ఆమె విడుదల చేసిన వీడియోలకు మంచి స్పందన వచ్చింది.

    ఈ సారి శ్రావ్యా రెడ్డి తన సోదరి విదా చైతన్యతో కలిసి మరో వినూత్నమైన బాత్ టబ్ ఛాలెంజ్ చేశారు. 300 కోడి గుడ్ల సొనతో ఈ ఛాలెంజ్ నిర్వహించారు. నెటిజన్లను ఆకట్టుకోవడానికి చేసిన ఈ వీడియో చివరకు విమర్శలకు దారి తీసింది.

    ఫుడ్ వేస్ట్ చేయొద్దు అంటూ...

    ఫుడ్ వేస్ట్ చేయొద్దు అంటూ...

    శ్రావ్యా రెడ్డి 300 కోడి గుడ్లను వృధా చేయడంపై కొందరు నెటిజన్లు మండి పడ్డారు. ఫుడ్ ఐటమ్స్ వేస్ట్ చేయవద్దు... ఛాలెంజ్ లాంటివి చేయాలంటే బాగా మరిగిన వేడి నీళ్లలో బాత్ టబ్ ఛాలెంజ్ చేయండి అంటూ విమర్ళలు గుప్పించారు.

    కోర్టుకు వెళతాం అంటూ వార్నింగ్

    కోర్టుకు వెళతాం అంటూ వార్నింగ్

    మరొకసారి ఇలా ఫుడ్ ఐటమ్స్ వేస్ట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తే... మీ మీద కేసు పెడతాం, కోర్టు వెళ్లడానికి సైతం వెనకాడబోము అంటూ కొందరు శ్రావ్యా రెడ్డిని సున్నితంగా హెచ్చరించడం గమనార్హం.

    అలా చేస్తే మంచి పేరొచ్చేది

    అలా చేస్తే మంచి పేరొచ్చేది

    300 గుడ్లను పేద ప్రజలకు పంచి పెడితే మీకు ఇంతకంటే మంచి పేరు వచ్చేది కదా... నలుగురి కడుపు నింపాల్సిన ఆహారాన్ని ఇలా ఎందుకు నేలపాలు చేశారు. ఇది సరైన చర్య కాదు అంటూ పలువురు విమర్శలు చేశారు.

    ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ

    అయితే కొందరు మాత్రం మీరు చేసిన ఈ ఛాలెంజ్ బావుంది. అందంగా కనిపించారు. ఈ సారి తేనెతో ట్రై చేయండి అంటూ ప్రశంసలు సైతం గుప్పించారు. అయితే ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లలో ప్రశంసించే వారికంటే విమర్శిస్తూ వచ్చిన కామెంట్లే ఎక్కువ. కొందరైతే చెప్పడానికి వీలులేని భయంకరమైన కామెంట్స్ చేశారు.

    English summary
    SHRAAVYA REDDY 300 Eggs Bath Challenge with Vida Chaitanya. "How dare you waste so much food......Mass petition is going to be filled in Andhra High Court" people warning to Shravya Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X