Bigg Boss Non Stop: స్మగ్లర్ల టాస్క్ హింసాత్మకం.. ఆ కంటెస్టెంట్ తలకు గాయం.. మెడికల్ రూమ్‌కు తరలింపు
సరికొత్త కాన్సెప్టుతో ప్రసారం అవుతూ.. సంలచనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చే దానికి మాత్రమే భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా దేశంలోనే ఎక్కడా రానంత టీఆర్పీ రేటింగ్ దక్కుతోంది. దీంతో నెంబర్ వన్ షోగా నిలుస్తోంది. ఇలా ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్.. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌తో ముందుకు వచ్చింది. 'బిగ్ బాస్ నాన్ స్టాప్' పేరిట వస్తున్న ఓటీటీ సీజన్‌కు ఆరంభం నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో షోలో హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక కంటెస్టెంట్ తలకు గాయమైంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

ఒకరోజు ఆలస్యంగా బిగ్ బాస్
‘బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు సాగబోతుంది. ఈ సీజన్‌లో ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, మధ్యలో 24 గంటల పాటు ప్రసారాన్ని ఆపేసి.. ఒకరోజు ఆలస్యంగా మళ్లీ మొదలు పెట్టారు.

మొదటి వారం ఆమె అవుట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, సరయు రాయ్, బిందు మాధవి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్ల నుంచి ఫస్ట్ వీక్ ముమైత్ ఎలిమినేట్ అయిపోయింది.

రెండు గ్రూపుల మధ్య ఫైట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త వాళ్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విభజించారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ సాగుతోంది. ఫలితంగా బిగ్ ఫైట్ నడుస్తోంది.

టీమ్‌లకు తగ్గేదేలే టాస్కు
ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ ‘తగ్గేదేలే' టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా.. వారియర్స్ టీం సభ్యులు స్మగ్లర్స్‌గా.. ఛాలెంజర్స్ టీ సభ్యులు పోలీసులుగా మారారు. పోలీసుల కళ్లు కప్పి ఇంట్లో బొమ్మల్ని స్మగ్లింగ్ చేయాల్సి ఉంటుంది.. పోలీసులు చెక్ పోస్ట్‌ల వద్ద అడ్డుకోవాలని మొదటిగా ఎవరు టార్గెట్‌ని రీచ్ అవుతారో వాళ్లే గెలిచినట్టు అని బిగ్ బాస్ వివరించాడు.

ఎవరికి వారే.. గెలుపు కోసం
‘తగ్గేదేలే' టాస్కులో భాగంగా చెక్క బొమ్మలను స్మగ్లింగ్ చేయడానికి వారియర్స్.. వాటిని అడ్డుకునేందుకు చాలెంజర్లు తెగ పోటీ పడ్డారు. బయట ఉన్న బాక్సుల్లోకి చెక్కలు రాకుండా అడ్డుకునేందుకు చాలెంజర్స్ సభ్యులు డోర్ క్లోజ్ చేశారు. ఇలా అయితే టాస్క్ నడవదని వారియర్స్ వారించారు. ఇలా చాలా సేపు ఈ విషయంలో రెండు టీమ్‌ల మధ్య గొడవ జరిగింది.

ఆ కంటెస్టెంట్‌కు గాయం
స్మగ్లింగ్ నేపథ్యంతో ఇచ్చిన ‘తగ్గేదేలే' టాస్కు హింసాత్మకంగా మారింది. చాలెంజర్లు డోర్ దగ్గర చెక్‌పోస్టు పెట్టి అడ్డుకుంటుండగా.. వారియర్స్ టీమ్ సభ్యులు చెక్క బొమ్మలను బయట ఉన్న అఖిల్‌కు అందించడం కోసం గాల్లోకి విసిరారు. ఆ సమయంలో డోర్ దగ్గర ఉన్న కొందరితో పాటు శ్రీ రాపాక తలకు ఒక చెక్క గట్టిగా తగిలింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
Recommended Video

మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లి
తలకు గాయం అవడంతో శ్రీ రాపాక విలవిలలాడిపోయింది. దీంతో సహచరులు ఆమెను మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లి ఐస్ ప్యాక్ తెచ్చుకున్నారు. ఇక, టాస్కు హింసాత్మకంగా మారడంతో చాలెంజర్స్ ఆటను ఆపేసి వాకౌట్ చేశారు. అయినప్పటికీ వారియర్స్ మాత్రం బొమ్మలను స్మగ్లింగ్ చేసి టాస్కులో విజయం సాధించారు. దీని తర్వాత మళ్లీ కొన్ని గొడవలు జరిగాయి.


Click it and Unblock the Notifications











