For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: కృతి శెట్టిని పడేసిన శ్రీహాన్.. హీరోయిన్ నుంచి సర్‌ప్రైజ్.. ఇదే ఫస్ట్ టైం అంటూ!

  |

  ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం అయినా.. ఊహించని రీతిలో తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుని సూపర్ డూపర్ హిట్ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. మన భాషలోకి ఆలస్యంగా వచ్చినా.. భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించిన ఈ షో.. టీఆర్పీ రేటింగ్‌లో స్టార్ మాను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. ఫలితంగా తెలుగు బిగ్ బాస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అదే సమయంలో కొన్ని సీజన్లను భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకుంది. ఇక, ఇటీవలే ఆరోది కూడా ప్రారంభం అయింది. మొదటి నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీజన్‌ తాజా ఎపిసోడ్‌లో హీరోయిన్ కృతి శెట్టి.. కంటెస్టెంట్ శ్రీహాన్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

   అన్నీ మరిపించేలా.. షాకింగ్‌గా

  అన్నీ మరిపించేలా.. షాకింగ్‌గా

  తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు వచ్చినా హిట్ అవుతుంది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఆరో దానిని కూడా మొదలెట్టారు. అయితే, ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్టును తీసుకొస్తున్నారు. అంతేకాదు, ఈ సారి రికార్డు స్థాయిలో 21 మందిని తీసుకొచ్చారు. అలాగే, టాస్కుల్లో కూడా వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. కానీ, మొదట్లోనే దీనికి రేటింగ్ తక్కువగా వచ్చింది.

  దిశా పటానీ ఎద అందాల ప్రదర్శన: వామ్మో ఆమెనిలా చూస్తే నిద్ర పట్టదు!

  రెండో కెప్టెన్‌గా ఎంపికైన రాజ్

  రెండో కెప్టెన్‌గా ఎంపికైన రాజ్

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రెండో వారానికి గానూ జరిగిన కెప్టెన్సీ టాస్కులో రాజశేఖర్ విజేతగా నిలిచాడు. ఇంట్లోని సభ్యులను ఇద్దరిద్దరుగా విభజించి.. వాళ్లను తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు ఓటు వేయమని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో రాజశేఖర్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో అతడు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో అతడికి గత కెప్టెన్ బాలాదిత్య కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను అందించాడు.

  బిగ్ బాస్‌ షోలోకి సుధీర్, కృతి

  బిగ్ బాస్‌ షోలోకి సుధీర్, కృతి

  బిగ్ బాస్ షోలోకి అప్పుడప్పుడూ సెలెబ్రిటీలు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. సుధీర్ బాబు, కృతి శెట్టి గెస్ట్‌లుగా హౌస్‌లోకి వచ్చారు. వాళ్లిద్దరూ ఇంటి సభ్యులతో సరదా సరదా టాస్క్‌లు ఆడించారు. ఆ తర్వాత పాపులర్ డైలాగ్‌లు చెప్పించడంతో పాటు స్కిట్లు చేయించారు.

  బెడ్‌పై ఈషా రెబ్బా అందాల ఆరబోత: నెట్ డ్రెస్‌లో మొత్తం కనిపించేలా!

  వాళ్లు డైలాగ్‌లు.. వీళ్లు స్కిట్లు

  వాళ్లు డైలాగ్‌లు.. వీళ్లు స్కిట్లు

  సుధీర్ బాబు, కృతి శెట్టి ఇచ్చిన టాస్కుల్లో భాగంగా సింగర్ రేవంత్, గీతూ రాయల్ అదిరిపోయే పంచ్ డైలాగులు చెప్పారు. ఆ తర్వాత ఆర్జే సూర్య కొంత మంది హీరోల వాయిస్‌లను మిమిక్రీ చేశాడు. ఇక, శ్రీహాన్, ఫైమా పోకిరి సినిమాలోని లిఫ్ట్ సీన్‌ను రీ క్రియేట్ చేశారు. అలాగే, సూర్య, చంటి సహా కొంత మంది వెంకీ ట్రైన్ సీన్‌ను చేశారు. శ్రీ సత్య, శ్రీహాన్, రాజ్‌ దెయ్యం స్కిట్ చేశారు.

   అబ్బుర పరిచిన శ్రీహాన్ టాస్క్

  అబ్బుర పరిచిన శ్రీహాన్ టాస్క్

  'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' హీరో హీరోయిన్లు సుధీర్ బాబు, కృతి శెట్టి ఇచ్చిన టాస్కుల్లో భాగంగా శ్రీహాన్ తనదైన టాలెంట్లతో ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా అతడు మహేశ్ బాబును ఇమిటేట్ చేయడం బాగుంది. అంతేకాదు, 'ప్రేమకథా చిత్రం' సినిమాలోని సీన్‌ను రీక్రియేట్ చేసే సమయంలో సప్తగిరి వాయిస్‌ను అచ్చుగుద్దినట్లుగా దింపేసి తెగ నవ్వించాడు.

  బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!

  బెస్ట్ యాక్టర్.. బెస్ట్ యాక్ట్రెస్

  సుధీర్ బాబు, కృతి శెట్టి ఇచ్చిన టాస్కుల్లో ఇంటి సభ్యులు అందరూ అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు. ఇక, చివర్లో వీళ్లిద్దరూ ఉత్తమ నటుడు, ఉత్తమ నటికి సంబంధించిన అవార్డులు కూడా ప్రకటించారు. ఇందులో ఆద్యంతం ఆకట్టుకున్న శ్రీహాన్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డును, వేరియేషన్స్ చూపిస్తూ నటించిన శ్రీ సత్యకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందించారు.

  శ్రీహాన్ ఎమోషనల్ కామెంట్

  శ్రీహాన్ ఎమోషనల్ కామెంట్

  సుధీర్ బాబు, కృతి శెట్టి చేతుల మీదగా బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్న తర్వాత శ్రీహాన్ ఎమోషనల్ అయ్యాడు. 'నా లైఫ్‌లో మొట్టమొదటి అవార్డు ఇది. ఇప్పుడు నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. నా మొదటి అవార్డును అందించినందుకు మీ ఇద్దరికీ థ్యాంక్యూ' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులను బాగానే రంజింపజేసింది.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Telugu 6th Season Running Successfully. Shrihan Chotu Receives Best Actor Award from Krithi Shetty in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X