For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: సిరి హన్మంత్‌పై కామెంట్స్.. ఏడ్చిన శ్రీహాన్.. అందుకే ఛాన్స్ ఇచ్చారంటూ!

  |

  తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ దేశ వ్యాప్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న ఏకైక షో బిగ్ బాస్. కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఇది ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. అదే సమయంలో ఈ షో వల్ల ఎంతో మంది ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో సిరి హన్మంత్ ఒకరు. ఐదో సీజన్‌లో సందడి చేసిన ఈ అమ్మడు ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. ఇక, ఇప్పుడు ఆరో సీజన్‌లో ఆమె ప్రియుడు శ్రీహాన్ కంటెస్టెంట్‌గా వచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అతడు ఎమోషనల్ అయ్యాడు. ఆ సంగతులెంటో మీరే చూడండి!

  అన్నింటినీ మరిపించేలా ప్లాన్

  అన్నింటినీ మరిపించేలా ప్లాన్

  తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు వచ్చినా సూపర్ హిట్ అవుతుంది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఆరో దానిని కూడా మొదలు పెట్టారు. అయితే, ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్టును తీసుకు వస్తున్నారు. అంతేకాదు, ఈ సారి రికార్డు స్థాయిలో 21 మందిని తీసుకొచ్చారు. అలాగే, టాస్కుల్లో కూడా వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. మొత్తంగా వాటిని మరిపిస్తున్నారు.

  స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ భామ రచ్చ: తడిచిన బట్టల్లో అందాల ప్రదర్శన

  ఎన్నో టాస్కులు.. గొడవలతోనే

  ఎన్నో టాస్కులు.. గొడవలతోనే


  గతంలో వచ్చిన సీజన్ల కంటే ఆరో దానిలో మరింత మజాను అందించబోతున్నట్లు నిర్వహకులు ముందుగానే వెల్లడించారు. అందుకు అనుగుణంగానే ఈ సీజన్ ఆరంభం నుంచే టాస్కులు ఇస్తున్నారు. దీంతో ఇందులో మొదటి నుంచే కొంత మంది కంటెస్టెంట్ల మధ్యన గొడవలు కనిపిస్తున్నాయి. దీంతో ఆరంభంలోనే ఈ సీజన్ అందరి దృష్టినీ ఆకర్షించిందని చెప్పుకోవచ్చు.

  కెప్టెన్‌‌ బాలాదిత్య.. గీతూ జైలు

  కెప్టెన్‌‌ బాలాదిత్య.. గీతూ జైలు

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో మొదటి వారంలో శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్కును నిర్వహించారు. ఇందులో మంచి పేరు తెచ్చుకున్న బాలాదిత్య గెలిచి ఈ సీజన్ మొదటి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలాగే, వారం మొత్తానికి చెత్త ప్రదర్శన ఇచ్చిన కంటెస్టెంట్‌ను ఎంపిక చేసే ప్రక్రియనూ నిర్వహించారు. ఇందులో గీతూకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆమెను జైలుకు పంపారు.

  Bigg Boss Telugu 6: ఆ అమ్మాయికి బిగ్ బాస్ షాక్.. పిరియడ్స్‌తో ఇబ్బంది.. రిక్వెస్ట్ చేసినా వినకుండా!

  వరస్ట్ టాస్కులో ఇనాయా రచ్చ

  వరస్ట్ టాస్కులో ఇనాయా రచ్చ

  ఈ వారానికి గానూ వరస్ట్ కంటెస్టెంట్‌ను ఎంపిక చేసే ప్రక్రియ కొన్ని గొడవలతో సాగింది. ఇందులో పలువురు కంటెస్టెంట్ల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇదంతా రసాభాసగా సాగింది. ఇందులో భాగంగానే బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా తనకు ఓటు వేసిన కంటెస్టెంట్లపై ఫైర్ అయింది. అలాగే మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రచ్చ చేసింది.

  సిరి ప్రస్తావన.. ఏడ్చేసిన శ్రీహాన్

  సిరి ప్రస్తావన.. ఏడ్చేసిన శ్రీహాన్

  వరస్ట్ టాస్క్ జరుగుతోన్న సమయంలో ఇనాయా సుల్తానా 'నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఆడుతున్నాను. నాకు ఎవరి సపోర్ట్ లేదు. బయట కూడా నాకు ఎలాంటి సపోర్టు లేదు. శ్రీహాన్ నీకు బయట సిరి ఉంది. తనే మొత్తం చూసుకుంటుంది' అని కామెంట్ చేసింది. దీంతో శ్రీహాన్ 'బయట విషయాలు ఇక్కడ మాట్లాడొద్దు' అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత చాలాసేపు ఏడ్చేశాడు.

  టాప్ కిందకి జరిపి షాకిచ్చిన శ్యామల: ఇది అట్టాంటిట్టాంటి షో కాదుగా!

  శ్రీహాన్‌కు ఓదార్పు.. గుర్తొచ్చింది

  శ్రీహాన్‌కు ఓదార్పు.. గుర్తొచ్చింది


  ఇనాయా సుల్తానా.. సిరి హన్మంత్ పేరు తీసుకు రావడంతో శ్రీహాన్ బాగా ఫీల్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు ఎమోషనల్ అయ్యాడు. దీంతో కొందరు వెళ్లి అతడిని ఓదార్చారు. ఆ తర్వాత ఇనాయాతో శ్రీహాన్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. చివరికి ఆమె అతడికి సారీ చెప్పడంతో ఈ వాదను పుల్‌స్టాప్ పడిపోయినట్లైంది.

  ఆఫర్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీహాన్

  ఆఫర్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీహాన్

  గొడవ అనంతరం ఇనాయా సుల్తానా సారీ చెప్పిన తర్వాత శ్రీహాన్ 'నాకు గుర్తింపు రావడానికి, నా లైఫ్ మారిపోడానికి సిరినే కారణం. తనవల్లే నేను హ్యాపీగా ఉన్నారు. కానీ, నాకు బిగ్ బాస్ ఆఫర్ రావడానికి మాత్రం నా టాలెంటే కారణం. నా టాలెంట్‌తోనే ఈ గేమ్ ఆడుతున్నాను' అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇనాయా సుల్తానా ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయింది.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Telugu 6th Season Running Successfully. Shrihan Chotu Emotional About Siri Hanmanth in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X