Bigg Boss: ఆమె బాడీపై శ్రీహాన్ హాట్ కామెంట్స్.. బాడీలో ఫీచర్స్ సూపర్.. రాత్రి అయితే ఆగట్లేదు అంటూ!
ఇండియాలోని వేరే భాషల్లో చాలా కాలం క్రితమే మొదలైనా.. ఆరేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది బిగ్ బాస్ షో. ఎన్నో అనుమానాలతో మన భాషలోకి వచ్చిన దీనికి చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులు భారీ రెస్పాన్స్ అందించారు. దీంతో ఇది తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ షోగా మారిపోయింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో ఓ అమ్మాయిపై శ్రీహాన్ హాట్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

వాటికి భిన్నంగా.. రేటింగ్ తేడా
తెలుగులో బిగ్ బాస్ షో ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌తో కంప్లీట్ చేసుకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, రేటింగ్ మాత్రం రావడం లేదు.

అతడితో క్లోజ్‌గా ఉన్న శ్రీ సత్య
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. అందులో శ్రీ సత్య చాలా హైలైట్ అయింది. ఎంతో అందంగా ఉండే ఈ చిన్నదానికి ఫాలోయింగ్ కూడా క్రమంగా పెరుగుతోంది. ఇక, శ్రీ సత్యను పడేయడానికి అర్జున్ కల్యాణ్ తెగ ప్రయత్నం చేశాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో ప్లాన్లు చేశాడు. కానీ, ఆమె మాత్రం అతడిని లైట్ తీసుకుంది.

వాళ్లతో క్లోజ్ అయిపోయిందిగా
అర్జున్ కల్యాణ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో శ్రీ సత్య అతడితో చాలా క్లోజ్‌గా వ్యవహరించింది. కానీ, అతడు బయటకు వెళ్లిపోయిన తర్వాత శ్రీహాన్‌కు ఆమె బాగా దగ్గరైంది. వీళ్లిద్దరూ కలిసి రేవంత్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. ఇందులో భాగంగానే తరచూ కలిసి ఆడుతూ, జోకులు చేసుకుంటూ, వేరే వాళ్లతో గొడవలకు దిగుతూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతూనే ఉన్నారు.

శ్రీహాన్‌తో కలిసి ఓవర్ యాక్టింగ్
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో శ్రీ సత్యకు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ, క్రమంగా ఆమె చెడ్డపేరును మూటగట్టుకుంటూనే ఉంది. దీనికి కారణం శ్రీహాన్‌తో కలిసి ఈ బ్యూటీ తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తోంది. తరచూ గొడవలు చేయడం, వెటకారంగా మాట్లాడడం, ఎదుటి వాళ్లను వెక్కిరించడం వంటివి చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరి ఆట, వ్యవహార శైలిపై ట్రోల్స్ వస్తున్నాయి.

కలిసి పడుకుని... దుప్పటితో
శ్రీహాన్, శ్రీ సత్య బిగ్ బాస్ హౌస్‌లో వ్యవహరిస్తోన్న తీరుపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం వీళ్లిద్దరూ కలిసి ఒకే బెడ్‌పై పడుకుంటున్నారన్న న్యూస్ బయటకు రావడమే. అంతేకాదు, వాళ్ల క్లోజ్ ఫ్రెండ్ రేవంత్ సైతం మొన్నటి ఎపిసోడ్‌లో ‘నేను రమ్మంటే ఎందుకు వస్తావ్? శ్రీ సత్య పిలిస్తే దుప్పటి పట్టుకుని వెళ్లిపోతావ్' అని దారుణంగా మాట్లాడి పరువు తీశాడు.

శ్రీహాన్ బాడీపై నాటీ కామెంట్
ఇక, శనివారం జరిగిన ఎపిసోడ్‌లో శుక్రవారం జరిగిన కంటెంట్‌ను ముందుగా చూపించారు. అందులో శ్రీ సత్యను శ్రీహాన్ ఆట పట్టించగా.. రేవంత్ పక్కనే ఉండి మరింతగా రెచ్చగొట్టాడు. ఆ సమయంలో శ్రీహాన్ ‘శ్రీ సత్యది మామూలు ఫిగర్ కాదు.. ఫీచర్లు కూడా బాగుంటాయి. అదేంటి మొబైల్‌కు చెప్పినట్లు చెప్పా' అని నాలుక కరుచుకున్నాడు. దీంతో రేవంత్ సెటైర్లు వేశాడు.

పది అయితే ఆగడం లేదని
శ్రీహాన్ మాటలకు శ్రీ సత్య ‘నేనేమీ అందగత్తెను కాదులే. మీ అంత కాకపోయినా యావరేజ్‌గా ఉంటాను' అని చెప్పింది. అప్పుడు అతడు ‘నువ్వు ఏవరేజ్ ఏంటి? రాత్రి పది అయితే తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లు అందరూ టీవీల ముందు వాలిపోతున్నారు. అలాంటి ఫిగర్ నీది' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో శ్రీ సత్య ముసిముసి నవ్వులు నవ్వుతూ తెగ మురిసిపోయింది.


Click it and Unblock the Notifications











