స్టన్నింగ్ లుక్‌తో కుర్రకారు మతిపోగుడుతున్న శ్రియా.. 41 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిలా!
అందాల తార శ్రియా శరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె వయసు పెరుగుతున్నా కొద్ది ఆమె అందాలు కూడా పెరుగుతున్నాయి. 41 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తూ కుర్రకారు మదిని దోస్తున్న ఈ ముద్దుగుమ్మకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియా వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే అందాలు చూపిస్తూ కుర్రకారు మతిపోగెట్టేస్తోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
సినీ రంగంలో అడుగు పెట్టినప్పుడు శ్రియా సరన్ ఎలా ఉందో... నేటికీ అలాగే కనిపిస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా వేధికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన చిత్రాలను అప్ లోడ్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఫొటోను ఇన్ స్టా వేదికగా ఓ అద్భతమైన ఫొటోను షేర్ చేసింది. అందులో గోల్డెన్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుంది. స్లీవ్ లెస్ లో ఉన్న ఈ డ్రెస్ లో శ్రియా నిజంగానే అదిరిపోయింది. పెన్సిల్ హిల్స్ వేసుకున్న ఈమె తన కాలు పైకెత్తి మరీ ఫోజులు పెట్టింది. ఇందులో శ్రియా ఒంపుసొంపులు అన్నీ చాలా బాగా కనిపిస్తుండగా.. కుర్రకారు మొత్తం ఫిదా అయిపోతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈమె ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
శ్రియా.. నువ్వే నా గుండె లయ.. నీ అందం రోజు రోజుకూ పెరిగిపోతుంది, హాట్ బ్యూటీ, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోజురోజుకూ నీ అందం తగ్గాల్సిందిపోయి ఇంతలా ఎలా పెరుగుతుందంటూ అడుగుతున్నారు. బేబీ డాల్ లా కనిపిస్తున్నావని ఓ నెటిజెన్ తన మనసులోని మాటను కామెంట్ రూపంలో వెల్లడించాడు. ఏది ఏమైనా శ్రియా శరణ్ అందాలకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.. మీరూ ఓ లుక్కేయండి.

మూడేళ్ల కిందటే తన ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్ ను పెళ్లి చేసుకున్న శ్రియా.. కరోనా సమయంలో అంటే 2020 ఓ పాపకు జన్మనిచ్చింది. ఆమెకు రాధ అనే పేరును కూడా పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. పాప పుట్టిన తర్వాత అంటే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా కబ్జా, మ్యూజిక్ స్కూల్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత నుంచి ఏ చిత్రంలోనూ కనిపించకపోయినా... సోషల్ మీడియా వేధికగా మాత్రం అందరికీ అందుబాటులోనే ఉంటుంది.


Click it and Unblock the Notifications











