Bigg Boss Telugu 6: సిరిని వద్దనుకున్న శ్రీహాన్.. ఈ సీజన్‌లో తొలిసారి ఇలా.. వాళ్లకు ప్లస్ అయినట్లే!

ఊహకే అందని విధంగా తెలుగు బుల్లితెరపై ప్రేక్షకాదరణను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కంటెంట్‌తో నడిచేదే అయినా.. మన ప్రేక్షకులకు ఇది చాలా త్వరగానే చేరువైంది. అందుకే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరోది కూడా రన్ అవుతోంది. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హౌస్‌లోని కొందరు కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. ఫలితంగా నిన్నటి ఎపిసోడ్ జనరంజకంగా సాగింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

ఆరో సీజన్ రేటింగ్ రావట్లేదుగా

ఆరో సీజన్ రేటింగ్ రావట్లేదుగా

బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకూ ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లు పూర్తి అయ్యాయి. దీంతో ఆరో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సీజన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా ఫిక్స్ అంటూ తీసుకొచ్చారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని టాస్కులు చూపిస్తున్నా.. స్పందన అంతంతగానే వస్తోంది. దీంతో రేటింగ్ క్రమంగా పడిపోతోంది.

గొడవల తర్వాత.. ఆ చర్చలతో

గొడవల తర్వాత.. ఆ చర్చలతో

బిగ్ బాస్ ఆరో సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగానే సాగుతోంది. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం ఎంతో రసవత్తరంగా సాగింది. ఇందులో పలువురు కంటెస్టెంట్ల మధ్య భీకరమైన మాటల యుద్ధం జరిగింది. దీంతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో రచ్చ రచ్చగా సాగింది. సోమవారం గొడవల తర్వాత కొందరు కంటెస్టెంట్లు ఎమోషనల్ అయిపోయారు.

బిగ్ బాస్ బ్యాటరీ రీచార్జ్ టాస్క్

బిగ్ బాస్ బ్యాటరీ రీచార్జ్ టాస్క్

ప్రతి వారం కెప్టెన్సీ కోసం పోటీ పడే వాళ్లను ఎంపిక చేసుకునేందుకు గానూ బిగ్ బాస్ ఓ టాస్క్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ వారం 'బ్యాటరీ రీచార్జ్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో బిగ్ బాస్ పిలిచిన కంటెస్టెంట్‌కు ఆఫర్ వస్తుంది. దానికోసం బ్యాటరీ రీచార్జ్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రీచార్జ్ కోసం కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది.

ముందుగా శ్రీహాన్‌ను పిలిచారు

ముందుగా శ్రీహాన్‌ను పిలిచారు

'బ్యాటరీ రీచార్జ్' టాస్కులో భాగంగా ముందుగా బిగ్ బాస్ శ్రీహాన్‌ను కన్‌ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. అతడికి వీడియో కాల్ (35 శాతం), సిరి నుంచి ఆడియో మెసేజ్ (30 శాతం), ఇంటి భోజనం (15 శాతం) ఆప్షన్లను ఇచ్చాడు. వీటిలో కచ్చితంగా ఒకటి ఎంచుకోవాలని చెప్పాడు. దీంతో తనకంటే వేరే వాళ్లకు అవసరం ఉందన్న శ్రీహాన్.. తక్కువ శాతం ఉన్న భోజనానికి ఒప్పుకున్నాడు.

ఆడియో కాల్ కోరుకున్న పింకీ

ఆడియో కాల్ కోరుకున్న పింకీ

'బ్యాటరీ రీచార్జ్' టాస్కులో భాగంగా సుదీపకు బిగ్ బాస్ ఆడియో కాల్ (30 శాతం), భర్త ఫొటోతో ఉన్న టీషర్ట్ (40 శాతం), ఇంటి భోజనం (35 శాతం) ఆప్షన్లను ఇచ్చాడు. వీటిలో ఆమె తనకు ఏదీ వద్దని ఏడ్చేసింది. కానీ, బిగ్ బాస్ హెచ్చరించడంతో ఆడియో కాల్ ఆప్షన్ ఎంచుకుంది. ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో ఉన్న బూత్‌కు ఫోన్ వచ్చింది. దీంతో సుదీప తన భర్తతో మాట్లాడింది.

వీడియో కాల్ కోరుకున్న ఆది

వీడియో కాల్ కోరుకున్న ఆది

'బ్యాటరీ రీచార్జ్' టాస్కులో భాగంగా ఆది రెడ్డికి బిగ్ బాస్ ఆడియో మెసేజ్ (30 శాతం), వీడియో కాల్ (40 శాతం), పాప ఫొటో ఉన్న టీషర్ట్ (35 శాతం) ఆప్షన్లను ఇచ్చాడు. ఇందులో చాలా సేపు ఆలోచించిన తర్వాత అతడు వీడియో కాల్ ఆప్షన్ కోరుకున్నాడు. దీంతో అతడి భార్య ఎల్‌ఈడీ ద్వారా మాట్లాడారు. ఆ సమయంలో ఆది రెడ్డి ఈ సీజన్‌లోనే తొలిసారి వెక్కి వెక్కి ఏడ్చేశాడు.

తొలిసారి ఇలా.. ఓటింగ్ ఫుల్

తొలిసారి ఇలా.. ఓటింగ్ ఫుల్

మంగళవారం జరిగిన ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో ఎమోషనల్‌గా సాగింది. ఇందులో గతంలో ఎప్పుడూ ఏడవని ఆది రెడ్డి కూడా కన్నీటి పర్యంతం అయ్యాడు. అలాగే, అతడితో పాటు నిన్నటి ఎపిసోడ్‌లో ఛాన్స్ వచ్చిన మరో ఇద్దరు కూడా బాగా ఏడ్చారు. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఈ ముగ్గురికీ ఓటింగ్ భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోందనే టాక్ బాగానే వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X