For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సిరిని అర్ధం చేసుకోలేం.. అస్సలు దేకదు అంటూ ఆ పుకార్లకు బ్రేక్ పెట్టిన శ్రీహాన్

  |

  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్ తన స్నేహితురాలు సిరి హనుమంతుతో క్లోజ్ గా మూవ్ అవ్వడం వల్ల కప్ దాకా వెళ్ళలేక పోయాడు అని ఇప్పటికీ చాలా మంది భావిస్తూ ఉంటారు. బయట వేరు వేరుగ లవర్స్ ను కలిగి ఉన్న వాళ్ళు ఇద్దరూ లోపలికి వెళ్ళాక క్లోజ్ అవ్వడాన్ని ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. బయటకు వచ్చాక షణ్ముఖ్ జస్వంత్ కు తన ప్రియురాలు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పగా మరో జంట కూడా విడిపోవచ్చు అనే అంచనాలు వెలువడ్డాయి.. ఈ విషయం మీద ఇప్పటి దాకా పెద్దగా చర్చ జరగలేదు కానీ ఇప్పుడు మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  నెగిటివిటీ

  నెగిటివిటీ

  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొత్తం మీద ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నది బిగ్ బాస్ విన్నర్ సన్నీ అయితే నెగిటివిటీ కూడగట్టుకున్నది మాత్రం షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతు. షణ్ముఖ్ జస్వంత్ కి బయట దీప్తి సునైనా అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది. సిరి హనుమంతుకు కూడా శ్రీహాన్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయితే హౌస్ లోపల ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారు. ఈ విషయాన్ని బయట ఉన్న ఆడియన్స్ పెద్దగా రిసీవ్ చేసుకోలేకపోయారు.

   బ్రేకప్ చెప్పేసినట్లే

  బ్రేకప్ చెప్పేసినట్లే


  దీంతో ఆమె ప్రియుడిని మోసం చేస్తోందని అతడు ప్రియురాలిని మోసం చేస్తున్నాడని వాళ్ళిద్దరి మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగాయి. ఆ తర్వాత కూడా ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో భాగంగా హౌస్ లోపలికి వచ్చిన దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ కి, శ్రీహాన్ శ్రీహనుమత్ కి సపోర్ట్ చేశారు కానీ బయటకు వచ్చిన తర్వాత వారి మధ్య అంతగా సంబంధాలు బాగా లేదనే ప్రచారం జరిగింది. దానికి ఊతం ఇస్తూ దీప్తి సునయన తాను బ్రేకప్ చెబుతున్నట్లు ప్రకటిస్తే శ్రీహాన్ మాత్రం సిరి హనుమంతు ఫోటోలు డిలీట్ చేశాడని అంటే దాదాపుగా బ్రేకప్ చెప్పేసినట్లేనని ప్రచారం జరిగింది.

  నవ్వులేనవ్వులు

  నవ్వులేనవ్వులు


  అయితే అదేమీ జరగలేదని తాజాగా వెల్లడైంది. అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు ఎవరికి వారు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా యాంకర్ రవి తన పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాడు. అందులో నవ్వులేనవ్వులు పేరిట ఒక ప్రోగ్రాం ప్లాన్ చేశాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రియా, ప్రియాంక, సిరి హనుమంతు ముగ్గురిని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లి వారితో సరదాగా గడిపారు..

  అసలు దేకదు

  అసలు దేకదు


  అదే సమయంలో శ్రీహాన్ ఒక వీడియో మెసేజ్ సిరి కోసం వదలగా దాన్ని రవి యూట్యూబ్ ఛానల్ ప్రోమో లో చూపించాడు. ఆ వీడియోలో సిరిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుందని పేర్కొన్న శ్రీహన్ నాకైతే ఇప్పటికీ పడుతూనే ఉందని చెప్పుకొచ్చాడు. ఇక సిరి చాలా పట్టుదల గల అమ్మాయి అని ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక దాన్ని కచ్చితంగా సాధించి తీరుతుందని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అసలు దేకదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

   తన కష్టంతోనే ఎదిగిందని

  తన కష్టంతోనే ఎదిగిందని


  అంతేకాక తను విశాఖపట్నంలో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి ఏదైనా సాధించాలని అనుకున్నది అని అలాగే హైదరాబాద్ వచ్చి యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి సీరియల్స్, సీరియల్స్ నుంచి సినిమాలు అక్కడి నుంచి మొన్న బిగ్ బాస్ వరకు తన కష్టంతోనే ఎదిగిందని శ్రీహాన్ చెప్పుకొచ్చాడు. ఆమెను ఎంత మాట్లాడినా అర్థం చేసుకోవడం కష్టం అనడంతో సిరి కళ్ళు చెమ్మగిల్లాయి, ఈ క్రమంలో పక్కనే ఉన్న ప్రియ ఆమెకు ధైర్యం చెప్పింది. ఇక ఈ వీడియో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేస్తున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు యాంకర్ రవి.

  English summary
  Shrihan emotional comments about Siri Hanmanth gone viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X