దుమ్మురేపుతున్న శ్రీకృష్ణ.. రామయణంను మంచి టీఆర్పీ రేటింగ్
కరోనావైరస్ కారణంగా టెలివిజన్ పరిశ్రమ స్పందించడంతో పలు షోలు, కార్యక్రమాల ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్స్‌ను పున: ప్రసారం చేసి లాక్‌డౌన్‌లో బుల్లితెర ప్రేక్షకులను టీవీలకు అంటుకుపోయేలా చేశారు. అలాంటి ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లో రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణ ధారవాహికలు ముందు వరుసలో ఉంటాయి.
అయితే తొలుత ప్రారంభించిన రామాయణం సీరియల్స్‌కు దూరదర్శన్ నేషనల్ ఛానెల్‌లో విశేష స్పందన లభించింది. ఆ తర్వాత ప్రసారమైన మహాభారత్ సీరియల్‌ను కూడా అంతే మొత్తంలో ఆదరించారు. గత రెండు నెలల్లో ఈ సిరియల్స్ టీఆర్పీ రేటింగ్ లిస్టులో టాప్ 5లలో ఒకటిగా నిలిచాయి. ఈ మూడు షోలను కూడా స్వర్గీయ రామానంద్ సాగర్ దర్శకత్వం వహించారు.

అయితే 2015లో నుంచి చూసుకొంటే రామాయణానికి అత్యదిక టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టు తెలిసింది. బార్క్ ప్రకటించే టీఆర్పీ రేటింగ్‌లో రామాయణం రికార్డు స్థాయి వ్యూవర్ షిప్ సాధించిందనే వార్తలు వచ్చాయి. అయితే రామయణం సీరియల్‌ను తాజాగా శ్రీకష్ణ సీరియల్ టీఆర్పీ రేటింగ్ విషయంలో ఆధిక్యతను సాధించినట్టు సమాచారం.
శ్రీకృష్ట సీరియల్‌లో యువ కృష్ణుడిగా నటించిన స్వప్నిల్ జోషికి నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కృష్ణ భగవానుడిగా స్వప్నిల్ ఫెర్ఫార్మెన్స్, హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారనే విషయం టీఆర్సీ రేటింగుతో స్పష్టమైంది.


Click it and Unblock the Notifications











